మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు - ఎస్పీ
- సమన్వయ సమావేశంలో జిల్లా ఎస్పి మలిక గర్గ్ శ్రీకాళహస్తి, త్రిశూల్ న్యూస్ : శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో గురువారం త్రినేత్ర అతిథి గృహములో ముందస్తు ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో జిల్లా ఎస్పి మలిక గర్గ్, కలెక్టర్ లక్ష్మి శలు సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించి, ఆచరించవలసిన ప్రణాళికను దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మలిక గర్గ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వారు శ్రీకాళహస్తీశ్వర స్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి, అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి, ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు మన రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అశేషంగా వచ్చే అవకాశం ఉంది, తదనుగుణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి భద్రతను దృష్టిలో పెట్టుకొని సుమారు 1000 మంది పోలీసులతో పటిష్టమైన భద్రత చర్యలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత బ్రహ్మోత్సవాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోటు పాట్లను బెరీజు వేసుకుంటూ సరికొత్త ప్రణాళికతో అన్ని శాఖల సమన్వయంతో సమిష్టి గా కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. సామా...