Posts

Showing posts from May, 2024

జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టమును పటిష్టంగా అమలు చేయాలి..!

Image
- భ్రూణ హత్యలను నివారించండి - కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ తిరుపతి, త్రిశూల్ న్యూస్ : జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టమును పట్టిష్టంగా అమలు చేయాలని ఉల్లంఘన చర్యలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం అమలుపై జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే అని ఆడపిల్లల పట్ల వివక్షత ఉండకూడదు అని తెలిపారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టాన్ని కటినంగా అమలు చేయడం ద్వారా భ్రూణ హత్యలను నివారించవచ్చని అన్నారు. జిల్లాలో ప్రతి నెల అన్ని స్కానింగ్ కేంద్రాలలో డాక్టర్లు తనిఖీలు నిర్వహించాలన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడుతున్న స్కానింగ్ సెంటర్ల వారి రిజిస్ట్రేషన్ తొలగించడం జరుగుతుందని అన్నారు. స్కానింగ్ సెంటర్లో రిజిస్ట్రేషన్, రెన్యువల్ మరియు ఇతర మోడీఫికేషన్ దరఖాస్తులను ఆన్లైన్లో మాత్రమే స్వీకరించడ...

తొలిసారి ఇండియాలో ఓటేసిన హీరో అక్షయ్ కుమార్..!

Image
న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ : ఐదో విడత సార్వత్రిక ఎన్నికల్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 56 ఏళ్ల వయసున్న అక్షయ్ కుమార్.. భారత్‌లో ఓటు వేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ కెనడా పౌరసత్వం కలిగిన ఆయన.. గతేడాది ఆగస్టులో భారతీయ పౌరసత్వం పొందారు. ఈ క్రమంలో అక్షయ్.. ఇండియాలో మొదటి సారి ఓటు వేశారు.

దేశంలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఐదవ దశ పోలింగ్..!

Image
న్యూఢిల్లీ, త్రిశూల్ న్యూస్ : నేడు దేశంలో ఐదవ దశ పోలింగ్ ప్రారంభమైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంట్ నియోజకవర్గా ల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ దశ ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతీ ఇరానీ, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తలపడుతున్నారు. మొత్తం 695 అభ్యర్థులు ఈసారి బరిలో నిలిచారు. ఈ దశలో ఓటర్ల సంఖ్య 8.95 కోట్లు కాగా ఇందులో మహిళలు 4.26 కోట్లుగా ఉన్నారు. గత నాలుగు దశల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవడంతో ఆందోళన చెందిన ఈసీఐ ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చింది. ఈ దశలో మహారాష్ట్రలో 13 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లో 14 సీట్లు, పశ్చిమ బెంగాల్‌లో 7 సీట్లు, బీహార్‌లో 5 సీట్లు, ఝార్ఖండ్‌లో 3 సీట్లు, ఒడిశాలో 5 సీట్లు, జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లో చెరో సీటుకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ జాడ ఏది?

Image
ఇరాన్, త్రిశూల్ న్యూస్ : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ నేలను బలంగా తాకింది. ఈ ప్రమాదం సమయంలో హెలికాప్టర్‌లో ఉన్న అధ్యక్షుడు జాడ కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు సమాచారం. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. వాతావరణంలోని మార్పులే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. రైసీ ప్రయాణిస్తున్న హెలి కాప్టర్ హార్డ్ ల్యాండింగ్ గురైన విషయాన్ని స్థానిక మీడియా తెలిపింది ప్రతికూల వాతావరణమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. సంఘటన జరిగిన ప్రదేశాన్ని గుర్తిం చేందుకు రెస్క్యూ బృందా లు ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్ రాజధానికి వాయు వ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో దేశానికి సరిహద్దు ల్లో తూర్పున ఉన్న అజర్‌ బైజాన్‌ ప్రావిన్స్‌లోని జోల్ఫా ప్రాంతానికి సమీపం లో ఈ ఘటన చోటుచేసు కుందని ఇరాన్ ప్రభుత్వం మీడియా సంస్థలు తెలిపాయి. హెలికాప్టర్‌లో అజర్ బైజాన్ తూర్పు గవర్నర్ సహా విదేశాంగ మంత్రి హోసింగ్ అమీర్ ఉన్నారని తెలుస్తోం ది. ప్రమాద సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది అని చెబుతున్నారు. ...

హైదరాబాద్ లో జూన్‌ 8న చేప ప్రసాదం పంపిణీ..!

Image
హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ : హైదరాబాద్‌ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్‌ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. దీనికి సంబంధించిన కీలక ప్రకటన ప్రసాదం పంపిణీదారు బత్తిన ఫ్యామిలీ చేసింది. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు ఇచ్చే చేప ప్రసాదం ఇచ్చేందుకు ఈ ఏడాది కూడా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 8న ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రసాదం తింటే ఆస్తమా తగ్గుతుందని వేల మంది ప్రజలు నమ్ముతున్నారు. అందుకే ఈ ప్రసాదం ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఎదురు చూసే వాళ్ల సంఖ్య వేలల్లో ఉంటుంది. హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ చేప ప్రసాదం బత్తిని కుటుంబం పంపిణీ చేయనుంది. దీని కోసం ఇప్పటికే ప్రభుత్వ అనుమతి కూడా తీసుకున్నట్టు సమాచారం. ప్రసాదం తయారీ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఏటా మృగశిర కార్తె ప్రవేశించిన రోజున ఈ ప్రసాదం బతికి ఉన్న చేపలో పెట్టి పంపీణీ చేస్తుంటారు. ఈ ఏడాది జూన్ 8న మృగశిర కార్తె ప్రవేశిస్తోంది. ఆరోజు చేప ప్రసాదం పంపిణీ చేయబోతున్నట్టు బత్తిన అనురీత్‌గౌడ్, గౌరీ శంకర్‌ గౌడ్‌లు వెల్లడించారు. చేప ప్రసాదం పంపిణీలో భాగంగా పంపిణీకి ముందు రోజుల ప్రత్యేక పూజలు చే...

ఆస్తి కోసం తల్లిని.. ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి..!

Image
ఖమ్మం, త్రిశూల్ న్యూస్ : ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకు న్నది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు ఆస్తి కోసం తన తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలను హత్య చేశాడు. తన పేరుపై ఆస్తి రాసివ్వడం లేదని కోపం పెంచుకున్న వెంకటేశ్వర్లు.. తల్లి పిచ్చమ్మ(60)ను గొంతు నులిమి చంపాడు. అనంతరం ఇద్దరు కుమార్తెలు నీరజ(10), ఝాన్సీ(6)లను చంపి పరారయ్యాడు. పొలం తన పేరుపై రాయాలంటూ తల్లిని వెంకటేశ్వర్లు కొన్నేండ్లుగా వేధిస్తున్నట్లు తెలుస్తున్నది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా వెంకటేశ్వర్లు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, రెండేండ్ల క్రితం భార్యను కూడా హత్య చేశాడని స్థానికులు తెలిపారు.

సింహ వాహనంపై అనంతతేజోమూర్తి..!

Image
తిరుపతి, త్రిశూల్ న్యూస్ : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శ‌నివారం ఉదయం అనంతతేజోమూర్తి  శ్రీ గోవిందరాజస్వామి సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

కుప్పంలో చంద్రబాబు గెలుస్తారా..? బెట్టింగ్‎లో ఆ అంశమే కీలకం..?

Image
కుప్పం, త్రిశూల్ న్యూస్ : కుప్పంలో రికార్డు స్థాయి పోలింగ్ ఎవరికి అనుకూలం. అత్యధిక ఓటింగ్ శాతం నమోదు ఏ పార్టీకి కలిసి వచ్చే అంశం. పెరిగిన ఓటింగ్ శాతంపై ఎవరి లెక్కలు వారివే కాగా కుప్పం దంగల్‎లో గెలుపు ఓటములే కాదు.. లక్ష ఓట్ల మెజారిటీ అంశం బెట్టింగ్‎లో కీరోల్‎గా మారింది. లక్ష ఓట్ల మెజార్టీ టార్గెట్‎గా టిడిపి ఫైట్ చేస్తే చంద్రబాబు ఓటమే లక్ష్యంగా వైసీపీ పనిచేసింది. దీంతో కుప్పంలో గెలుపు ఎవరిదన్న దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశమైంది. ఏపీ రాజకీయాల్లో కుప్పం ఫలితం రాజకీయాల్లో తీవ్ర చర్చగా మారింది. కుప్పంలో టిడిపి అధినేత చంద్రబాబు పోటీలో ఉండడం.. అధికార వైసీపీ కుప్పంను టార్గెట్ చేయడంతో అందరి దృష్టి కుప్పంపైనే ఉంది. 1989 నుంచి వరుస విజయాలు అందుకుంటున్న చంద్రబాబు ఇప్పటిదాకా 7 సార్లు అసెంబ్లీకి వెళ్ళారు. టిడిపి జెండాను ఎగురవేశారు. ఎనిమిదో సారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే గెలుపు కోసం పార్టీ క్యాడర్‎ కూడా అలుపెరగకుండా పనిచేసింది. కుప్పంలో గెలవడమే కాదు లక్ష ఓట్ల మెజార్టీ టిడిపి టార్గెట్ అంటూ ఈ ఎన్నికల్లో పనిచేసింది. మరోవైపు చంద్రబాబు ఓటమే లక్ష్యంగా వ...

కొత్త ఎంపీలకు పార్లమెంటులో స్వాగత సన్నాహాలు..!

Image
- ఈసారి అనుబంధ భవనంలో ఏర్పాట్లు దిల్లీ విమానాశ్రయం, రైల్వేస్టేషన్లలో కేంద్రాలు  న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ : లోక్‌సభ ఎన్నికలు దశలవారీగా పూర్తవుతున్న నేపథ్యంలో నూతన ఎంపీలకు స్వాగతం పలికేందుకు కావాల్సిన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. నూతన పార్లమెంటు భవనం వెలుపల పునరభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో అనుబంధ భవనంలో సభ్యులకు ఘన స్వాగతం లభించే అవకాశం ఉంది. అధికారిక వేడుకలకు వీలుగా నూతన పచ్చిక బయళ్లను తీర్చిదిద్దడం, విగ్రహాలను వేరేచోటకు తరలించడం, ఎంపీలు తమ వాహనాల నుంచి దిగి బ్యాటరీ వాహనాల్లోకి మారే ప్రదేశాలను కేటాయించడం వంటివి ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దీంతో మునుపటి మాదిరిగా వర్తులాకార భవనం (ప్రస్తుత సంవిధాన్‌ సదన్‌)లో కాకుండా అనుబంధ భవనంలో ఎంపీలను స్వాగతించనున్నారు. దిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వాల అతిథి గృహాల్లో, 'వెస్టర్న్‌ కోర్ట్‌ హాస్టల్‌ కాంప్లెక్స్‌'లో లోక్‌సభ నూతన సభ్యులకు తాత్కాలిక వసతి కల్పిస్తారు. మాజీ సభ్యులు తమ అధికారిక నివాసాలు ఖాళీ చేసేందుకు కొంత గడువు ఉంటుంది. వాటికి అవసరమైన మరమ్మతులతో ఆ తర్వాత మెరుగులు దిద్ది, కొత్తవారికి కేటాయిస్తారు.  4...

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి..!

Image
అనంతపురం, త్రిశూల్ న్యూస్ : అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్న ఘటన లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. గుత్తి మండలం బాచుపల్లి గ్రామ సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారి పై ఈరోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను అనంతరం జిల్లా రాణి నగర్‌కు చెందిన షేక్ అలిసాబ్, ఫిరోజ్ బాషా, మహమ్మద్ అమాన్, ఆయాన్, రెహానాగా గుర్తించారు. గాయపడిన మరో ఇద్దరు జాహిద, బీబీని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారు నడుపుతున్న వ్యక్తి నిద్రమత్తులో ఉండ డంతో వాహనం అదుపు తప్పి అటు వైపుగా వెళ్తున్న లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

టీఎస్ పీజీ ఈసెట్ పరీక్షలో స్వల్ప మార్పు..!

Image
హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ : తెలంగాణ వ్యాప్తంగా పీజీ ఈసెట్‌ పరీక్షను వాయిదా వేయాలని జేఎన్టీయూహెచ్‌ నిర్ణయించింది. జూన్ 6 నుంచి 9 వరకు జరగాల్సిన టీఎస్ పీజీ ఈసెట్ పరీక్షలను జూన్ 10 నుంచి 13 వరకు నిర్వహిం చనున్నట్లు కన్వీనర్ అరుణ కుమారి తెలిపారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం విద్యార్థులు ఉన్నత విద్యా మండలి వెబ్ సైట్‌ని సందర్శించాలని తెలిపింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు చేయడానికి ప్రభుత్వం నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్ పీజీఈ సెట్. అభ్యర్థులు బీఈ, బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్, బీఫార్మసీ, బీఎస్సీ ఉత్తీర్ణులై వారు అర్హులు.

భక్తులతో వెళుతున్న టూరిస్ట్ బస్సులో మంటలు.. 8 మంది మృతి..!

Image
హర్యానా, త్రిశూల్ న్యూస్ : హర్యానాలో శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నూహ్​ ప్రాంతంలో ఓ టూరిస్ట్​ బస్సుకు మంటలు చెలరేగాయి. శుక్రవారం అర్థరాత్రి 1:30 నిమిషాల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పో యారు. మరో 24 మంది గాయపడ్డారు. బస్సులో కనీసం 60 మంది ఉంటారని సమాచారం. వీరిలో చాలా మంది మతపరమైన యాత్రలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు.. ఘటనాస్థలా నికి చేరుకొని క్షతగాత్రులు, మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

బుల్లితెర నటుడు చందు ఆత్మహత్య?

Image
హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ : సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. మణికొండ లో ఆత్మహత్య చేసుకున్న చందు…త్రినయినితో పాటు పలు సీరియల్స్ లో నటించాడు. చందుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నటి పవిత్ర. ఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర తో వివాహేతర సంబంధం ఉందని సమాచారం. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్నాడు చందు. రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్ లో నటిస్తు న్నాడు. నాలుగు రోజుల క్రితం త్రినయని సీరియల్‌ నటి పవిత్ర జయరాంతో కలిసి ఆయన బెంగళూరు నుంచి కారులో వస్తుండగా మహబూబ్‌నగర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. చందుకు గాయాలయ్యా యి. దీంతో మానసికంగా కుంగిపోయిన ఆయన హైదరాబాద్‌లోని మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్‌ రోడ్డు నం.20లో ఉన్న అపార్టుమెంట్‌లోని తన ఫ్లాట్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కు డోర్‌కర్టెన్‌తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్నేహితులు మధ్యాహ్నం నుంచి పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవ డంతో ఫ్లాట్‌కు వచ్చి చూసి.. ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతుడి తండ్రి చెన్న వెంకటేశ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు...

రాష్ట్రంలోని 25 లోక్ సభ, 175 అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఖరారు..!

Image
అమరావతి, త్రిశూల్ న్యూస్ : లోక్ సభ స్థానాల్లో మొత్తం 454 మంది బరిలో ఉండగా, అసెంబ్లీ స్థానాల్లో 2 వేల 387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటనలో వెల్లడించారు. అత్యధికంగా విశాఖ లోక్ సభ స్థానంలో 33 మంది అభ్యర్థులు నిలవగా.. అత్యల్పంగా రాజమహేంద్రవరం పార్లమెంటరీ స్థానం నుంచి 12 మంది మిగిలారని తెలిపారు. శాసనసభా స్థానాల విషయానికి వస్తే.. తిరుపతి అసెంబ్లీ సెగ్మెం ట్లో అత్యధికంగా 46 మంది పోటీ చేస్తుండగా.. అత్యల్పంగా చోడవరం నుంచి ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ పడుతున్నారని వివరించారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 40 మంది అభ్యర్థులు పోటీలో ఉండటం గమనార్హం.

కస్టర్డ్ ఆపిల్ (షరీఫా/సీతాఫలం ).. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!

Image
త్రిశూల్ న్యూస్ డెస్క్ : భారతదేశంలో 'షరీఫా' లేదా 'సీతాఫల్' గా ప్రసిద్ది చెందిన కస్టర్డ్ ఆపిల్ ను అన్ని వయసుల వారు ఇష్టపడతారు. కస్టర్డ్ ఆపిల్‌ను డెజర్ట్‌లు, స్మూతీస్, షేక్స్ మరియు స్నాక్స్ లో ఒక పదార్ధంగా ఉపయోగిస్తారు. కస్టర్డ్ ఆపిల్ రుచికరమైన రుచితో పాటు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. కస్టర్డ్ ఆపిల్ యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్లతో నిండి ఉంది, ఇది శరీరానికి అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. అలాగే, ఇందులో పొటాషియం, విటమిన్-ఎ, రాగి, భాస్వరం, ఫైబర్, కాల్షియం ఉన్నాయి. కస్టర్డ్ ఆపిల్‌లోని అధిక యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మం, గుండె, ఎముకలు మరియు రక్తపోటుకు అద్భుతమైనవి. కస్టర్డ్ ఆపిల్‌లోని రాగి కంటెంట్ మలబద్దకం, అజీర్ణ సమస్యలు మరియు విరేచనాలు వంటి జీర్ణశయాంతర అంటువ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది.   కస్టర్డ్ ఆపిల్ లేదా షరీఫా/సీతాఫలం యొక్క 8 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు 1. ఆరోగ్యకరమైన హృదయానికి కస్టర్డ్ ఆపిల్: కస్టర్డ్ ఆపిల్ లో పొటాషియం మరియు మెగ్నీషియం అధికంగా ఉంటాయి, ఈ రెండూ గుండె జబ్బులను నియంత్రించడానికి మరియు రక్తపోటు స్థాయిలను నియంత్రించడాన...

కొవిషీల్డ్‌తో దుష్పరిణామాలు.. భారత్‌లోనూ ప్రకంపనలు..!

Image
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన విశాల్‌ తివారి న్యాయవాది న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ : కొవిషీల్డ్‌తో దుష్పరిణామాలు నిజమేనని బ్రిటన్‌ ఫార్మా కంపెనీ అంగీకరించడంతో భారత్‌లోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. కోవిషీల్డ్ టీకా వేసుకున్నవారికి జరిగిన దుష్పరిణామాలపై అధ్యయనం చేసేందుకు మెడికల్ నిపుణులతో ప్యానెల్‌ ఏర్పాటు చేయాలంటూ ఓ న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొవిడ్‌ టీకా కొవిషీల్డ్‌తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్‌ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనకా అంగీకరించడంతో ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు పుట్టింది. కొవిషీల్డ్‌ టీకా వల్ల అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్‌ కౌంట్‌ పడిపోవటం వంటి పరిస్థితులకు దారితీయవచ్చని బ్రిటన్‌ హైకోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్స్‌లో ఆస్ట్రాజెనకా వెల్లడించినట్లు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక ది టెలిగ్రాఫ్‌ ఓ కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రకంపనలు రేపడంతో భారత్‌లో విశాల్‌ తివారి అనే న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోవిషీల్డ్ టీకా వేసుకున్నవారికి జరిగిన దుష్పరిణామాలపై అధ్యయనానికి మెడికల్ నిపుణుల ప్యానెల్‌ ఏర్పాటు చేసేలా కేంద్రాన్నిఆదేశ...

పులివర్తి నాని గెలవడం.. చంద్రగిరి కోటపై టిడిపి జెండా ఎగరడం ఖాయ - డాలర్స్ దివాకర్ రెడ్డి

Image
తిరుపతి రూరల్, త్రిశూల్ న్యూస్ : చంద్రగిరి కోటపై టిడిపిజెండా ఎగరేయడం ఖాయమని టిడిపి నేత డాలర్స్ దివాకర్ రెడ్డి  ధీమా వ్యక్తం చేశారు. టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని విజయం కోసం బుధవారం డాలర్స్ దివాకర్ రెడ్డి తనపల్లి , కుంట్రపాకం పంచాయతీలలో విస్తృత ప్రచారం చేశారు. ఆయనకు  ఉమ్మడి కూటమి నాయకులు, దివాకర్ రెడ్డి అభిమానులు, స్తానిక ప్రజలు కలిసి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అడగడుగునా మహిళలు హారతులు పట్టారు. దివాకర్ రెడ్డి ప్రతీ ఇంటికి వెళ్లి ఆత్మీయంగా పలకరిస్తూ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తనపల్లిలో బాల చంద్రా రెడ్డి, సందీప్ రెడ్డి, మన్మధ రెడ్డి, దయాకర్, లోకనాథ్ రెడ్డి, కుంట్రపాకంలో రామమూర్తి, చెంచు రెడ్డి, ముని కృష్ణ యాదవ్, నాగరాజు, కుమార్, ఖాదర్ టిడిపి,జనసేన,బిజెపి నాయకులు కార్యకర్తలు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

నవరత్నాల పథకాలు కొనసాగాలంటే వైసిపి ప్రభుత్వం రావాలి - అంజూరు తారక శ్రీనివాసులు

Image
శ్రీకాళహస్తి, త్రిశూల్ న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణం  సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా12,15వార్డుల్లో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు వైయస్సార్సీపి నాయకులు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైయస్సార్సీపి తిరుపతి పార్లమెంట్  అభ్యర్థి గురుమూర్తి మరియు  శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి  ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి నవరత్నాలు అనే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని, ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో అవ్వా తాతల పింఛన్, అమ్మ ఒడి, రైతు రుణమాఫీ, అందరికీ ఉచిత ఆరోగ్యశ్రీ వైద్యం, పేదలందరికీ పక్కా ఇల్లు, వైయస్సార్ ఆసరా, ఫీజు రీయంబర్స్మెంట్, జలయజ్ఞం, మద్యపాన నిషేధం, ఇలాంటి పథకాలని మళ్ళీ మనకు రావాలి అంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడైన...

అధికారంలోకి రాబోయేది ఉమ్మడి కూటమి ప్రభుత్వమే - జనసేన నాయకులు ఎం.మహేష్ స్వేరో

Image
పూతలపట్టు, త్రిశూల్ న్యూస్ : చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండల పరిధిలోని వెంగంపల్లి గ్రామంలో పూతలపట్టు నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ మరియు చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద్ రావు లకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన నాయకులు, జనసైనికులు, వెంగంపల్లి యూత్. ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మరియు పూతలపట్టు నియోజకవర్గంలో అధికారంలోకి రాబోయేది ఉమ్మడి కూటమేనని, ఎక్కడికెళ్ళినా ప్రజలు ఉమ్మడి అభ్యర్థులను బాగా ఆదరిస్తున్నారని, గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీ ప్రజలు విసిగిపోయారని, జగన్ మోహన్ రెడ్డి చెప్పే కల్లబొల్లి మాటలు ప్రజలను మోసం చేసే జాదు, మాయ చేసే మేనిఫెస్టోలను నమ్మే పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరని తప్పకుండా ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులు గెలిచి కూటమి అధికార స్థాపన చేస్తుందని తెలిపారు. నవరత్నాల పేరుతో ఎస్సీ కార్పొరేషన్ నిధులను దాదాపు 70 వేల కోట్లను నవరత్నాలకు మళ్లించి ఎస్సీలను మరింత దినస్థితికి చేర్చిన జగన్ మోహన్ రెడ్డికి దళితులందరూ తప్పకు...

వెంకటాయపల్లి హరిజనవాడలో త్రాగునీటి కోసం అవస్థలు.. పట్టించుకోని అధికారులు..!

Image
సిద్ధవటం, త్రిశూల్ న్యూస్ : రాజంపేట జిల్లా పొన్నవోలు కొత్తపల్లి గ్రామ పంచాయతీ వెంకటాయపల్లి హరిజనవాడలో రెండు రోజుల క్రితం తాగునీటిమోటార్ కాలిపోవడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని త్రాగు నీటి కోసం కిలోమీటర్ దూరంలో ఉన్న రైతుల పొలం వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ విషయాన్ని సంబంధిత అధికారులు కు ఫిర్యాదు చేసిన వారు ఏమాత్రం చర్యలుచేపట్టడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ట్యాంకర్ ద్వారా నీటిని అందించాలని హరిజనవాడ ప్రజలు పేర్కొంటున్నారు. బోరు పనిచేయకపోవడంతో తీవ్ర నీటి సమస్య తెలెత్తిందన్నారు. త్రాగు నీటి కోసం ఎర్రటి ఎండ లో వ్యవసాయ బోర్ల వద్ద పరుగులు తీస్తూ నీరు తెచ్చుకోవాల్సి వస్తుందన్నారు. గ్రామంలో ఆదివారం గంగమ్మకు ముద్దలు పండుగ ఉందని త్రాగునీరు లేకపోతే పండుగ ఆగిపోతుందని ఇప్పటికే గ్రామంలో బంధువులను పిలుచుకుందామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఇంచార్జ్ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని వివరణ కోరగా రేపు ఆ ప్రాంతానికి వెళ్లి సమస్య పర...

జగన్ పాలన నుంచి ఏపీకి విముక్తి కావాలి - తీగల చంద్రశేఖర్

Image
నెల్లూరు, త్రిశూల్ న్యూస్ : జగన్ పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించాలన్నదే కూటమి లక్ష్యమని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు తెలిపారు. చిట్టమూరు మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో, చిల్లమూరు పంచాయతీ రామాపురం గ్రామంలో బుధవారం ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయం కోరుతూ, ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీకి మరోసారి ఓటు వేస్తె ప్రజల ఆస్తులు గాల్లో దీపంగా మారడం ఖాయమని, వైసిపి హయంలో వ్యవసాయం చేసే రైతులు నష్టాల్లో ఉంటే, గంజాయి పండించే వైకాపా నాయకులు లాభాల్లో ఉన్నారన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్ క్యాపిటల్ గా మార్చిన ఘనత వైసిపి ప్రభుత్వానిదేనన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యధేచ్చగా గంజాయి విక్రయాలతో యువత మత్తుకు బానిసలవుతున్నా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక డ్రగ్స్, గంజాయి మాఫియాను అరికడతామన్నారు. రాష్ట్ర ప్రజల చేతిలో జగన్ కు పరాభవం తప్పదని మే 13 జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ తిరుపతి ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ రావుకు కమలం గుర్తుపై, గూడూరు ఎంఎల్ఏ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ కు సైకిల్ గుర్తు పై ఓట్లు వేసి గెలిప...

టీడీపీ నుంచి వైఎస్‌ఆర్‌సీపీలోకి చేరికలు..!

Image
– ఎమ్మెల్యే అనంత సమక్షంలో చేరిన రూరల్‌ పంచాయతీ నేతలు అనంతపురం, త్రిశూల్ న్యూస్ : అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా వైసీపీ బీసీ విభాగం రీజనల్‌ ఇన్‌చార్జ్‌ రమేష్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో అనంతపురం రూరల్‌ పంచాయతీకి చెందిన టీడీపీ నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే అనంత కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. రూరల్‌ పంచాయతీ రామకృష్ణ కాలనీకి చెందిన టీడీపీ కీలక నేతలు హనుమంత్‌రాయుడు, వేణు, చెన్నకేశవులు, నౌషాద్, పెద్ద నాగన్న, చిన్ని నాగన్న, చంద్రశేఖర్, సాహిద్‌ వలి, కేశవయ్య, పుల్లయ్య, లక్ష్మిదేవి, లవనీత, రమణమ్మ, సుజాత, దేవి, మహమ్మద్‌ వలి, రమేష్‌ ఆచారి, శీనా ఆచారి, క్రాంతికుమార్, మహేంద్ర, విజయ్‌కుమార్, శీనాయాదవ్, హరి, ప్రదీప్‌ యాదవ్, హైదర్‌వలి, అల్లాబకష్, శివయ్య, బిబు, దిలీప్, నంద, గురువిజయ్, వేణుగోపాల్‌ తదితరులు తెలుగుదేశం పార్టీని వీడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు అనంతపురంలో జరుగుతున్న అభివృద్ధిలో తామూ భాగస్వాములు క...

టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలంకు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు ..!

Image
తిరుపతి, త్రిశూల్ న్యూస్ : వరదయ్యపాలెం మండల పరిధిలోని తొండూరు మత్తెరమెట్ట బత్తల వల్ల నెల్లటూరు గుడివారిపల్లె కడూరు మోపుడు పల్లె గ్రామాలలో బుధవారం నాడు ఇంటింటికి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాలు టిడిపి అభ్యర్థి కోనేటి ఆదిమూలం పార్టీ నాయకులు కార్యకర్తలతో కరపత్రాలు పంచుతూ జోరుగా ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. మత్తెరమెట్ట గ్రామంలో టిడిపి పార్టీ శ్రేణులు భారీ క్రేన్ సహాయంతో గజమాలను టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం కు వేసి మేళ తాళాలతో బ్యాండ్ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు గ్రామాల్లోని ప్రజలు నుండి విశేష స్పందన కోనేటి ఆది మూలంకు లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయేది ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి వస్తుందని అని ధీమాగా చెప్పారు సీఎం గా చంద్రబాబు నాయుడు అవ్వడం ఖాయమని అన్నారు నేటి దినం ప్రవేశపెట్టిన మేనిఫెస్టోకు రాష్ట్ర ప్రజల నుండి పూర్తిగా మద్దతు లభించిందని అన్నారు మేనిఫెస్టోలో బడుగు బలహీన వర్గాల కోసమే ప్రాధాన్యత ఇవ్వబడిందని ఆయన మీడియాతో చెప్పారు. సుమారు 26 పథకాలు మేనిఫెస్టోలో పొందుపరిచారని ఇవి పేద ప్రజలకు మధ్యతరగతి కుటు...

ఆవకాయ పట్టాలన్నా.. ఐటీ కంపెనీ నడపాలన్నా మహిళలకే సాధ్యం - నారా బ్రాహ్మణి

Image
- భవిష్యత్ లో మంగళగిరిని ఐటీ హబ్ గా మారుస్తాం - పై కేర్ డేటా సెంటర్ ఐటీ ఉద్యోగులతో నారా బ్రాహ్మణి ముఖాముఖి మంగళగిరి, త్రిశూల్ న్యూస్ : కష్టపడే తత్వం, పట్టదలతో సాధించడం వంటి లక్షణాలు మహిళలను సమాజంలో ప్రత్యేకంగా నిలుపుతాయని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి ఆటోనగర్ లోని పై కేర్ డేటా సెంటర్ ను ఆమె సందర్శించారు. 2017లో ఐటీ మంత్రిగా నారా లోకేష్ ఆహ్వానం మేరకు పై కేర్ కంపెనీ మంగళగిరికి వచ్చింది. ఈ కంపెనీలో ప్రస్తుతం 635 మంది యువతీయువకులు ఉద్యోగం చేస్తున్నారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ... సరైన ప్రోత్సాహం ఇవ్వాలేకానీ మహిళలు అద్భుతాలు సృష్టిస్తారు. ఒక ఐటీ కంపెనీలో ఇంతమంది మహిళలు పనిచేయడం నేను మొదటిసారి చూస్తున్నానన్నారు. నేనివ్వాళ హెరిటేజ్ ఫుడ్స్, బసవతారకం క్యాన్సర్ హాస్పటల్, ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహణలో భాగస్వామిని అయ్యానంటే అందుకు నా భర్త నారా లోకేష్, మా అత్తమామల సహకారమే కారణమని, గడిచిన ఐదేళ్లుగా రాష్ట్రం నుంచి అనేక కంపెనీలు వెళ్లిపోయాయి.. కొత్త కంపెనీల జాడ లేదు.. యువత ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయి తెలిపార...

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల బరిలో 525 అభ్యర్థులు - ఎన్నికల కమిషనర్

Image
హైదరాబాద్‌, త్రిశూల్ న్యూస్ : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్‌ లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో 285 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. ఏడు స్థానాల్లో మూడు ఈవీఎంలు, 9 స్థానాల్లో రెండు ఈవీఎంలు వాడనున్నారు. శుక్రవారం నుంచి హోం ఓటింగ్‌ ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో 3,986 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు.

చీకట్లో ఉన్న ఉదయమాణిక్యంలో వెలుగులు నింపేందుకు కృషి చేస్తా - పులివర్తి నాని

Image
చంద్రగిరి, త్రిశూల్ న్యూస్ :  గడిచిన 10 ఏళ్లుగా ఉదయమాణిక్యం పంచాయితీ అభివృద్ధికి నోచుకోక చీకట్లో మగ్గుతుందని, ఒక్క అవకాశం ఇస్తే వెలుగులు నింపేందుకు కృషి చేస్తానని చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. బుధవారం యర్రావారిపాళెం మండలం, ఉదయమాణిక్యం పంచాయితీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికలకు ముందు ఒకలా... ఎన్నికల తర్వాత మరోలా ప్రవర్తిస్తూ నమ్మకంతో ఓట్లు వేసిన ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గతంలో టీడీపీ సానుభూతిపరుడైన ఎన్ఆర్ఐ అబ్దుల్ ఆలీ భాకరాపేటలో పరిశ్రమ స్థాపించి కొందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కక్షగట్టి కాంపౌండ్ వాల్ తొలగించారని చెప్పారు. ఆయనకు బలవంతంగా వైసీపీ కండువా కప్పారని అన్నారు. భాకరాపేట నుంచి యలమంద వరకు డబుల్ రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ హయాంలో గల్లా అరుణ కుమారి తలకోన సిద్దేశ్వర ఆలయం అభివృద్ధికి కృషి చేసిందని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి ఈ 5 ఏళ్లలో ...

ప్రభుత్వ మద్యం షాపుల్లో కూలింగ్ లేని మద్యం అమ్మకాలు..!

Image
- జేబులకు చిల్లు తప్ప వేరే మార్గం లేదంటున్న మందుబాబులు   - మద్యంపై అధిక రేట్లు వసూలు చేస్తున్న సర్కార్  -  పేద బలహీన వర్గాల కుటుంబాలు కుదేల్.. అటకెక్కిన మద్యపానం నిషేధం హామీ  సిద్ధవటం, త్రిశూల్ న్యూస్ : సిద్ధవటం ప్రభుత్వ మద్యం షాపుల్లో మద్యం ప్రియులకు ఆశ నిరాశ అయింది. అసలే దట్టమైన వేసవికాలంలో కాస్త ఉపశమనం కోసం ప్రభుత్వ వైన్ షాప్ కి వెళ్లి బీరు కొనుగోలు చేయగా కూలింగ్ లేని మందు ఇస్తున్నారని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎలక్షన్ లో దశలవారీగా మద్యపానం నిషేధిస్తామని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకపక్క చెప్పినా కూడా అది ఏ మాత్రం అమలు కాలేదని పూర్తిగా మద్యపాన నిషేధం చేసి ఎలక్షన్లో పోటీ చేస్తామని ఆయన రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం ఏమో కానీ మా జేబులకు చిల్లు పడుతుందని అధిక రేట్లు వసూలు చేసి ఏమాత్రం నాణ్యతలేని బీర్లు అమ్మకాలు చేస్తున్నారని బూమ్ 180, కె ఎఫ్,2Oo, RF అల్ట్రా 22O,, ఎలిఫెంట్, 2,6O, ఇలా ముక్కు పిండి వసూలు చేస్తూ కూలింగ్ లేకుండా అమ్మకాలు చేస్తున్నారని ప్రభుత్వానికి ఆదాయం మాకు నిరాశ తప్ప ఏం లేదని, నా...