Trishul News

విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులతో బలోపేతం - తిరుపతి జిల్లా కలెక్టర్

సత్యవేడు, త్రిశూల్ న్యూస్ :
రాష్ట్రంలోని పేద పిల్లలకు మేనమామలా, కేవలం స్థితిమంతుల పిల్లలకే కాకుండా
ఇంగ్లీష్‌ మీడియం విద్య, క్లాస్‌రూమ్‌లో సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ తో, క్లాస్‌ బయట కూడా 24/7 విద్యార్ధులు సబ్జెక్ట్‌ను నేర్చుకోవడానికి వీలు కల్పిస్తూ వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తూ నేడు 8 వ తరగతి విద్యార్ధులు, టీచర్లకు ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ కార్యక్రమం బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో లాంఛనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించగా తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి సత్యవేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ట్యాబ్ ల పంపిణీ, జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణారెడ్డి స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 8 వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్ధులు, బోధించే 59,176 మంది ఉపాధ్యాయులకు రూ. 778 కోట్ల బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌తో రూ. 686 కోట్ల విలువైన 5,18,740 శామ్‌సంగ్‌ ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ వలన విద్యార్థులకు మొత్తం రూ. 1,466 కోట్ల విలువైన లబ్ధి చేకూరుతొందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు ట్యాబ్ లు అన్ని నియోజక వర్గాలలోని మండలాల పాఠశాలలకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఒక్కొక్క ట్యాబ్ రూ. 16,500 కు పైగా మార్కెట్‌ విలువ కలిగినవి దాదాపు రూ. 15,500 విలువ గల కంటెంట్‌తో కలిపి ప్రతి 8 వ తరగతి విద్యార్ధికి సుమారు రూ. 32 వేల లబ్ధి చేకూరుతుందని అన్నారు. ట్యాబ్‌లలో అవాంఛనీయ సైట్లు, యాప్స్‌ను నిరోధించే ప్రత్యేక సాఫ్ట్‌ వేర్, 3 ఏళ్ళ పాటు వ్యారంటీ ఉంటుందని తెలిపారు.

Post a Comment

Previous Post Next Post