తప్పుడు ప్రచారం చేస్తోన్న మాజీ సీఎంపై చర్యలు తీసుకుంటాం - హోమంత్రి
- కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 36 రాజకీయ హత్యలు జరిగాయని తప్పుడు ఆరోపణలు - ప్రభుత్వాన్ని ఎవరైనా టార్గెట్ చేస్తే చర్యలు తీసుకుంటామన్న హోం మంత్రి అనిత అమరావతి, త్రిశూల్ న్యూస్ : తప్పుడు ప్రచారం చేస్తోన్న మాజీ సీఎం జగన్ మీద చర్యలు తీసుకుంటామని హోం మంత్రి వంగలపుడి అనిత తెలిపారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ తప్పుడు ఆరోపణలు చేశారు.. 36 హత్యల వివరాలు జగన్ ఇవ్వగలరా..? అని ప్రశ్నించారు. రాజకీయ హత్యల వివరాలను జగన్ ప్రభుత్వానికి ఇవ్వాలి అని ఆమె డిమాండ్ చేశారు. సమాచారం ఇవ్వకుంటే.. జగన్ మీద చర్యలు తీసుకునే అధికారం చట్టానికి ఉంటుంది.. ప్రభుత్వం మీద ఎవరైనా టార్గెట్‌గా ఆరోపణలు చేస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చిన నెంబర్ చెప్పేస్తే చూస్తూ ఊరుకోవాలా.. మైకు ఉందని ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే చట్టం ఎందుకు ఊరుకోవాలి అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఇక, రాష్ట్ర అసెంబ్లీకి రాకుండా తప్పించుకునేందుకే వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు అని మంత్రి అనిత అన్నారు. దమ్ముంటే జగన్ అసెంబ్లీకి రావాలి.. అసెంబ్లీలో శాంతి భద్రతలపై మేం ...