Trishul News

చేతి వృత్తుల వారికి తోడుగా నిలిచేందుకే జగనన్న తోడు అమలు - సీఎం జగన్

- జిల్లాలో 13,093 మంది గ్రామీణ, 4, 840 మంది పట్టణ లబ్దిదారులకు లబ్ది 

- జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ 
చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
చిరు వ్యాపారులకు సాంప్రదాయ చేతి వృత్తుల వారికి తోడుగా నిలిచేందుకు జగనన్న తోడు కార్యక్రమం అమలు చేయడం జరుగుతున్నదని రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వర్చ్యు వల్ విధానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహ న్ రెడ్డి వ్యాపారులకు తోడుగా నిలబడాలనే సదుద్దేశ్యంతో 5 వ విడత జగనన్న తోడు పథకంను ప్రారంభించి అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేసే కార్యక్రమాన్ని కంప్యూటర్ లో బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశపు మందిరం నుండి జెడ్పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, రాష్ట్ర విదేశీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్రరెడ్డి, జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్, చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ అముద, మాజీ శాసన సభ్యులు గాంధీ, డిఆర్డిఏ పిడి తులసి, జెడ్పి సిఈఓ ప్రభాకర్ రెడ్డి, ఇతర సoబంధిత అధి కారులు,లబ్దిదారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు వడ్డీలకు అప్పు తెచ్చుకుని వ్యాపారం చేసే పని లేకుండా జగనన్న తోడు కార్యక్రమం ద్వారా లబ్ది చేకూర్చడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లాలో జగనన్న తోడు పథకం ద్వారా 13,093 మంది గ్రామీణ, 4,840 మంది పట్టణ లబ్దిదారులకు లబ్ది పొందనున్నారని తెలిపారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో 7 నియోజకవర్గాల వారీగా గ్రామీణ చిత్తూరుకు చెందిన 825 మందికి రూ.82.5 లక్షలు, జిడి నెల్లూరుకు చెందిన 2,958 మందికి రూ.295.8 లక్షలు, కుప్పంకు చెందిన 1,635 మందికి రూ.163.5 లక్షలు, నగరికి చెందిన 1005 మందికి రూ.100.5 లక్షలు, పలమనేరుకు చెందిన 2117 మందికి రూ.211.7 లక్షలు, పుంగనూరుకు చెందిన 2007 మందికి రూ.200.7 లక్షలు, పూతలపట్టుకు చెందిన 2,546 మందికి రూ.254.6 లక్షలు మొత్తం 13,093 మందికి రూ. 13.09 కోట్లు రుణాలు అందించడం జరుగుతుందని తెలిపారు. పట్టణ ప్రాంతాలలో మెప్మా ద్వారా కార్పొరేషన్ ల వారీగా చిత్తూరుకు చెందిన 2,340 మందికి రూ.2.34 కోట్లు, నగరికి చెందిన 973 మందికి రూ.97.3 లక్షలు, పలమనేరుకు చెందిన 611 మందికి రూ.61.1 లక్షలు, పుంగనూరుకు చెందిన 916 మందికి రూ.91.6 లక్షలు మొత్తం 4,840 మందికి రూ.4.84 కోట్లు రుణాలు అందించడం జరుగుతుందని తెలిపారు. జగనన్న తోడు పథకం ద్వారా రుణాలు స్వీకరించి క్రమం తప్పకుండా తిరిగి చెల్లించిన లబ్దిదారులైన జిల్లాకు చెందిన 37,783 మందికి రూ.69,43,506లు వడ్డీ నగదును రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వారి ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో భాగంగా జగనన్న తోడు క్రింద 13,093 మంది గ్రామీణ, 4,840 మంది పట్టణ లబ్దిదారులకు సంబంధించిన మెగా చెక్కును అతిథుల చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేసారు.

Post a Comment

Previous Post Next Post