Trishul News

ప్రపంచమంతా గొప్పగా ఆచరిస్తున్న పండగ క్రిస్మస్ - తిరుపతి జిల్లా కలెక్టర్

తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
మనసా వాచా కర్మణ ప్రేమను పంచడం పూర్తిగా నమ్మి ఆచరించిన గొప్ప వ్యక్తి ఏసుక్రీస్తు అని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా మైనారిటి సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రపంచంలోని అన్ని దేశాలలో జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ అని అన్నారు. మనసా వాచా కర్మణ ప్రేమ పంచడంను పూర్తిగా నమ్మి ఆచరించిన గొప్ప వ్యక్తి ఏసుక్రీస్తు అని ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని జిల్లా కలెక్ట తెలిపారు. ప్రభుత్వము ప్రతి సంవత్సరము క్రిస్మస్ హై టీ కార్యక్రమం జరుపుకోవాలని తెలిపిందని, అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ హై టీ వేడుకల కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకోవడం జరుగుతుందని, క్రిస్మస్ అంటే దేవుడే మానవుడు దగ్గరికి రావడం కోసం భూమి మీద కాలు పెట్టిన రోజు అని తెలిపారు. భూమి మీద దయ ప్రేమ కరుణ లోపించడం వలన మానవులకు సమాధాన పరచడం కోసం భగవంతుడే మానవ రూపంలో ఈ భూమి మీద అడుగు పెట్టడం జరిగిందని తెలిపారు. ఏసుక్రీస్తు పుట్టిన తర్వాత ప్రేమ దయ కరుణ అనే పదాలకు సమాన అర్థంగా ఏసుక్రీస్తు మారిపోయారని తెలిపారు. ప్రజలను అంత గొప్పగా ప్రేమించాడు కాబట్టే ఏసుక్రీస్తు చరిత్రలో గొప్పగా నిలిచిపోవడం జరిగిందని అన్నారు. మనసులో ఉన్నటువంటి ప్రేమ, దయ అనేవి ప్రపంచాన్ని జయించగలుగుతాయని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు జీవితము నుంచి ఎన్నో నేర్చుకోవాలి అని ఆయన సన్మార్గంలో నడిచి తోటి మానవులను ప్రేమించగలిగితే తప్పనిసరిగా ప్రపంచం స్వర్గమయo అవుతుందని తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మనమందరం కూడా ఎదుటివారిని ప్రేమించడం చాలా అవసరం అని, క్రిస్మస్ రోజు అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే అందరూ సమానం అని నిజమైన ప్రేమ ఎదుటివారికి పంచగలిగితే ప్రపంచం మొత్తం శాంతి మయం అవుతుందని తెలిపారు.

Post a Comment

Previous Post Next Post