Posts

Showing posts from July, 2023

వైసిపి హయాంలో వేల ఎకరాల వక్ఫ్ భూములను కబ్జా - కుప్పం టిడిపి పరిశీలకులు గాజుల ఖాదర్ బాషా

Image
- ముస్లింలపై దాడులు, అఘాయిత్యాలు, అకృత్యాలకు పాల్పడ్డ వైసిపి - విలేకరుల సమావేశంలో కుప్పం నియోజకవర్గ పరిశీలకులు గాజుల ఖాదర్ బాషా కుప్పం, త్రిశూల్ న్యూస్ : మైనార్టీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్, వైసీపీ నాయకులు తప్పుడు ప్రకటనలు మానుకోవాలని కుప్పం నియోజకవర్గ పరిశీలకులు గాజుల ఖాదర్బాషా అన్నారు. కుప్పం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకుల వేధింపులకు తాళ లేక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. 2019 జూన్ నుండి 2021 ఆగస్టు వరకు దాదాపు రూ. 1,483.62 కోట్ల మైనారిటీ నిధులను దారి మళ్లించినట్టు.. వేల ఎకరాల వక్ఫ్ భూములను కబ్జా చేసినట్టు ఆరోపించారు. మైనార్టీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ముస్లీంల విద్యార్ధులకు విదేశీ విద్య పథకాన్ని రద్దు చేయడమే కాకుండా జగన్ రెడ్డి పాలనలో ఒక్క ముస్లీం కుటుంబానికైనా న్యాయం జరిగిందా అని వైసిపి నాయకులకు ప్రశ్నించారు.? ఆయన దృష్టిలో ముస్లీంలు కేవలం ఓటు బ్యాంకేనా అన్నారు. ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా అలంకార ప్రాయంగా, ఉత్సవ విగ్రహంలా మారిపోయారని, ముస్లీంలకు అన్యాయం చేస్తున్న జగన్ రెడ్

తాగి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదు - కుప్పం అర్బన్ సీఐ శ్రీధర్

Image
  కుప్పం, త్రిశూల్ న్యూస్ : కుప్పం పట్టణ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 9 మంది నిందితులను సోమవారం కుప్పం న్యాయస్థానంలో పోలీసులు హాజరు పరిచారు. ఈ కేసును పరిశీలించిన న్యాయమూర్తి నిందితులకు రెండు రోజుల జైలు శిక్షతోపాటు రూ. 2వేలు జరిమానా విధించినట్లు అర్బన్ సిఐ శ్రీధర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.

కుప్పం సరే మరి పుంగునూరులోని దొంగ ఓట్లపై పెద్దరెడ్డి సమాధానం చెప్పాలి - ఎమ్మెల్సి కంచర్ల శ్రీకాంత్

Image
- బూతు స్థాయి ఉద్యోగులు అధికార పార్టీకి తొత్తులు కావద్దు - విలేకరుల సమావేశంలో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కుప్పం, త్రిశూల్ న్యూస్ : కుప్పం నియోజకవర్గంలో దొంగ ఓటర్లు ఉన్నారంటూ పదే పదే ఆరోపిస్తున్న వైసిపి నేతలకు పుంగనూరులో ఉన్న దొంగ ఓటర్ల సంగతి ఏమిటని తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ప్రశ్నించారు. ఓటర్ల జాబితా పరిశీలనపై కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ అధ్యక్షులు పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి నాయకులు, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ భరత్ నిర్వహించే సభా సమావేశాలలో కుప్పం శాసనసభ్యులుగా నారా చంద్రబాబు నాయుడు దొంగ ఓట్లతో గెలిచారంటూ ఆరోపించడంపై మండిపడ్డారు.  ఎన్నికలు దగ్గర పడడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అధికారులు ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఓటర్ల జాబితాలో రెండు లక్షలకు పైచిలుకు ఇంటి నెంబర్లు లేని గృహాలను గుర్తించడం జరిగిందన్నారు. అందులో ఒక్క పుంగునూరు నియోజకవర్గంలోనే సు

రైతులతో చేలగాటం ఆడితే సహించేది లేదు - జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల

Image
జగిత్యాల, త్రిశూల్ న్యూస్ : అప్పో సప్పో చేసి పెట్టుబడి పెట్టి రెక్కలు ముక్కలు చేసుకొని ఇంటిల్లిపాది ఎండనక, వాననాక, చలి అనక రెయిoబవాళ్ళు శ్రేమించి పండించే అన్నదాతతో ప్రభుత్వం చేలగాటం ఆడితే ఎట్టిపరిస్థితులల్లో సహించేది లేదని రైతు రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యే పరాజితుడు అభ్యుదయ యువ రైతు జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల అన్నారు. సోమవారం రైతుల ఇబ్బందులు, సమస్యలు తెలుసుకొనేందుకు జగిత్యాల జిల్లాలో పలు ప్రాంతాలలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ అనుక్షనం అన్నదాతకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం అరిగోసపెట్టడం ఇదివరకే ఎన్నో మార్లు స్పష్టం అవగా మరో మారుగా ప్రభుత్వం అధికారులు రైతును అయోమయంలో ముంచి నష్టపరిచే విధంగా ఉద్యనవన సాగుకు ప్రభుత్వ ప్రోస్సహం అంటూ రైతులను ఉరిస్తున్నారు. ఇది తగదు అని గతంలో కేవలం ఆయిల్ ఫామ్ సాగుకు తప్ప దేనికి సబ్సిడీలు లేవని రైతులను ఇబ్బంది పెట్టి ఇప్పుడు జోరు వర్షాకాలంలో ఆగమేఘాలపై లక్ష్యం చేరుకొనేందుకు అతి కొద్ది గడువుతో లబ్ధిదారుల ఎoపికకు చివరి గడువు అనడం సబబు కాదన్నారు. ఇప్పటికే రైతులు ఏదో పంట సాగు చేసి ఉన్నారు

పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే తప్పక విజయం సాధించి జనసేన జెండా ఎగరవేస్తాం - తిరుపతి జనసేన నేతలు

Image
తిరుపతి, త్రిశూల్ న్యూస్ : జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో, సభ్యత్వాలను నమోదు చేయించిన ప్రతి ఒక్కరికి ఆదివారం సభ్యత్వంకు సంబంధించిన కీట్లను జిల్లా అధ్యక్షులు డా. హరి ప్రసాద్, ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షులు రాజా రెడ్డిల చేతుల మీదుగా కార్యకర్తలకు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాలు వేరు, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసిన తర్వాత నుంచి వేరు అని, ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పని చేస్తే రాబోయే రోజుల్లో జనసేన జెండాను ఎగరవేయడం ఖాయమన్నారు. జనసేన అధినేతను ముఖ్యమంత్రి చేసుకొని తీరుతామని, అధికార పార్టీకి ఒక జనసేన పార్టీనే ప్రత్యర్థి పార్టీ అని ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నిన రేపు పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేసి రాయలసీమలోనే మొట్టమొదటి స్థానంలో నిలిపేలా సభ్యత్వాలను నమోదు చేయించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

జనసేన పార్టీలోకి చేరికలు.. కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన డాక్టర్ హరిప్రసాద్..!

Image
తిరుపతి, త్రిశూల్ న్యూస్ : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సిద్ధాంతాలు నచ్చి, ఆయన అడుగులలో అడుగులు వేసి మా వంతు కష్టపడి పార్టీకి కృషి చేస్తామని తిరుపతి పెద్దకాపు వీధి నుంచి అప్పిశెట్టి శంకర్ రాయల్, వెంకటేశ్వర రెడ్డి, కాలేష, సుధాకర్ రావు, సురేంద్ర, గిరీష్, పవన్, రాజేశ్వరి తదితరులు ఆదివారం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్, తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి, సుమన్ బాబుల సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికీ పార్టీ కండువాలు వేసి జనసేనలోకి ఆహ్వానించారు. పార్టీలో నూతనంగా చేరిన వారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోవు రోజులలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాబోతున్నారని, ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని, ఏ ఒక్క అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలకు జనసేన ప్రభుత్వం పాల్పడదని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలతో పాటు, ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుందని.. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆధునిక "భారత్"లో.. "ఆటవిక" క్రీడలు.. మణిపూర్ దుర్ఘటనలపై ప్రత్యేక విశ్లేషణ..!

Image
  త్రిశూల్ న్యూస్ డెస్క్ : ఎవరో అక్కడ ఆట మొదలుపెట్టారు.. ఎవరెవరో ఆటలాడారు.. అందలో కొందరు గెలిచారు.. కొందరు ఓడారు.. చివరికి ప్రజలు, న్యాయస్థానాలు చీకొట్టేవరకు తెచ్చుకున్నారు.. నాలుకరుచుకున్నారు.. దుండగులను శిక్షిస్తాం..అది చేస్తాం, ఇది చేస్తామంటూ మీడియా ముందు రక్తి కట్టించారు..సంఘటన జరిగిన రెండు నెలల తర్వాత నోరు కదిపారు..ఆడబిడ్డల మానప్రాణాలు అంటే అంత అలుసా అని,ప్రజలు తిరగబడితే గాని,జ్ఞానోదయం రాని ఈ పాలకులు మన దేశాన్ని ఎటు తీసుకుపోతున్నారో అనే ఒక ప్రశ్న 140 కోట్ల మంది భారతీయుల్లో కలిగింది..?   వివరాలు పరిశీలిస్తే..! గిరిజనులు, గిరిజనేతరుల మధ్య అగ్గి రగిలించి, 150 మందికిపైగా పౌరులు మరణిస్తే గాని, చలించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఒక్కసారిగా ముగ్గురు ఆడబిడ్డలపై లైంగిక వేధింపులు, సామూహిక అత్యాచారం, ఆపై పాసవిక హత్యలు. ఇలాంటి వార్తలు బయటకు వస్తే గాని నోరు కదపలేదు. సుప్రీంకోర్టు సుమోటాగా కేసు తీసుకునే వరకు చలనం లేదంటే, ఇక దేశ పౌరుల భద్రత ఎలా ఉందో మనం చెప్పనవసరం లేదు.? 53% ఉన్న మైతేయిలకు, 40 శాతం పైగా ఉన్న నాగా, కూకిలకు మధ్య మే నెల మొదటి నుంచి జరుగుతున్న అంతర్గత యుద్ధం యావత్ భార

2024 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజారిటీకి నిరంతరం కృషి - ఎం. మంజునాథ్

Image
కుప్పం, త్రిశూల్ న్యూస్ : రాబోయే ఎన్నికల్లో కుప్పం తరుపున చంద్రబాబు నాయుడుకు లక్ష ఓట్ల మెజారిటీయే లక్ష్యంగా కృషి చేస్తానని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తరణ విభాగం సభ్యులు ఎం. మంజునాథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విస్తరణ విభాగంలో సభ్యుడుగా నన్ను ఎంపిక చేసినందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చన్నయుడుకి కృతజ్ఞతలు, అలాగే ఈ బాధ్యతలు అప్పగించిన కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పాదాభివందనాలు అన్నారు. నాకు ఈ స్థానం కల్పించడానికి కృషి చేసిన కుప్పం ఇంచార్జ్ మునిరత్నంకు, ఎమ్మెల్సి కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మనోహర్, పి గోపీనాథ్ లకు  ప్రత్యేక ధన్యవాదాలన్నారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి తనకు ఈ బాధ్యత కల్పించడంతో చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకుని పార్టీ అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని మంజునాథ్ ఈ సందర్బంగా తెలిపారు.

ఈనాడు విలేకరి ఇంటిపై వైసిపి నేతలు విధ్వంసకాండ..!

Image
- పక్కనే ఉండి చోద్యం చూసిన పోలీసులు, అధికారులు - కోర్టు స్టే ఉందని చెప్పినా వినిపించుకోని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరులు - వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అక్రమాలపై వార్తలు రాస్తున్నారనే అక్కసుతోనే కక్ష సాధింపు  - తీవ్రంగా ఖండించిన తెలుగు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘాలు అనంతపురం, త్రిశూల్ న్యూస్ : అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి అక్రమాలను వెలికితీసి, వార్తలు రాస్తున్న బొమ్మనహాళ్‌ మండల ‘ న్యూస్‌టుడే ’ విలేకరి వెంకటేశులుపై వైకాపా నాయకులు కక్ష సాధింపునకు దిగారు. శనివారం మధ్యాహ్నం జేసీబీతో వచ్చిన వైకాపా నాయకులు ఆయన ఇంటి ప్రహరీ, మరుగుదొడ్డిని కూల్చివేశారు. పక్కాగా నిబంధనల మేరకు నిర్మించిన ఇంటిని.. రోడ్డు స్థలాన్ని ఆక్రమించి కట్టారని ఆరోపిస్తూ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. వైకాపా నాయకుల ఆరోపణలే ఆధారంగా కూల్చివేతల పర్వం కొనసాగింది. దీనికి రెవెన్యూ, పోలీసు అధికారులు దగ్గరుండి సహకరించడం మరింత దారుణం. స్థల వివాదంపై కోర్టు స్టే ఉందని చెప్పినా.. మందస్తు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాల్ని ఎలా కూలుస్తారని ప్రశ్నించినా అన్నింట

జర్నలిస్టు కార్పోరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలని మీడియా అకాడమీ చేర్మెన్ కు వినతి..!

Image
- మీడియా అకాడమీ చైర్మన్ ను కోరిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు - కొమ్మినేనిని మర్యాదపూర్వకంగా కలిసి, సన్మానించిన సంఘం సభ్యులు - జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా - కొమ్మినేని హామీ విజయవాడ, త్రిశూల్ న్యూస్   జర్నలిస్టులను ఫోర్త్ ఎస్టేట్ గా ప్రభుత్వాలు ఎంతోకాలంగా గుర్తించాయి. కానీ జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడం మరిచాయి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక కార్పొరేషన్ లు ఏర్పాటు చేసిన విధంగానే 'జర్నలిస్టుల కార్పోరేషన్' కూడా ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడెమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావును తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు కోరారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సి.ఆర్ మీడియా అకాడెమీ చైర్మన్ కార్యాలయంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా తెలుగు రాష్ట్రాలలో ఐక్యత - సంక్షేమం - భరోసా నినాదాలతో ఏర్

ఉత్తమ పాఠశాలగా అవార్డు అందుకున్న కుప్పం వినాయక ఉన్నత పాఠశాల..!

Image
కుప్పం, త్రిశూల్ న్యూస్ : కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ ఇండియన్ ఐకాన్ వారు చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబీగానిపల్లిలో ఉండు వినాయక ఉన్నత పాఠశాలకు 2023వ సంవత్సర ఉత్తమ పాఠశాలగా ఎంపిక చేశారు. ఆదివారం ఢిల్లీలోని వివాంత తాజ్ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో పాండిచ్చేరి లెఫ్ట్ గవర్నర్ మరియు భారతదేశ తొలి మహిళా ఐపిఎస్ అధికారి కిరణ్ బేడీ చేతుల మీదగా ఈ అవార్డును వినాయక పాఠశాల అధినేత డా.ఎం. క్రిష్ణ అందుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ దక్షిణ జిల్లా కలెక్టర్ మీకల చైతన్య ప్రసాద్ మరియు కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. పాఠశాల కరెస్పాండంట్ డా. ఎం.క్రిష్ణ మాట్లాడుతూ ఈ అవార్డు మా పాఠశాలకు రావడం ఎంతో గర్వంగా ఉంది.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన అవార్డులు రావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్బంగా తెలిపారు.

ఒంటరి జీవితం భారమై.. గుడుపల్లె తహసీల్దార్ కార్యాలయంలో విఆర్ఎ ఆత్మహత్య..?

Image
గుడుపల్లె, త్రిశూల్ న్యూస్ : నా అనుకున్న వాళ్లు ఎవరూ లేరు.. ఒంటరి జీవితం భారమైపోయా..? కొన్ని సంవత్సరాలుగా ఇదే మనోవేదన, తాసిల్దార్ కార్యాలయంలో పడుకోవడం.. అక్కడే ఉద్యోగం చేయడం ఇదే గోవిందప్ప దినచర్య..? కానీ ఎలా జరిగిందో..? ఏం జరిగిందో తెలియదు గాని శుక్రవారం ఉదయం పనిచేసే తాసిల్దార్ కార్యాలయం నందు ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ప్రకారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం తాసిల్దార్ కార్యాలయంలో గోవిందప్ప స్వంత ఊరు పెద్దకొటామాకనపల్లె గ్రామానికి చెందిన వి. గోవిందప్ప (72) విఆర్ఎగా పనిచేస్తున్నారు. వయసు మీదపడిన తహసీల్దార్ కార్యాలయం మాత్రం వీడి పోలేదు. తనకు ఎవరు లేకపోవడంతో ఇక్కడే తినడం, ఇక్కడే పడుకోవడం. కానీ శుక్రవారం ఉదయం కార్యాలయంకు వచ్చిన సిబ్బందికి కార్యాలయంకు లోపల గడి పెట్టడంతో అనుమానం వచ్చి తలుపులు బాధడంతో ఎంతకు తెరుచుకోకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది ఓ పక్కన కిటికీ ఓపెన్ లో ఉండడంతో లోపలకి చూసి ఒక్క సరిగా భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే విషయం తహసీల్దార్ కి తెలియజేశారు. అయన వెంటనే గుడుపల్లె పోలీసులకు సమాచారం అందించడంతో హు

అందరి చూపు చందమామ వైపు.. నేడే అంతరిక్షంలోకి చంద్రయాన్ - 3

Image
శ్రీహరికోట, త్రిశూల్ న్యూస్ : అలనాటి రామచంద్రుడి నుంచి నేటి ఆధునిక రోబో వరకు.. అందాల చందమామ ఎప్పుడూ మానవాళికి ఆకర్షణీయమైన అద్భుతం. దీనిని చేరుకోవాలని అందరూ కోరుకుంటారు. దీనికోసం గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కొన్ని విజయవంతం అయ్యాయి. 2008 అక్టోబర్ 22న మన దేశం చంద్రుని గురించి అనేక విషయాలు తెలుసుకునేందుకు చంద్రయాన్ -1‌ను ప్రయోగించింది. 2019, ఆగస్టు 14న చంద్రయాన్ – 2ను ప్రయోగించి, ఆగస్టు 20, 2019 న చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు కానీ చంద్రుడి ఉపరితలానికి 2.1 కి.మీ. ఎత్తులో ఉండగా, ల్యాండరుకు భూమితో సంబంధం తెగిపోయింది. అయితే, ఈ యాత్ర 90 నుండి 95% వరకూ విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. తక్కువ ఖర్చుతో కూడుకున్న మిషన్లకు పేరుపొందిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్ -3తో మరోసారి చంద్రుడిపైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఇస్రో మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ నీటి మొత్తాన్ని ఆవిరి రూపంలో ఉన్న ట్రేస్ గుర్తించి చంద్రయాన్ -1తో అపారమైన విజయాన్ని సాధించింది. అందుకే మరోసారి చంద్రయాన్ -3తో చంద్రుని ఉపరితలంపై మరింత అధ్యయనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. బిలియన్ సంవత్స

పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన చోట పసుపు నీళ్లతో శుద్ధి చేసిన గుడుపల్లె జనసైనికులు..!

Image
గుడుపల్లె, త్రిశూల్ న్యూస్ : చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు వారి ఆదేశానుసారం కుప్పం నియోజకవర్గం గుడిపల్లె మండలం జనసేన పార్టీ అధ్యక్షులు అమీర్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. వాలంటీర్లపై అనుచిత వాఖ్యలు చేసారంటూ నిన్న గుడుపల్లె మండల కేంద్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు గుడుపల్లె మండల వాలంటీర్లు. ఇందుకు నిరసిస్తూ గురువారం కుప్పం నియోజకవర్గం అధ్యక్షులు డాక్టర్ నరేష్, మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో గుడిపల్లె బస్టాండులో దిష్టి బొమ్మను దగ్ధం చేసిన చోట పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు. అనంతరం గుడుపల్లె పార్టీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి దిష్టి తీశారు. ఈ కార్యక్రమంలో గుడపల్లె, కుప్పం నియోజకవర్గం జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతిలో జనసేన పార్టీలోకి భారీగా చేరికలు..!

Image
తిరుపతి, త్రిశూల్ న్యూస్ : జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయ సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకొని రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఒక పవన్ కళ్యాణ్ ద్వారానే అని నమ్మి బిజెపి, వైసిపి, కాంగ్రెస్ పార్టీల నుంచి గురువారం తిరుపతిలో గుట్టా నాగరాజ రాయల్, రమేష్ నాయుడు, శేషారత్నం, రమనయ్య, సుబ్రహ్మణ్యం, సుకుమార్, శేషారెడ్డి, గురు, రమేష్, శ్రీహరి, సుబ్బయ్య, రామ్ గోపి, కిరణ్ కుమార్, శివ, చిట్టి బాబు తదితరులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ ఒక్క అవినీతి రాజకీయ మచ్చలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, కష్టాల్లో ఉన్న కౌలు రైతులకు సుమారు 30 కోట్ల రూ సొంత నిధులను పంచి పెడుతున్నారని, రేపు ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నూతనంగా చేరిన నాయకులు ఆశాభవం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి మరియు ముఖ్య నేతలు మాట్లాడుతూ రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున జనసేన పార్టీలోకి చేరికలు జరుగుతాయని ఇది ఆరంభం మాత్రమేనని రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్, జనసేన వైపు చూస్తున్నారని రాక్షస పాలన నుంచి విముక్తి చెందాలంటే పవన్ కళ్యాణ్ ముఖ

కార్పొరేట్ అనుకూల ప్రభుత్వాలను కూలగొడుదాం - సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్

Image
కళ్యాణదుర్గం, త్రిశూల్ న్యూస్ : పేదల పట్ల అనుకూల నిర్ణయాలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైన కార్పొరేట్ అనుకూల ప్రభుత్వాలను కూల కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పిలుపునిచ్చా రు. గురువారం కుందుర్పి మండలం తూముకుంట గ్రామంలో సీపీఐ కార్యాలయం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి మండల కార్యదర్శి శివలింగప్ప, గ్రామ కార్యదర్శి నాగరాజులు అధ్యక్షత వహించారు. సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు సంజీవప్ప, తాలూకా కార్యదర్శి గోపాల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సీనియర్ నాయకులు విరూపాక్షప్ప జండా ఆవిష్కరణ చేయగా అనంతరం జరిగిన సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పని లేక వలస వెళుతున్న వారిని అడ్డుకోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా పథకాలు దేనికని ప్రశ్నించారు. దొంగల అధిపతిగా మోడీ, అపద్దాల అధిపతిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సాంకేతిక రంగాలను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టిన మోడీ, జగన్ ప్రభుత్వాలను ఇంటికి పంపాలన్నారు. ఉపాధి పథకం తీసుకురావడానికి కమ్యూనిస్టులు చేసిన పోరాటాల

దగ్గుపాటి పురంధేశ్వరిని కలసిన ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ తులసినాథ్..!

Image
విజయవాడ, త్రిశూల్ న్యూస్ : భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరిని ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ తులసినాథ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి ప్రమాణస్వీకారం మహోత్సవ కార్యక్రమానికి ఓబిసి కార్యవర్గ సభ్యుడు తులసి నాథ్ హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షురాలిని శాలువాతో సత్కరించి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. త్వరలో కుప్పం నియోజకవర్గ పర్యటనకు దగ్గుబాటి పురందేశ్వరి రానున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ డా. బి.ఎస్‌. రావు కన్నుమూత..!

Image
హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ : శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ డా.బి.ఎస్‌. రావు కన్నుమూశారు. ప్రమాదవశాత్తు ఆయన బాత్‌రూమ్‌ జారిపడటంతో ఆయన తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ బి.ఎస్‌. రావును అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బీఎస్ రావు తిరిగి కోలుకోలేకపోయారు. గురువారం మధ్యాహ్న ప్రాంతంలో తుది శ్వాసం విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని విజయవాడకు తరలించనున్నారు. డాక్టర్ బీఎస్ రావు పూర్తి పేరు బొప్పన సత్యనారాయణరావు. 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను ప్రారంభించి అనతికాలంలోనే ఆ సంస్థలను అగ్రగామి పథంలో నడిపించారు. మొదట విజయవాడలో బాలికల జూనియర్ కళాశాలతో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఆపై అంచెలంచెలుగా ఎదిగి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, ఎంసెట్‌కు కేరాఫ్ అడ్రెస్ గా శ్రీచైతన్యను ఉన్నతస్థానానికి చేర్చారు. డాక్టర్ బీఎస్ రావు 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లు స్థాపించారు.

చంద్రయాన్ - 3 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభించిన ఇస్రో..!

Image
శ్రీహరికోట, త్రిశూల్ న్యూస్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రుని చెంతకు చేరడం కోసం చంద్రునిపై కూడా భారత జాతీయ జండాను నిలిపి ప్రపంచదేశాలకు దీటుగా నిలవడం కోసం సర్వం సిద్ధం చేసింది. రేపు జరిగే చంద్రయాన్ - 3 ప్రయోగంతో సరికొత్త అధ్యనానికి శ్రీకారం చుట్టబోతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి రేపు మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు ఇస్రో LVM3 /M4 రాకెట్ ద్వారా చంద్రయాన్ - 3 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ ప్రయోగానికి సంబందించిన కౌంట్ డౌన్ కూడా గురువారం మధ్యాహ్నం 1 :05 గంటకు ప్రారంభించడం జరిగింది. 25 గంటల 30 నిమిషాల పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగిన అనంతరం ప్రయోగం జరుగుతుంది. ఇప్పటికే ప్రయోగ విజయం కోసం ఇస్రో చైర్మన్ సోమనాధ్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. ప్రపంచ దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు ఇస్రో వైపు చూస్తుంటే ఇస్రో మాత్రం చంద్రుని చెంతకు చేరడమే లక్షంగా పెట్టుకుని పనిచేస్తుంది. చంద్రయాన్ -1 మరియు చంద్రయాన్-2 ప్రయోగాల ద్వారా చంద్రుని పైన నీటి జాడలను ఇస్రో స్పష్టంగా గుర్తించడం జరిగింది. ఇదే స్ఫూర్తితో  ఇంకా చంద్రునిపై దాగి ఉన్న రహస్యాలను ఛేదించడానికి

ఇళ్ల నిర్మాణం కోసం ఏపీకి కేంద్రం రూ.20 వేల కోట్లిచ్చింది - పురందేశ్వరి

Image
విజయవాడ, త్రిశూల్ న్యూస్ : రాష్ట్రంలో రహదారుల దుస్థితేంటో ప్రజలను అడిగితే తెలుస్తుందని ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరణ తర్వాత తొలిసారి మీడియాతో పురందేశ్వరి మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణానికి 9 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్రం రూ.20 వేల కోట్లు ఇచ్చింది.. రాష్ట్రంలో ఇప్పటికే 65 శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయి ఉండాలి.. కానీ 35 శాతం కూడా పూర్తి కాలేదనేదన్నారు. ఈ విషయంలో పేదలకు వైకాపా ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రహదారుల దుస్థితేంటో ప్రజలను అడిగితే తెలుస్తుందని.. ఏపీలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది.. ఉన్న పరిశ్రమలూ తరలిపోతున్నాయి అని విమర్శించారు. ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లి ఘన నివాళులు.. విజయవాడలో బాధ్యతలు స్వీకరణ కంటే ముందు.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను పురందేశ్వరి సందర్శించారు. తండ్రి ఎన్టీఆర్‌ సమాధి వద్ద తన నియామక పత్రాన్ని ఉంచి పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత గన్నవరం చేరుకున్న ఆమెకు కార్యకర్తల

రాయలసీమ సమస్యలపై పోరాటం ఉధృతం - ఆర్వీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాధ్

Image
- ఘనంగా రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ 10వ ఆవిర్భావ వారోత్సవాలు - రాయలసీమను రతనాల సీమగా మార్చుకుందాం - ఆర్వీఎఫ్ సీమ జిల్లాలో రాజీలేని పోరాటం -  రాష్ట్ర ఉపాధ్యక్షులు దామోదరం నాగన్న కర్నూలు, త్రిశూల్ న్యూస్ :  రాయలసీమ ప్రాంత విద్యార్దుల, యువకుల సమష్యలపై, సీమ హక్కులకై, ఉపాధి, ఉద్యోగాల కోసం, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రమే లక్ష్యంగా పోరు బాట సాగిస్తున్న ఆర్వీఎఫ్ రాయలసీమ విద్యార్ధి ఫెడరేషన్ ఆవిర్భవించి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆర్వీఎఫ్ 10వ ఆవిర్భావ వారోత్సవాలను కర్నూలులోని శ్రీమేధ కళాశాలలో ఆర్వీఎఫ్ కర్నూలు జిల్లా అధ్యక్షులు నాగరాజు అధ్వర్యంలో ఆర్వీఎఫ్ రాష్ట్ర నేతలు విద్యార్దినీలతో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్ధినీలకు ఆర్వీఎఫ్ ఆశయాలు వివరించారు. ఈ సందర్బంగా ఆర్వీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాధ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు దామోదరం నాగన్నలు మాట్లాడుతూ రాయలసీమ అస్ధిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, సీమ హక్కులకై, వెనుకబాటు తనంపై పోరుబాట సాగించేందుకు 2014 సంవత్సరం జూలై 13 తేదీన నంద్యాల జిల్లా కేంద్రం నంద్యాలలో ఆర్వీఎఫ్ ఆ

రేణిగుంట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి నితిష్ గడ్కరీకి ఘనస్వాగతం..!

Image
తిరుపతి, త్రిశూల్ న్యూస్ : రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల కేంద్ర మంత్రి తిరుపతి జిల్లాలో ఈ రోజు మరియు రేపు, రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేంద్ర మంత్రి వారికి ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు తిరుపతి నగరపాలక మేయర్ శిరీష, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, ఆం.ప్ర రోడ్లు భవనాలు శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, జెసి డి కె బాలాజీ, నగరపాలక కమిషనర్ హరిత, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, ఎన్హేచ్ఏఐ ఆర్. ఓ, విజయవాడ రాకేష్ కుమార్ సింగ్, చిత్తూరు పిడి కార్తిక్, ఆర్డీవో రామారావు, పలువురు బిజెపి ప్రతినిధులు, తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలకు వేలంపాట ద్వారా రూ. 7.87లక్షలు ఆదాయం..!

Image
- గత సంవత్సరం కంటే బ్రహ్మోత్సవాలకు రూ.88,500 ఆదాయం  గుడుపల్లె, త్రిశూల్ న్యూస్ : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం  గుడుపల్లె మండలం చిన్నగొల్లపల్లె గ్రామపంచాయతీ పశ్చిమవాహిని గుడివంకలోని వేపమానుకొండలో నెలకొని ఉన్న శ్రీ వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలకు నిర్వహించిన వేలం పాట ద్వారా రూ. 7,87000లు ఆదాయం వచ్చింది. బుధవారం ఆలయ ప్రాంగణంలో చేర్మెన్ ఎన్. సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కార్యనిర్వహణాధికారి వై. వి. చలపతి వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటులో  లడ్డు విక్రయానికి రూ.4.50లక్షలు, తలనీలాలకు రూ. 2. 72లక్షల, ఆంగుళ్ళుకు రూ. 65వేలు ఆలయానికి ఆదాయం వచ్చింది. ఆగస్టు 3వ తేది నుండి 9వ తేది వరకు ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్ల ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 17నుండి ఆడినెల ప్రారంభం నుండి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చేర్మెన్ తెలిపారు. కాగా గత సంవత్సరం జరిగిన వేలం పాట కంటే ఈ ఏట జరిగిన వేలం ద్వారా రూ.88.500 ఎక్కువ ఆదాయం వచ్చింది. గత ఏడాది వేలం ద్వారా రూ. 6,98500లు వచ్చింది. ఈ వేలం పాటులో ఆంగుళ్ళ

పవన్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే దిష్టి బొమ్మలు దహనం - కుప్పం జనసేన

Image
కుప్పం, త్రిశూల్ న్యూస్ :  వైసీపీ దాస్టికాలను వారాహి యాత్ర ద్వారా ఎండగడుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పలేక, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారని కుప్పం జనసేన నాయకులు డాక్టర్ నరేష్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు ఆదేశానుసారం వైసీపీ పార్టీ ముసుగులో వాలంటీర్లను రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ ఫోటోలను తగులబెట్టినందుకు ఖండిస్తూ కుప్పం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు డాక్టర్ నరేష్ ఆధ్వర్యంలో  కుప్పం బస్టాండు ఆవరణంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి దిష్టి తీశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాండు, పవన్ మహేష్, కృష్ణ, సత్య, మహేష్, మంజు, అమీర్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఏపీలో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం..!

Image
అమరావతి, త్రిశూల్ న్యూస్ : 2024 ఏప్రిల్ లేదా మే మాసాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయని ఆయాజిల్లాల సమస్యలు వాటి పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో మంత్రులను జగన్ ఆదేశించారు.బుథవారం కేబినెట్ సమావేశం అనంతరం గడపగడపకు మన ప్రభుత్వం జగనన్నసురక్ష కార్యక్రమాలపై మత్రుల పర్యవేక్షణ ఉండాలన్నారు.                                 ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహిస్తున్నారు. రెండో విడత యాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. మరో వైపు వైసీపీ కూడ ఎన్నికలకు సిద్దమౌతుంది.వైసీపీకి చెందిన రీజినల్ కో ఆర్ఢినేటర్లు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరో వైపు ఇంచార్జీలు లేని సెగ్మెంట్లకు టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇంచార్జీలను నియమిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ లో కూడ ఎన్నికలకు బీజేపీ సన్నద్దమౌతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును తప్పించి ఆయన స్థానంలో పురంధేశ్వరిని నియమించింది.