ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల...అమరావతే రాజధాని..!
- మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , సిద్దార్థ్ నాథ్ సింగ్ ఉండవల్లి, త్రిశూల్ న్యూస్ : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ సిద్దార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఇది కూటమి మేనిఫెస్టో అయినా సరే పూర్తిగా టీడీపీ - జనసేన మేనిఫెస్టోగానే తెలుస్తోంది. అయితే ఈ మేనిఫెస్టోలో బీజేపీకి సంబంధించిన హామీలను, వాగ్దానాలకు ప్రస్థావించలేదు. బీజేపీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసినందున.. ప్రత్యేకంగా ఉమ్మడి మేనిఫెస్టోలో తమ అంశాలను చేర్చాల్సిన పని లేదని సిద్దార్థ్ నాథ్ సింగ్ వెల్లడించారు. టీడీపీ-జనసేన నేతలతో కలిసి విడుదల చేసిన ఈ మేనిఫెస్టోకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. తమకు స్థానిక మేనిఫెస్టోలు ఉండవని సిద్దార్థ్ నాథ్ స్పష్టం చేశారు. తాము జాతీయ స్థాయిలో మాత్రమే మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. మేనిఫెస్టో రూపొందినప్పుడు బీజేపీ సూచనలు తీసుకున్న...