మంగళగిరి, త్రిశూల్ న్యూస్ :
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నేడు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యాలయ కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు, రాష్ట్ర కార్యదర్శి ఏవి రమణ, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్, ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్, అన్నవరం ట్రస్ట్ బోర్డ్ మాజీ సభ్యులు రావిపాటి సత్యనారాయణ, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, కార్యాలయ సిబ్బంది తదితరులు అధిక అధిక సంఖ్యలో హాజరై వేడుకలను వైభవంగా జరిపారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి గణపతి బప్పకి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం అర్చకులు హోమాలు, ఆశీర్వచనాలు చేశారు. పార్టీ నేతలు గణపతి బప్పకి మొక్కులు చెల్లించి, ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. రాష్ట్రం అభివృద్ధి, ప్రజల సుఖసంతోషాలు, పార్టీ బలపరచాలని గణనాధుడిని ప్రార్థించారు. ఈ వేడుకతో టీడీపీ కార్యాలయం పసిడి వర్ణాల అలంకరణలతో, గణపతి శ్లోకాలతో కిక్కిరిసిపోయింది.

No comments:
Post a Comment