నాయుడుపేట లో గంజాయి ముఠా గుట్ట రట్టు చేసిన పోలీసులు..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

August 27, 2025

నాయుడుపేట లో గంజాయి ముఠా గుట్ట రట్టు చేసిన పోలీసులు..!

- నాయుడుపేట పట్టణ సీఐ బాబి ఆధ్వర్యంలో 11.5 కిలోల గంజాయి పట్టివేత 

- ఆరుగురు గంజాయి ముఠా సభ్యులు అరెస్ట్.. 2 మోటార్ బైకులు,4 సెల్ ఫోన్లు స్వాధీనం
నాయుడుపేట, త్రిశూల్ న్యూస్ :
తిరుపతి జిల్లా నాయుడుపేటలో పట్టణ సి ఐ బాబి పర్యవేక్షణలో విద్యార్థులు, యువతే లక్ష్యంగా గంజాయి విక్రయాలు చేస్తున్న ఆరు మందిని స్థానిక పోలీసులు అరెస్టు చేసి గుట్టురట్టు చేశారు. నాయుడుపేట డీఎస్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న నాయుడుపేట డి ఎస్ పి చెంచుబాబు గంజాయి విక్రయ ముఠా వివరాలను వెల్లడించారు. నాయుడుపేట పట్టణంలో విద్యార్థులు యువత లక్ష్యం గా ఎంచుకొని గంజాయ విక్రయాలు చేస్తున్న ఆరు మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రెండున్నర లక్షల రూపాయల విలువ గల 11.30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే వారి వద్ద ఉన్న నాలుగు సెల్ ఫోన్లు, రెండు మోటార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. గంజాయి సేవించడానికి అలవాటు పడ్డ 14 మంది విద్యార్థులతో పాటు కొంత మంది యువతకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు డీఎస్పీ తెలియజేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages