Trishul News

సోషల్ మీడియా పోస్టులపై కుప్పం టిడిపి మహిళా నేతలు పిర్యాదు..!

- నారా లోకేష్ పై చేస్తున్న ఆరోపణలు నిరాధారణమైనవి

- వైసిపి నేత దేవేంద్ర రెడ్డిపై చర్యలు తీసుకోండి

-  కుప్పం మహిళా విభాగం ఇంచార్జి అనసూయ, యువత అధ్యక్షులు మణి 
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై తప్పుడు ఆరోపణలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వైసిపి నేత, ఆంధ్రప్రదేశ్ పారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు దేవేంద్ర రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుప్పం నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు అనసూయ, నియోజకవర్గం యువత అధ్యక్షులు మణిలు కోరారు. నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన దేవేంద్ర రెడ్డిపై కుప్పం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. స్వర్గీయ నందమూరి తారకరామారావు కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్యకు లోకేష్ కారణమంటూ తప్పుడు సమాచారాలు సృష్టించి బురదజల్లడం మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వ భూ రికార్డుల ప్రకారం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో 273, 274, 275, 276 సర్వే నంబర్లలో భూమి లేదనే వాస్తవాన్ని గ్రహించాలని సూచించారు. తప్పుడు పోస్టులతో లోకేష్ పై సోషల్ మీడియాలో దేవేంద్ర రెడ్డి గుర్రంపాటి చేసిన పోస్టులతో మా మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. రాజకీయంగా లోకేష్ బాబును ఎదుర్కొలేక ఇలాంటి నీచమైన తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. సోషల్ మీడియాలో దేవేంద్ర రెడ్డి పెట్టిన పోస్టుల ఆధారంగా పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు పిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ యువత కార్యదర్శి మంజు, శాంతిపురం యువత అధ్యక్షులు సుబ్బు, నియోజకవర్గ మహిళా జనరల్ సెక్రెటరీ స్వాతి, గుడుపల్లి అధ్యక్షురాలు పద్మమ్మ, రామకుప్పం అధ్యక్షురాలు పద్మమ్మ, నియోజకవర్గం ఉపాధ్యక్షురాలు రాణెమ్మ, కుప్పం మున్సిపాలిటీ జనరల్ సెక్రటరీ తిరుమగల్, కమిటీ సభ్యులు సుందరమ్మ, పౌనమ్మ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post