Trishul News

వైద్యులు విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు - జిల్లా కలెక్టర్

- అందుబాటులో లేని డ్యూటీ డాక్టర్, వైద్య సిబ్బంది 
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
వైద్యులు తమ విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం కుప్పం ఏరియా ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ ఆకస్మికంగా తనిఖీ చేయగా.. మెడికల్ సూపరెండెంట్, డ్యూటీ డాక్టర్, వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొద్దిసేపటి తర్వాత మెడికల్ సూప రిండెంట్ డా.ప్రవీణ్ కుమార్, డ్యూటీ డాక్టర్ రాజు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత నిస్తూ ప్రజలకు మరింతగా వైద్య సేవలను అందుబాటులో తెచ్చేందుకు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ నాడు నేడు క్రింద పనులు చేపట్టడంతో పాటు ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేస్తుందన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన వైద్యులు తమ వృత్తి ధర్మం పట్ల అంకిత భావంతో పనిచేయాలని రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని సూచించారు.

Post a Comment

Previous Post Next Post