వైద్యో నారాయణ హరి..!
- నేడు వైద్యుల దినోత్సవ దినోత్సవం త్రిశూల్ న్యూస్ డెస్క్ : అనుక్షణం ఆరోగ్యాన్ని , శారీరక, మానసిక స్థైర్యాల్ని అందించే ఈవైద్య నారాయణులకు ఏమిచ్చి రుణము తీర్చుకోవాలి? డాక్టరు చికిత్స చేసేశాడు, రోగి ఫీజు చెల్లించాడు అనుకుంటే ఆ ప్రాణదాత రుణము తీరిపోతుందా? ఆ బంధము తెగిపోతుందా? ఆ దాత పోసిన ఊపిరి అనుక్షణము కృతజ్ఞతను నింపుకుని పదేపదే గుర్తు చేస్తూ ఉంటుంది కదూ. అందుకే ఈ వైద్యులకోసం ప్రపంచమంతా ఒక రోజు కేటాయించింది. అదే ప్రపంచ డాక్టర్స్ డే దినోత్సవం. వాళ్లను గుర్తు పెట్టుకుని ఈ రోజున డాక్టర్లందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో చల్లగా ఉండాలని దేవున్ని ప్రార్ధించి శుభాకాంక్షలు తెలియజేస్తారు. వైద్యుల దినోత్సవం చరిత్ర మన దేశంలో 1991నుంచి డాక్టర్స్‌డే నిర్వహించడం ప్రారంభమైంది. డాక్టర్ బిదాన్ చంద్ర రాయ్ జూలై 1,1882న జన్మించారు, జూలై 1, 1962 మరణిచారు ఆయన గౌరవర్థం జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. బిదాన్ చంద్ర రాయ్ కలకత్తా మెడికల్‌కాలేజీలో చదివారు. ఆ తరువాత ఆరోగ్యశాఖలో చేరారు. ఉన్నత చదువుల కోసం రాయ్ చేసుకున్న అభ్యర్థ...