Trishul News

పాస్తాపై జాతీయగీతం లిఖించిన సూక్ష్మకళాకారిణి..!

- అన్నం మహితను అభినందించిన పలువురు 
కారంచేడు, త్రిశూల్ న్యూస్ 
అన్నం మహిత బాపట్ల జిల్లా కారంచేడు, స్వర్ణ గ్రామానికి చెందిన సూక్ష్మకళాకారిణి. దేశమంతటా "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" పేరిట భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ఘనంగా జరుగుచున్న నేపధ్యములో మహిత తనదైన శైలి సూక్ష్మకళానైపుణ్యంతో ఈ 75సం. రాల భారత స్వాతంత్ర్య వేడుకలలో భారతమాతకు జేజేలు పలుకుచూ... సన్ననైన పాస్తా (సేమియా)పై హింది భాషలో జాతీయ గీతమును లిఖించారు. అతి తక్కువ సమయం గంటలోనే ఎలాంటి అద్దాలు ధరించకుండా, పేపరు పై రాసినట్లు అలవోకగా లిఖించారు. చదువరులు కూడా స్పష్టంగా పాస్తాపై ఉన్న జాతీయగీతమును సులువుగా చదవగలుగుచున్నారు. అన్నం బ్రమరాంభ నరసింహారావుల కుమార్తె మహిత చిన్ననాట నుండే సూక్షకళపై ఇష్టం పెంచుకొని పలు సూక్ష్మకళాఖండాలను తయారుచేసింది.

గతంలో బియ్యం గింజపై జాతీయ పతాకము, బియ్యపు గిజలతో తాళం, తాళంకప్ప, పెరసగింజ, చివరకు మినప గింజపై వినాయకుని ఆకృతిని చెక్కింది. పెన్సిల్ లెడ్ తో పలురకాలుగా సంగీత చిహ్నం, పువ్వు, సింహం, అంతేకాకుండా మహాభారతం పద్దెనిమిది పర్వాలలోని 67230 అక్షరాలను 810 పెన్సిళ్ల లెడ్ పై లిఖించారు. మరియు పదిరోజుల క్రితమే ప్రధాని మోదీ జీవిత చరిత్రను, రాజకీయ ప్రస్థానాన్ని 65 పెన్సిళ్ల పై లిఖించారు. ఈ సందర్భముగా మహిత మాట్లాడుతూ జాతీయ గీతమును లిఖించేటప్పుడు అసంకల్పితముగా కళ్లవెంట అశృవులు వచ్చాయని, ఇంతటి ఆనందం గతంలో కలుగలేదని మెరుస్తున్న కళ్లతో తెలిపారు. మహిత జాతీయ భావనకు, దేశ భక్తిని పలువురు అభినందించి ఆశీస్సులు అందజేశారు.

Post a Comment

Previous Post Next Post