Trishul News

వసతి గృహాలలో నాణ్యమైన భోజనం అందించాలి - జిల్లా కలెక్టర్

చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
ప్రభుత్వ వసతి గృహాలలో నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. జిల్లా కలెక్టర్ బుధవారం సాయంత్రం పెనుమూరు మండల కేంద్రంలోని బాలుర, బాలికల హాస్టల్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ శుభ్రతను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మెనూ ప్రకారం ఆహార పదార్థాలు అందిస్తున్నారా లేరా అని విద్యార్థులను ప్రశ్నించారు. టాయిలెట్లు ఇతర సౌకర్యాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేయాలని మెనూ ప్రకారం తప్పనిసరిగా ఆహారం అందించాలని, విద్యార్థులు వారికి ఇంటి వద్ద సౌకర్యాలు లేకపోవడంతో హాస్టళ్లకు రావడం జరుగుతుందని ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం నాణ్యమైన భోజనం, చదువు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందని హాస్టల్ సిబ్బందితో అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ బాలికల హాస్టల్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. సాయంత్రం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఆహారం మిను ప్రకారం ఇస్తున్నారా లేదా అని విద్యార్థునులను అడిగారు. అదేవిధంగా ఆహార పదార్థాలను పరిశీలించారు.

Post a Comment

Previous Post Next Post