డివిజనుల్లో సమస్యలకు సత్వరమే పరిష్కారం అందిస్తాం..!
- కౌన్సిల్ సమావేశంలో మేయర్ స్రవంతి జయవర్ధన్ నెల్లూరు, త్రిశూల్ న్యూస్: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో స్థానిక సమస్యలను సత్వరమే పరిష్కరించేలా అధికారులతో పర్యవేక్షిస్తామని కార్పొరేషన్ మేయర్ స్రవంతి జయవర్ధన్ పేర్కొన్నారు. నగర పాలక సంస్థ సాధారణ సర్వ సభ్య సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలామ్ కౌన్సిల్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. మేయర్ స్రవంతి జయవర్ధన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దాదాపుగా 62 తీర్మానాలను అజెండాగా, 33 తీర్మానాలను టేబుల్ అజెండాగా సమర్పించారు. నగర పాలక సంస్థ అన్ని డివిజనుల కౌన్సిల్ సభ్యుల సమక్షంలో ప్రవేశపెట్టిన అన్ని తీర్మానాలను కౌన్సిల్ ఆమోదించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా విధి నిర్వహణలోని కార్మికుల సహజ మరణానికి రూ. 2 లక్షలు, ప్రమాద మరణానికి రూ. 5 లక్షల చొప్పున పరిహారాన్ని కుటుంబానికి అందించే తీర్మానానికి ఆమోదించామని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు కోరుతున్న పర్మినెంట్ ఉద్యోగ భద్రత అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని మేయర్ హామీ ఇచ్చారు. డి...