తిరుపతి ప్రజల మెడపై వేలాడుతున్న 22ఏ కత్తి - ఆర్పిఎస్ కన్వీనర్ నవీన్
తిరుపతి, త్రిశూల్ న్యూస్ : తిరుపతి నగరంలోని ప్రధాన వీధులలో తరతరాలుగా అనుభవిస్తున్న ఆస్తుల క్రయవిక్రయాలు జరగకుండా రిజిస్ట్రేషన్ లు నిలపడం అన్యాయమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, ఐఎన్ టియుసి జిల్లా గౌరవాధ్యక్షులు నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ మరో వివాదాన్ని తెరపైకి తెచ్చి నగర ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందని, తిరుపతి నగర ప్రజలకి 22 (A)(1)(సి) రిజిస్ట్రేషన్ల చట్టం 1908 సమస్య దిన దిన గండంగా మారిందన్నారు. తిరుపతి నగర పరిధిలోని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు, టీటీడీకి సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్ లను వెంటనే నిలుపుదల చేయాలని జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి ఆదేశాలతో అన్నీ ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ లు నిలిచిపోయాయన్నారు. తిరుపతి కపిల తీర్థం రోడ్డులోని సుమారు 75 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారు దీని కారణంగా రెండు వేల కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. తిరుపతిలో ఎన్నికలకు ముందు ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచ