తిరుపతిలో ప్రజాస్వామ్య రక్షణకై జరిగే సదస్సును జయప్రదం చేయండి - సిపిఎం - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

October 01, 2025

తిరుపతిలో ప్రజాస్వామ్య రక్షణకై జరిగే సదస్సును జయప్రదం చేయండి - సిపిఎం

తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
ఈనెల మూడవ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న రామ తులసి కళ్యాణ మండపంలో ప్రజాస్వామ్య రక్షణకై సదస్సు నిర్వహించడం జరుగుతుందని ఈ సదస్సుకు సిపిఎం పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ డివి రాఘవులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని ఈ సదస్సుకు సంబంధించిన కరపత్రాలను నేడు యశోద నగర్ లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు పాలన వలన ప్రజలకు మేలు జరుగుతుందని పాలకులు నమ్మబలికారని . ఆచరణలో మేలు సంగతి దేవుడు ఎరుగు కీడు మాత్రం మెండుగా జరుగుతుందని ఎద్దేవ చేశారు. అనేక మంది త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును కారు చౌకగా అమ్మేస్తున్నారని అమ్మేదానికి వాడెవడు రా కొనేదానికి వీడెవడో రా అని గద్దించిన పాలకులు నూలు నేడు మూతపడ్డాయని విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం అందించకుండా వారి పరిస్థితి అరణ్య రోదనగా మారిందని మండిపడ్డారు. గిరిజన ప్రాంతాలను బడా కార్పొరేట్లకు అమ్మడం మీద ఉన్న శ్రద్ధ గిరిజన బ్రతుకులు బాగు చేయడం మీద లేదని అన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో చార్జీల పేరుతో విద్యుత్ చార్జీ మోత విపరీతంగా భాదుతున్నారని అన్నారు. రైతుల వద్ద బలవంతపు భూసేకరణ చేసి కార్పొరేట్లకు అప్పగిస్తున్న వైనం కలవరం పెడుతుంది అన్నారు. పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పనికి బదులు 12 గంటలు పని విధానం తెచ్చి కార్మికుల దోపిడీకి బాటలు వేస్తున్నారని విద్యా విధానాన్ని నాశనం చేసే అనేక రకాల పద్ధతులను అనుసరిస్తున్నారని విమర్శించారు. డబుల్ ఇంజన్ సర్కార్లో ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉందో తెలపడానికి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ప్రసంగం తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సమావేశం కు వామపక్ష ప్రజాస్వామ్యవాదులు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు టి సుబ్రమణ్యం, కే వేణుగోపాల్, బి రవి, కె.ఆర్.ఎస్ మన్యం, మునిరాజా, పి బుజ్జి, ఈ సుజాత, పద్మజ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages