ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఉన్మాదులను ఉపేక్షించేది లేదు - ఎమ్మెల్యే గళ్ళా మాధవి
అమరావతి, త్రిశూల్ న్యూస్ : గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 33వ డివిజన్ పరిధిలోని బ్రాడిపేట 6/20లో టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని, వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి హెచ్చరించారు. మంగళవారం ఘటన జరిగిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విగ్రహాన్ని కొంతమంది ఆకతాయిలు మదమెక్కి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నిన్న ఓ పార్టీకి చెందిన వ్యక్తులు వినాయక విగ్రహం ఊరేగింపు చేశారు. ఇది వారు చేశారా లేక ఆకతాయిలు చేశారా అనేది దర్యాప్తులో తెలియాల్సి ఉంది. దీనికి బాధ్యులైన ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని ఎమ్మెల్యే గళ్ళా మాధవి హెచ్చరించారు. ఎన్టీఆర్ అంటేనే తెలుగుజాతి ఆత్మగౌరానికి ప్రతీక అని, అటువంటి ఎన్టీఆర్ విగ్రహం పైన దాడి జరిగింది అంటే ప్రతి తెలుగు వాడి మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. స్థానికంగా ఉన్న ప్రజలు మరియు సిసి కెమెరాలు ద్వారా ఘటనకు కారణమైన వారిని గర్తించి చర్యలు తీస