బందరు ప్రజల తలరాతను మార్చిన నవంబర్ 1వ తేది..!
- 158 ఏళ్ళ క్రితం మచిలీపట్నంలో 30 వేలమంది జలసమాధి మచిలీపట్నం, త్రిశూల్ న్యూస్ : నవంబర్ ఒకటో తేదీ ఆల్ సెయింట్స్ డే (సకల పునీతుల దినోత్సవం), 2 వ తేదీ ఆల్ సోల్స్ డే... యాదృచ్చికంగా ఆ రోజున మచిలీపట్నంలో 30 వేల ఆత్మలు భీకర సముద్ర ఘోషలో మౌనంగా ఘోషించాయి.. నౌకా వ్యాపారంలో నాడు అగ్రగామిగా, దక్షిణ భారతదేశంలోనే ముఖ్య ఓడరేవు ప్రాంతంగా విరాజిల్లుతున్న బందరు 1864 నవంబర్ 1 వ తేదీ అర్ధరాత్రి విరుచుకుపడిన భయంకర ఉప్పెనలో చిగురుటాకులా వణికిపోయింది. ఆ ఉప్పెన కారణంగా బందరు సముద్రతీరంలో భారీ ఇసుక మేటలు వేయడంతో బందరు నౌకాయానంకు చరమగీతం పాడినట్లైంది. తీరం లోతు లేనందున భారీ ఓడల రాకపోకలు మహా కష్టమైంది..నేటికీ ఆ ఇసుకమేటలు పెట్టని కోటలు మాదిరిగా ఏర్పడి బందరు పోర్టుకి శాపం అయింది. పరాయి పాలనలో ఒక మెట్రో నగరం మాదిరిగా వెలిగిన బందరు అభివృద్ధి క్రమేపి కుంటుపడిందని చెప్పవచ్చు. సరిగ్గా 157 సంవత్సరాల ...