Posts

Showing posts from July, 2022

సచివాలయంలో గేదలు..!

Image
- స్పందన అర్జీలకు స్పందించిన అధికారులు  - గుంటూరు నగర పాలక సంస్థలో వింత పంచాయతీ గుంటూరు, త్రిశూల్ న్యూస్ : 'స్పందన' కార్యక్రమంలో ఓ అర్జీదారుడి దెబ్బకు శానిటరీ సూపర్వైజర్.. రైతు గేదెలను తీసుకొచ్చి సచివాలయం వద్ద కట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే... గుంటూరు నగర పాలకసంస్థ పరిధిలోని ఏటుకూరు ప్రాంతానికి చెందిన ఓ అర్జీదారు.. తన ఇంటి పక్కన ఉన్న గేదెలతో వాసన వచ్చి ఇబ్బంది పడుతున్నానంటూ ఏడాది కాలంగా తరచూ అధికారులకు వినతి పత్రాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో శానిటరీ సిబ్బంది పలుమార్లు గేదెల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినా స్పందనలేదు. దీనిపై వారు న్యాయస్థానం వరకు కూడా వెళ్లారు. అయితే తరచూ ఇదే సమస్యపై స్పందనలో ఫిర్యాదు రావటంతో చేసేదేమీ లేక శానిటరీ సూపర్ వైజర్ వెంకటేశ్వరరావు.. రైతు శ్రీనివాస్ కు చెందిన గేదెలను తీసుకొచ్చి సమీపంలోని సచివాలయం వద్ద కట్టేశారు. స్పందన అర్జీ పరిష్కరించకుంటే తనను సస్పెండ్ చేస్తారని, అందుకే ఇలా గేదెలను తీసుకొచ్చి సచివాలయం వద్ద కట్టేశామని శానిటరీ సూపర్ వైజర్ చెబుతున్నారు. వాటి పాలను తీసుకోవాలని సదరు రైతుకు సూచించామన్నారు. రైతుకు ఎన్ని సార్లు

రేపటి నుండి శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు..!

Image
- మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహణ  తిరుపతి, త్రిశూల్ న్యూస్ : వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు ఆగస్టు 2 నుండి 4వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 2న అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. మొదటిరోజు సేనాధిపతి ఉత్సవం జరుగనుంది. ఆగస్టు 3వ తేదీన ఉదయం యాగశాల పూజ, స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ, 6 గంటలకు శ్రీ సీతారామ శాంతి కళ్యాణం, రాత్రి 8 గంటలకు హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు. ఆగస్టు 4న ఉదయం యాగశాల పూజ, స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండువగా జరుగనుంది. సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌ సేవ, రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై శ్రీపట్టాభిరాముడు విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. గృహస్తులు (ఇద్దరు) రూ.300/- చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఈ మూడు రోజుల పాటు టీటీడీ హిందూధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్న

ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం..!

Image
తిరుమల, త్రిశూల్ న్యూస్ : మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన భక్తులు సురేష్ అజ్మీర్, సాగర్ అజ్మీర్ కలిసి రూ.10 లక్షలు ఆదివారం ఎస్వీబీసీ ట్ర‌స్టుకు విరాళంగా అందించారు. తిరుమలలోని నాదనీరాజనం వేదిక వద్ద మహారాష్ట్ర ఎంపి సంజయ్ జాదవ్, శ్రీశ్రీశ్రీ రమాకాంత్‌జీ వ్యాస్ మహరాజ్ సమక్షంలో ఈ విరాళాన్ని టిటిడి ఈఓ ఎవి.ధర్మారెడ్డికి అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో సివిఎస్వో నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సిఈఓ షణ్ముఖ కుమార్, విజిఓ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎస్వియు సెమిస్టర్ ఫలితాలలో కుప్పం డిగ్రీ కళాశాల విజయకేతనం..!

Image
  కుప్పం, త్రిశూల్ న్యూస్ : యస్ వి యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ లో నిర్వహించిన 5వ సెమిస్టర్ డిగ్రీ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలలో కుప్పం డిగ్రీ విద్యాసంస్థ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. బిబిఏ గ్రూప్ లో యస్ .మోనిషా - 9.13 , యమ్. రోషిణి - 8.17, యన్. నరసింహ - 7.68 గాను. బి జడ్ సి గ్రూప్ లో యన్. చాందిని - 9.62, ఏ. పూజా - 9..26, యల్ .మేఘన - 9.20 గాను, బిఎస్సీ ఫీజిక్స్ పి. రవి కుమార్ -9.10 , యూ. అప్రిన్ - 9.06, జి. తేజస్విని - 9.01 గాను, బీఎస్సీ మాథ్స్ లో యమ్. కావ్య శ్రీ - 9.40 , యమ్.స్నేహ -9.24, వి.సౌమ్య - 9.15 మరియు బి.కామ్ కంప్యూటర్ సైన్స్ లో బి.యస్. నిత్యా శ్రీ - 8.93, స్వప్న - 8.84, డి.భావన - 8.79 మార్కులతో ఉత్తిర్ణత సాధించించారు. విద్యార్థులను విద్యాసంస్థ అధినేత, ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయుల సిబ్బంది అభినందించారు సెమిస్టర్ ఫలితాల్లో నియోజకవర్గ స్థాయిలోను ప్రథమ స్థానంలో నిలిచినందుకు గాను ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

విశ్వంలోని హిందువుల దర్శనీయ స్థానం తిరుమల - టిటిడి ఈఓ

Image
- తిరుమలలో భక్తులకు స్నేహపూర్వక వాతావరణం - మహారాష్ట్ర ఎంపి సంజయ్ జాదవ్ తిరుమల, త్రిశూల్ న్యూస్ : విశ్వంలోని హిందువులందరి దర్శనీయ స్థానంగా తిరుమల వర్ధిల్లుతోందని, శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టిటిడి ఇక్కడ స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తోందని మహారాష్ట్రలోని పర్బని ఎంపి సంజయ్ జాదవ్ పేర్కొన్నారు. ఆదివారం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఎంపీ మాట్లాడుతూ కొద్దిరోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన ఓ భక్తుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ప్రతిమను కారులో తీసుకొచ్చినందుకు అలిపిరి చెక్ పాయింట్ వద్ద టిటిడి సెక్యూరిటీ అవమానించారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారిందన్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన హిందువుల పుణ్యక్షేత్రం కావడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద ప్రతి వాహనాన్ని భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తారని చెప్పారు. రాజకీయ పార్టీలు, ఇతర మత విశ్వాసాల చిత్రాలు, గుర్తులు, వ్యక్తుల చిత్రాలు, జెండాలు తీసుకెళ్లరాదని టిటిడి నిబంధనలు ఉన్నాయన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా, మహారాష్ట్ర యాత్రికుడి వాహనాన్ని కూడా తనిఖీ చేశారని, శ్రీ శివాజీ మహరాజ్ ప్రతిమ అని నిర్ధారించుకున్న తర్వాత వాహనాన్ని తిరుమలకు

దేశావ్యాప్త నిరసనలకు సంసిద్ధమవుతున్న కాంగ్రెస్..!

Image
- ఆగస్టు 5న అధిక ధరలపై ఆందోళనలు న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ : దేశంలో ధరల పెరుగదల, నిరుద్యోగం, అగ్నిపథ్ స్కీం, జీఎస్టీ పెంపు వంటి అంశాలపై కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. వచ్చే నెల 5న దేశవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేసీ వేణుగోపాల్ రాష్ట్రాల నేతలకు దీనిపై ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఆర్థిక మాంద్యం వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పప్పులు, వంట నూనెలు, ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. దీనికి తోడు చేపలు, పెరుగు, గోధుమ పిండి, తేనె వంటి వివిధ ఉత్పత్తులపై జీఎస్టీ విధించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది. అగ్నిపథ్ స్కీం ద్వారా యువత ఆశలు చెదిరిపోయాయి'' అని వేణు గోపాల్ అభిప్రాయపడ్డారు. త్వరలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై పోరాటాన్ని తీవ్రతరం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా హౌజ్ లోపల, బటయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నామని ఆయన చెప్పారు. వచ్చే నెల 5న జరగనున్న కాంగ్రెస్ నిరసనల్లో కాంగ్రెస్ తరఫున చట్

మళ్ళీ మొదలైన రైతుల ఆందోళనలు..!

Image
- పంజాబ్ లో రైలు పట్టాలపై బైఠాయింపు - నాలుగు గంటలు రైళ్ళ రాకపోకలు బంద్  పంజాబ్, త్రిశూల్ న్యూస్ : గతేడాది చివరిలో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇంకా నెరవర్చలేదంటూ పంజాబ్ రైతులు మళ్లీ ఆందోళన చేశారు. లంఖిపూర్ ఖేరీ హింసా ఘటనపై, అలాగే వాగ్ధానాలు అమలుపై కేంద్రం తీరును నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దీనిని చేపట్టారు.ఇందులో భాగంగా పంజాబ్ లో అనేక చోట్ల రైతులు రైలు పట్టాలపై బైఠాయించారు. పంజాబ్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రైళ్లను నిలిపివేశామని భారతీయ కిసాన్ యూనియన్ (లఖోవాల్) ప్రధాన కార్యదర్శి హరీందర్ సింగ్ లఖోవాల్ తెలిపారు. నాలుగు గంటలపాటు సాగిన ఈ నిరసన వల్ల రాష్ట్రంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. జలంధర్, ఫిలింనగర్, ఫిరోజ్‌పూర్, భటిండా సహా పలు చోట్ల రైలు పట్టాలపై ఆందోళనకారులు బైఠాయించారు. రైతుల డిమాండ్లలో కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ. లఖింపూర్ ఖేరీ హింస కేసులో సత్వర న్యాయం ఉన్నాయని లఖోవాల్ అన్నారు. గతేడాది అక్టోబరు 3వ తేదీన ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య పర్యటనకు వ్యతిరేకంగా రైతులు లఖింపూర్‌ ఖ

ఆగస్టు 5, 6వ తేదీల్లో తరిగొండ వెంగమాంబ వర్ధంతి ఉత్సవాలు - టిటిడి

Image
తిరుపతి, త్రిశూల్ న్యూస్ : శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 205వ వర్ధంతి ఉత్సవాలు ఆగస్టు 5, 6వ తేదీల్లో తిరుమల, తిరుపతి, తరిగొండలో ఘనంగా జరుగనున్నాయి. వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఆగస్టు 5వ తేదీ సాయంత్రం 5.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఆగస్టు 6వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీలక్ష్మీనృసింహస్వామివారికి కల్యాణోత్సవం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆగస్టు 5వ తేదీన ఉదయం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు, ఉద‌యం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఆగస్టు 6వ తేదీ ఉదయం 9 గంటలకు ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద ఉన్న తరిగొండ వెంగమాంబ విగ్రహానికి టీటీడీ అధికారులు ప

ఆగస్టు 1, 2వ తేదీలలో టిటిడి జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశానికి స్పాట్ అడ్మిష‌న్లు..!

Image
తిరుప‌తి, త్రిశూల్ న్యూస్ : టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరం ప్ర‌వేశానికి ఆగస్టు 1, 2వ తేదీలలో ఉద‌యం 7 గంట‌ల‌కు ఆయా క‌ళాశాల‌ల్లో స్పాట్ అడ్మిష‌న్లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు టీటీడీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. టీటీడీలో విధులు నిర్వ‌హిస్తున్న రెగ్యుల‌ర్‌ ఉద్యోగుల పిల్లలు, బాలమందిర్ పిల్లలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పిల్ల‌లు, సీటు వచ్చి వివిధ కారణాలతో మూడు విడ‌త‌లలో కౌన్సెలింగ్‌కు హాజ‌రు కానివారు, తిరుప‌తిలోని స్థానిక విద్యార్థి, విద్యార్థునులకు ప్రాధాన్యత ఉంటుంది. ఆగస్టు 1న‌ 450 పైబడి మార్కులు వచ్చిన విద్యార్థులు, ఆగస్టు 2న 450 మార్కులు కంటే తక్కువ వచ్చిన విద్యార్థులు హాజరు కావచ్చు. ఆగస్టు 2వ తేదీన హాజరు అగు విద్యార్థులు 1వ తేదీ రాత్రి టీటీడీ వెబ్‌సైట్‌ నందు పొందుపరిచిన ఖాళీల వివరాలు చూసుకుని హాజరు కావలయును. క‌ళాశాల‌లో మార్కుల ప్రాతిపదికన ప్రాధాన్యత ప్రకారం సీట్లు కేటాయిస్తారు. హాస్టల్ వసతి స్పాట్ అడ్మిషనుల వారికి కేటాయించరు, కావున ఈ విష‌యాన్ని విద్యార్థులు గమనించగలరు. ఇదివ‌ర‌కే http://admissions‌

ప్రశాంతంగా గ్రూప్ 1V పరీక్షలు - జిల్లా కలెక్టర్

Image
చిత్తూరు, త్రిశూల్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించిన గ్రూప్ 1V పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ తెలిపారు. చిత్తూరు కేంద్రంగా 3900 మంది పరీక్ష రాయాల్సి ఉండగా వారి కోసం 11 కేంద్రాలను పట్టణంలోని వివిధ కళాశాలల్లో ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం మొత్తం 11 కేంద్రాలు ఏర్పాటు చేయగా 3900 మంది దరఖాస్తు చేసుకోగా 2265 మంది పరీక్షలను రాయడం జరిగింది. మరో 1635 మంది గైర్హాజరు అయ్యారు మొత్తం 58.07% మంది పరీక్షలకు హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ పట్టణంలోని విజయం జూనియర్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల, అపోలో మెడికల్ కాలేజీ, శ్రీ శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష నిర్వహణ విధానంను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ చేసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ పరీక్షలకు సంబంధించి జిల్లా రెవెన్యూ అధికారి ఎన్. రాజశేఖర్ తో పాటు ఇతర అధికారులను నియమించారు. కువైట్ నిబంధనలను అనుసరించి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి పరీక

ప్రొఫైల్‌ పిక్ గా త్రివర్ణ పతాకాన్ని ఉంచండి..!

Image
- ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ : భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్న వేళ నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ వేడుక ప్రజా ఉద్యమంగా అవతరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 2-15వ తేదీల మధ్య ప్రతిఒక్కరూ తమ సోషల్‌ మీడియా ఖాతాల ప్రొఫైల్‌ పిక్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని పిలుపునిచ్చారు. ప్రతినెలా నిర్వహించే రేడియో ప్రసంగం మన్‌ కీ బాత్‌లో ఈ మేరకు ఆయన ప్రజలను కోరారు. అలాగే, ఆగస్టు 13-15 మధ్య ఇంటింటా మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని ప్రధాని కోరారు. ఫలితంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవాల్లో ఏదో రూపంలో పాల్గొంటున్నారని ఆయన అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కర్ణాటకలో ‘అమృత భారతి కన్నడర్తి’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మోదీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 75 ప్రదేశాల్లో.. ఆయా ప్రాంతాలకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుల్ని స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించినట్లు వెల్లడించ

యాప్ రుణాల కట్టడికి పోలీసు నియామకాలు - డీజీపీ

Image
    అనంతపురం, త్రిశూల్ న్యూస్ : రాష్ట్రంలో త్వరలో పోలీసు నియామకాలు చేస్తామని డీజీపీ రాజేంద్రనాథరెడ్డి వెల్లడించారు. సుదీర్ఘ కాలంగా పోలీసు శాఖలో పెండింగ్ లో ఉన్న నియామకాల అంశాలపైన పలు సార్లు చర్చలు జరిగాయి. అయితే జాబ్ క్యాలెండర్ విడుదలలో భాగంగా పోలీసు శాఖలోనూ భర్తీ పైన ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించారు. కొత్త నియామకాల విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. తాజాగా.. యాప్ రుణాల వ్యవహారం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అనేక మంది ఈ ఉచ్చులో చిక్కుకొని ఆర్దికంగా నష్టపోతున్నారు. వేధింపులకు గురవుతున్నారు. దీని పైన డీజీపీ స్పందించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాల పర్యటనకు వచ్చిన డీజీపీ యాప్ రుణాలను కట్టడి చేయటానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు చెప్పారు. పోలీసులకు సైబర్ నేరాలను అడ్డుకునే శిక్షణ ఇస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. ఇక ప్రభుత్వం గతంలోనే పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవు ప్రకటించింది. కానీ వారాంతపు సెలవుల విషయంలో పదవీ విరమణలు ఎక్కువుగా ఉన్నందున పనిచేస్తున్న వారిపై కొంత పనిభారం ఉంటుందని డీజీపీ చెప్పుకొచ్చారు. రౌడీషీటర్ తెరిచే విషయమై కోర్టు ఆదేశాలను తప్పనిసరి

మారనున్న స్ర్పైట్​​ బాటిల్ రంగు..!

Image
- 60 ఏళ్ల తర్వాత గ్రీన్​ ను వదిలేస్తోంది న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ : ఇంట్లో ఉన్నా.. ఎక్కడైనా బయటికి వెళ్లినా కూల్ డ్రింక్స్ తాగడం చాలా మందికి అలవాటే. అందులోనూ మన ప్రాంతాల్లో అయితే థమ్సప్ లేదంటే స్ర్పైట్ అన్నట్టుగా ఉంటుంది డిమాండ్. పాన్ షాపులు మొదలుకుని భారీ మాల్స్ వరకు కూల్ డ్రింక్స్ ను వరుసగా పేర్చి పెట్టడం, వాటి వైపు చూడగానే ఏది ఏమిటనేది ఠక్కున గుర్తు పట్టడం కూడా మామూలే. కాస్త ఆకుపచ్చ రంగు బాటిల్ లో ఉండే స్ర్పైట్ ను చాలా ఈజీగా గుర్తుపట్టేస్తుంటాం. ఇప్పుడు అప్పుడు ఏకంగా 60 ఏళ్లుగా స్ర్పైట్ అదే ఆకుపచ్చ రంగు బాటిళ్లలో వస్తోంది మరి. ఇన్నేళ్లలో బాటిళ్ల ఆకారం మారినా.. స్ర్పైట్ ఉండే ఆకుపచ్చ రంగు మాత్రం మారలేదు. కానీ ఇప్పుడు ఆ ఆకుపచ్చ రంగుకు స్ర్పైట్ గుడ్ బై చెప్పేస్తోంది. స్ర్పైట్ బ్రాండ్ ను ప్రమోట్ చేసే కోకకోలా కంపెనీ ఈ మేరకు తాజాగా ప్రకటన చేసింది. ఇక ముందు స్ర్పైట్ బాటిల్ సాధారణ పారదర్శక ప్లాస్టిక్ బాటిళ్లలో రానుంది. అసలే నీళ్లలా ట్రాన్స్ పరెంట్ గా ఉండే ఈ కూల్ డ్రింక్ ఇప్పుడు చూడటానికి సోడా బాటిళ్లలా కనిపించనుంది. అయితే స్ర్పైట్ బాటిల్ రంగును తొలగించినా.. దాని లోగో, మూత మాత్

ఏనుగుల దాడిలో ఒకరు మృతి..!

Image
- మరోకరి పరిస్థితి విషమం  కుప్పం, త్రిశూల్ న్యూస్ : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలం ఓఎన్ కొత్తూరు గ్రామ పంచాయతి పరిధిలోని శ్రీనివాపురం అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఏనుగుల దాడిలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల కథనం మేరకు తమిళనాడు రాష్ట్రం ఏకలనత్తం గ్రామానికి చెందిన గోవిందప్ప (55) ఏనుగుల దాడిలో అక్కడిక్కడే మృతి చెందాడు. శ్రీనివాసపురం గ్రామానికి చెందిన నాగరాజుకు తీవ్రగ్రాయాలు కావడంతో 108 అంబులెన్సు ద్వారా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నాగరాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంఘటన స్థలానికి గుడుపల్లె ఎస్సై రామాంజనేయులు, పారెస్ట్ అధికారులు చేరుకొని విచారణ చేస్తున్నారు. 

శ్రీకాళహస్తీశ్వరుని సేవలో కర్ణాటక మంత్రి కె. సునీల్ కుమార్..!

Image
- స్వాగతం పలికిన కోలా ఆనంద్ శ్రీకాళహస్తి, త్రిశూల్ న్యూస్ : శ్రీకాళహస్తి ముక్కంటి సేవలో కర్ణాటక రాష్ట్ర ఇందన మరియు కన్నడ సాంస్కృతిక శాఖా మంత్రి కే. సునీల్ కుమార్ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. శనివారం శ్రీకాళహస్తి ఆలయానికి దర్శనార్థం వచ్చిన కర్ణాటక రాష్ట్ర మంత్రి సునీల్ కుమార్ కి బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి, నియోజకవర్గ బిజెపి పార్టీ ఇంచార్జి కోలా ఆనందకుమార్ ఆలయ అతిథి గృహం వద్ద నియోజకవర్గ బిజెపి నాయకులతో కలసి ఆత్మీయస్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు దక్షిణగోపురం వద్ద స్వాగతం పలికి, ప్రత్యేక రాహు-కేతు పూజా కార్యక్రమం నిర్వహించారు. తరువాత స్వామి, అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేసి వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు, స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్, బిజెపి నాయకులు వజ్రం కిషోర్, గాండ్ల శివకుమార్, యువమోర్చ సభ్యులు, చందు రాయల్, భరత్ నాయుడు రవిరాయల్, ఢిల్లీ, తదితరులు పాల్గొన్నారు.

పట్టణంలోని ప్రాంతాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి..!

Image
- డ్రై డే రోజు తప్పనిసరిగా ప్రతి ఇళ్లల్లో లార్వా పరిస్థితిని పరిశీలించాలి -  నిబంధనల మేరకు ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నదో లేదో పరిశీలించాలి - జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్  చిత్తూరు, త్రిశూల్ న్యూస్ : ప్రస్తుతం వర్షాకాలంలో ఉన్నందున ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చెత్త సేకరణ జరుగుతున్న తీరును పరిశీలిస్తూ డ్రైడే రోజున నిల్వలు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. కలెక్టర్ శనివారం సాయంత్రం చిత్తూరు పట్టణంలోని 6, 7 వార్డు సచివాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ని ఇళ్లు ఉన్నాయని ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ జరుగుతుందా లేదా అని ఉన్న వీధుల పొడవు తెలుసుకొని ఆ ప్రాంతాలలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నారా లేదా అని సాయంత్రం పూట వీధి కాలువలను శుభ్రం చేస్తున్నారా లేదా అని పరిశీలించాలని ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే పై వారికి తెలియజేసి అందుకు చేపట్టవలసిన చర్యల గురించి తెలుసుకొని వెంటనే ఆచరణలోకి తీసుకువస్తే ప్రజలను వ్యాధుల నుంచి బయటకి తీసుకురాగలమని కలెక్టర్ అన్నారు. ఏడవ డివిజన్లో 926, ఆరవ డివిజన్లో 768 ఇ

దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే..?

Image
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో               త్రిశూల్ న్యూస్ : 'దెయ్యాలు వేదాలు వల్లించినట్లు'.. 'నీతులు ఉన్నవి ఇంకొకరికి చెప్పడానికే.. కానీ, మనం పాటించడానికి కాదు' అన్నట్లు.. ఉంది వీరి వ్యవహారం. చెట్లను కొట్టేసి వాటి దుంగలను లారీలో వేసుకుని వెళ్తున్నారు కొందరు. ఆ లారీ వెనకాల మాత్రం 'మరిన్ని చెట్లను నాటండి' అని రాసుకు వచ్చారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వ అధికారి అవానిశ్ శరణ్ ఆ లారీ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 'వ్యంగ్యానికి నిర్వచనం ఇదే'నంటూ ఆయన చురకలంటించారు. అవానిశ్ శరణ్ సామాజిక మాధ్యమాల్లో చురుకుంటా ఉంటూ ఇటువంటి పోస్టులు తరుచూ చేస్తుంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఫొటో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ ఫొటోపై సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు. 'చెట్లను కొట్టేసి తీసుకెళ్తూ మరిన్ని చెట్టను నాటండి అని రాశారేంటీ? మేము నాటుతోంటే మీరు కొట్టుకెళ్తారా?' అని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. 'ఈ సీన్ సినిమాలోనూ పెట్టుకోవచ్చు' అంటూ ఒకరు కామెంట్ చేశారు. 'చెట్లను పెంచేది మీరు కొట్టేయడానికేనా?' అంటూ కొందరు నెటి

అమృత్ సరోవర్ పథకం పనులు శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడాలి..!

Image
- ఉపాధి కల్పనతో పాటు నీటి నిల్వ సామర్థ్యం కూడా ఎక్కువగా ఉండాలి - కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వతమైన పనులు చేపట్టాలని భావిస్తున్నాయి - జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ చిత్తూరు, త్రిశూల్ న్యూస్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకం కింద శాశ్వతముగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని భావించడం జరిగిందని ఇందులో భాగంగా అమృత్ సరోవర్ పథకం కింద పనులు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం బుడితి రెడ్డిపల్లి గ్రామ పరిధిలో చేపట్టిన చెరువు పనులను జిల్లా కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఇప్పటివరకు 70 మంది పనిచేయడం ద్వారా సుమారు 1700 క్యూబిక్ మీటర్ల మట్టి పని చేయడం ద్వారా ఈ అమృత్ సరోవర్ కార్యక్రమం కింద చెరువు నిర్మాణం చేయబడిందని కలెక్టర్ కు వివరించారు. ఇటువంటి కార్యక్రమాలను ఈ కార్యక్రమం ద్వారా చేపట్టడం ద్వారా ప్రజలకు ఉపయోగపడుతుందని, చుట్టుపక్కల బోర్లలో నీటిమట్టం పెరుగుదలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇటువంటి కార్యక్రమాన్ని ఎంపిక చేసినందుకు యాదమర్రి మండల ఇంజనీరింగ్ కన్సల్టెంట్ రమ్య, గ్రామ సర

కర్ణాటకలో వింత వివాహాలు..!

Image
- చనిపోయిన వారికి ప్రేత వివాహం మంగళూరు, త్రిశూల్ న్యూస్ : వాళ్లిద్దరూ ముప్పై ఏళ్ల క్రితం చనిపోయారు. ఈ మధ్యే పెళ్లి చేసుకుని హాయిగా గడుపుతున్నారు. ఏం మాట్లాడుతున్నారండీ?అంటారా. మీరు విన్నది నిజమే. 30 ఏళ్ల క్రితం చనిపోయిన వారికి ఇటీవలే వివాహం జరిగింది. కమ్మనైన విందు కూడా పెట్టారు. ఏంటీ కన్‌ఫ్యూజన్‌ అని తిట్టుకోకండి. ఇది నిజంగానే జరిగింది. దక్షిణ కన్నడలో ఇదో సంప్రదాయం. కంటెంట్ క్రియేటర్ యానీ అరుణ్ ట్విటర్‌లో ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌తోనే ఈ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో అప్పటి నుంచి వైరల్ అవుతోంది ఈ ట్వీట్. ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేశాడు. చాలా సేపటి వరకూ ఏంటిది అని బుర్ర బద్దలు కొట్టుకున్నారు నెటిజన్లు. యానీ అరుణ్ మాత్రం వరుస ట్వీట్‌లు చేశాడు. చాలా సేపటి తరవాత ఇది దక్షిణ కన్నడలో సంప్రదాయమని చెప్పాడు. "నేనో పెళ్లికి అటెండ్ అయ్యాను. నిజానికి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు 30 ఏళ్ల క్రితమే చనిపోయారు. ఇప్పుడు వాళ్లు వివాహం చేసుకుంటున్నారు. ఈ పెళ్లికే నేను వచ్చాను" అని ట్వీట్ చేశాడు. దక్షిణ కన్నడ సంప్రదాయం గురించి తెలియన వాళ్లకు ఇదేమీ

ప్రియుడితో తిరిగి వచ్చిన సాయి ప్రియాంక..!

Image
విశాఖపట్నం, త్రిశూల్ న్యూస్ :  విశాఖపట్నం బీచ్ లో భర్తకు మస్కాకొట్టి ప్రియుడితో  పారిపోయిన సాయి ప్రియాంక తిరిగి వైజాగ్ వచ్చింది. ప్రియుడ్ని రెండో పెళ్లి చేసుకొని బెంగళూరు వెళ్లిన సాయి ప్రియాంకను పోలీసులు తీసుకొచ్చారు. పోలీసులు, మీడియా హడావిడి మధ్య ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సాయిప్రియాంక చేసిన పనిపై మీడియా నిలదీసింది. ప్రభుత్వం కోటి రూపాయలు నష్టపోయిందని ప్రశ్నించగా.. అందుకు తమను క్షమించాలని రవి కోరాడు. అలాగే సాయి ప్రియాంకకు భర్త ఇచ్చిన రెండు గాజులు ఏం చేశారని ప్రశ్నించగా.. గాజులు తమ దగ్గరే ఉన్నాయని తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. తమకు తల్లిదండ్రుతో కలిసి ఉండలేమని.. ప్రియాంకను తానే పోషింస్తానని రవి సమాధానమిచ్చాడు. మరోవైపు ఇద్దర్నీ వైజాగ్ త్రీటౌన్ స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు వారిద్దరి వివరాలను నమోదు చేసుకున్నారు. ఇరువైపుల పెద్దలను పిలిపించి మాట్లాడారు. ఐతే వీళ్ల వల్ల తమ పరువు పోయిందని తీసుకెళ్లేది లేదని స్పష్టం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండే ప్రియాంక భర్త దీనిపై ఇంకా స్పందించలేదు. అటు సాయిప్రియాంక పేరెంట్స్ గానీ, రవి తల్లిదండ్రులు కూడా స్పందించలేదు. విశాఖపట్నంక

గృహ నిర్మాణాలకు లక్ష్యాలను నిర్దేశించుకొని సాధించాలి..!

Image
- జరుగుతున్న గృహనిర్మాణ పనులను వేగవంతం చేయండి  - లబ్ధిదారులకు రుణాలు, సిమెంట్ పంపిణీ, ఇసుక లభ్యం అయ్యేలా చూడాలి. - చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణన్  చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :  పలమనేరు నియోజకవర్గపరిధిలో మొత్తం 12131 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారని 45 శాతం పనులను పూర్తి చేసారని లక్ష్యాలను సాధించే దిశగా క్షేత్ర స్థాయి నుంచి ప్రణాళికలు రూపొందించి పనులు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.హరిణారాయణన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తో కలసి గృహనిర్మాణ శాఖ, ఎంపిడివోలుతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఇంకా ప్రారంభించని గృహానిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని ఇప్పటివరకు సిమెంట్ తీసుకొన్న వారు రుణాలు పొందిన వారు తప్పనిసరిగా ప్రారంభించేలా చూడాలన్నారు. అదేవిధంగా రుణాలు పొందిన వారు గృహానిర్మాణాలు ఏ స్థాయిలో చేసుకొంటున్నారో పరిశీలించి, నిర్మాణాలు చేసుకొంటున్నవారికి రుణాలు ఇప్పించాలన్నారు. వేగంగా నిర్మాణాలు చేసి పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా మండలాల వారీగా వివిధ స్థాయిలలో జరుగుతున్న నిర్మాణాలను అడిగారు. రూప్ లెవల్ ఆపై స్థాయికి చేరుకున్న నిర్మాణాలు పూర్త

ఎమ్మెల్యేకు తప్పని లోన్ రికవరీ ఏజెంట్లు ఆగడాలు..!

Image
- చెప్పుతో కొడుతానన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ నెల్లూరు, త్రిశూల్ న్యూస్ : ఈమధ్య లోన్ రికవరి ఏజెంట్ల అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయి. డబ్బులు తిరిగి కట్టకపోతే..ఆ వ్యక్తుల్ని లేదా ప్రత్యామ్నాయ ఫోన్ నంబర్లున్న వ్యక్తులకు ఫోన్లు చేసి రాబందుల్లా పీక్కు తింటున్నారు. లోన్ డబ్బులు కట్టాల్సిందేనంటూ రాచి రంపాన పెడుతున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ని సైతం వేధించారు. లోన్ తీసుకున్న వ్యక్తితో తనకెలాంటి సంబంధం లేదని, దయచేసి తనకు ఫోన్లు చేయొద్దని మర్యాదపూర్వకంగా మాట్లాడినా.. పదే పదే ఫోన్లు చేసి టార్చర్ పెట్టారు. తొలుత ఫుల్లర్‌టన్ బ్యాంక్ నుంచి ఓ మహిళా ఏజెంట్ ఫోన్ చేసి.. పాతపాటి అశోక్ కుమార్ అనే వ్యక్తి మీ ఫోన్ నంబర్‌ను ప్రత్యామ్నాయంగా ఇచ్చారని, ఆయన తీసుకున్న లోన్ మీరే కట్టాలని చెప్పింది. అతనెవరో తెలియదని, కావాలంటే కేసు పెట్టి ఆ వ్యక్తిని జైల్లో పెట్టుకోండని చెప్పారు. అప్పుడు మరో మహిళా రికవరి ఏజెంట్ ఫోన్ అందుకొని, బెదిరింపులకు దిగింది. తనకెవరో తెలియదని చెప్తున్నా.. ఆ అశోక్, మీరు కలిసి తిన్న రూ. 8 లక్షలు ఎవరు కడతారు? కట్టాల్సింది మీరేనంటూ దబాయించింది. దీం

పోషకాహార లోపం లేకుండా చూడాలి - చిత్తూరు జిల్లా కలెక్టర్

Image
- బాలికలలో రక్తహీనతను గుర్తించి తగిన పర్యవేక్షణ చేయాలి - క్షయవ్యాదిని రూపు మాపేందుకు నిరంతరం జాగ్రత్త వహించాలి  - ఐ డి డి ఎస్, ఆరోగ్యశాఖ వారు సహకరించుకోవాలి - జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్  చిత్తూరు, త్రిశూల్ న్యూస్ : కౌమార దశలో ఉన్న బాలలకు పోషకాహార లోపం, బాలికలలో రక్తహీనత, క్షయవ్యాధి నివారణకు నేరుగా చర్యలు తీసుకొని మరణాలను తగ్గించాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఐసిడిఎస్, వైద్య ఆరోగ్యశాఖలో అధికారులతో సమావేశం జరిపి వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోషకాహార లోపం వల్ల చిన్న పిల్లలు, గర్భవతులు, బాలింతలు ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారని ఐసిడిఎస్ మరియు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ఇటువంటి లోపం నివారించేలా చూడాలని అన్నారు. గర్భవతులలో రక్తహీనత ఉండటం వల్ల వారి పిల్లలు కూడా ఇబ్బందికరంగా ఉంటారని సాధారణంగా పేదలలో ఇటువంటి పరిస్థితి ఉందని ఈ పరిస్థితిని ఎదుర్కునేందుకు ఆశాలు, ఏఎన్ఎంలు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, ఐసిడిఎస్ సిబ్బంది, ఎంఎల్ హెచ్ పీలు సమన్వయంతో పనిచేసి వారికి సరైన ఆహారం అందించేలా చూడాలని అ

ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని సద్వినియోగం చేసుకోండి..!

Image
- కాపు నేస్తం ద్వారా 6565 మందికి రూ.9.86 కోట్లు లబ్ది      - జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్   చిత్తూరు, త్రిశూల్ న్యూస్  శుక్రవారం 3 వ విడత వై.ఎస్.ఆర్ కాపు నేస్తం క్రింద రాష్ట్ర వ్యాప్తంగా 3,38,792 మంది కాపు, తెలగ, ఒంటరి మరియు బలిజ సామాజిక కులమును చెందిన 45 నుండి 60 సం.ల వయసు మధ్య గల మహిళలకు రూ.508.18 కోట్లు లబ్దిని కాకినాడ జిల్లా గొల్లప్రోలు నుండి వర్చువల్ విధానంలో కంప్యూటర్ బటన్ నొక్కి ముఖ్యమంత్రివర్యులు లబ్దిదారుల ఖాతాలకు జమ చేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి కార్యక్రమం స్థానిక అంబేద్కర్ భవన్ లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం పేదలను పేదరికం నుండి బయటకు తీసుకుని వచ్చేందుకు వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేసేందుకు సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతున్నదని, నేడు జిల్లాలో 3వ విడత వై.ఎస్.ఆర్ కాపు నేస్తం పథకం క్రింద 6565 మంది లబ్ది పొందుతున్నారని, ఇలా ఈ పథకం తో పాటు మిగిలిన సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందుతున్న లబ్దిదారులు ఈ లబ్ధిని వారు ఆర్ధిక స్వావలంభన సాధించేందుకు అనుగుణంగా సద్వినియోగం చేసుకుని వృద్ధిలోకి రావాలన్

అన్ని డివిజనుల్లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు..!

Image
- నెల్లూరు కౌన్సిల్ సమావేశంలో మేయర్ స్రవంతి  నెల్లూరు, త్రిశూల్ న్యూస్ : నగరపాలక సంస్థ పరిధిలోని రూరల్, నగర నియోజకవర్గంలోని అన్ని డివిజనుల్లో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించనున్నామని కార్పొరేషన్ మేయర్ పొట్లూరి స్రవంతి పేర్కొన్నారు. నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని ఎ.పి.జె అబ్దుల్ కలాం కౌన్సిల్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. మేయర్ స్రవంతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొత్తం 51 తీర్మానాలను ప్రవేశపెట్టగా సభ్యులంతా వాటిని ఆమోదించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పన్నులు, యూజర్ చార్జీలు, మంచినీటి కుళాయిలు పన్నులకు సంభందించిన అంశాలపై ప్రత్యేక కమిటీల ద్వారా విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని సభ్యుల సమక్షంలో తీర్మానించారు. వివిధ డివిజనుల ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ వీధి కుక్కలు, కోతులు, దోమల సమస్యలను ప్రస్తావించారు. డివిజనుల్లో జరుగుతున్న పారిశుధ్య నిర్వహణను ముందస్తుగా స్థానిక కార్పొరేటర్ కు సమాచారం అందిస్తే పర్యవేక్షిస్తారని కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలకు నూతనంగా అర్హులైన లబ్ధిదారుల వివరాలను ముందుగా ప

మళ్ళీ మళ్ళీ మీరే అధికారంలోకి రావాలి..!

Image
- వైస్సార్ కాపు నేస్తం సమావేశంలో మహిళలు  కాకినాడ, త్రిశూల్ న్యూస్ : వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం మూడో విడత నిధులను జమ చేశారు సీఎం వైఎస్‌ జగన్‌. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌ కాపు నేస్తం నిధులను సీఎం జగన్‌ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి విడుదల చేశారు. ఫలితంగా అర్హులైన 3,38, 792 మందికి రూ. 508 కోట్ల ఆర్థికసాయం చేకూరనుంది. కాగా, వైఎస్సార్‌ కాపు నేస్తం కార్యక్రమంలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో లబ్ధిదారులు మాట్లాడుతూ.. సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమంపై ప్రశంసలు కురిపించారు. కాపుల్ని గుర్తించిన ఏకైక నాయకుడు సీఎం జగనే అంటూ వారు కొనియాడారు. మళ్లీ మళ్లీ మీరే అధికారంలోకి రావాలి 'నేను ప్రతీసారి కాపు నేస్తం అందుకున్నాను. ఇప్పుడు కూడా అందుకుంటున్నాను. మా భర్త ఆదాయం సరిపోక, టీ షాపు పెట్టుకున్నాను. దానికి వైఎస్సార్‌ కాపు నేస్తం మరింత ఆసరా అయ్యింది. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. అసలు మా కోసం చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయలేదు. మీరొచ్చాక కాపు నేస్త అనే పథకాన్ని పెట్టి ఎంతోమందిని ఆదుకున్నారు. ఏ ముఖ్యమంత్రి ఇలా చేయలేదు. మళ్లీ మళ్లీ

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం - సీఎం జగన్

Image
- వైస్సార్ కాపు నేస్తం నిధులు లబ్ధిదారులు ఖాతాల్లో జమ కాకినాడ, త్రిశూల్ న్యూస్ : కాపులతో పాటు ప్రతీ సామాజికవర్గ సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం తమదని, మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్సార్‌ కాపు నేస్తం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మూడు లక్షల మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇవాళ నేరుగా డబ్బు జమ చేయడం దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నా అని ఆయన అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగిన వైఎస్సార్‌ కాపు నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ''మనది అక్కచెల్లెమ్మల ప్రభుత్వం. మనది రైతు ప్రభుత్వం. మనది పేదలకు మంచి చేసే ప్రభుత్వం. మనది.. అన్నివర్గాల ప్రభుత్వం.. మనసున్న ప్రభుత్వం అని సగర్వంగా ప్రకటించుకున్నా'' అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ప్రస్తావించకపోయినా వైఎస్సార్‌ కాపు నేస్తం అందిస్తున్నామని, అన్ని వర్గాల జీవన ప్రమాణాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్‌ ఉద్ఘాటించారు. వరుసగా మూడో ఏడాది కాపు అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నాం. వరుసగా ఈ ఏడాది కూడా రూ.1

వైసిపి ఫ్యాన్ ఆపితే తప్ప ప్రజల కష్టాలు తీరవు - చంద్రబాబు

Image
- ప్రత్యేక పోలవరం జిల్లా చేస్తాం - వరద ప్రభావిత ప్రాంతాల్లో బాబు పర్యటన ఎటపాక, త్రిశూల్ న్యూస్ : ఎన్నికలకు ముందు 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్ర మెడలు వంచుతానన్న ముఖ్యమంత్రి జగన్, ఇప్పుడు తన మెడలు తానే దించుకున్నాడని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. పోలవరం నిర్మాణం కోసం కేంద్రానికి లేఖలు రాస్తూనే ఉంటాను.. మీరు నాకు ఓట్లు వేస్తూనే ఉండండి అన్న చందంగా జగన్ వ్యవహరిస్తున్నారని అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. అక్కడ రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. వైఎస్ఆర్ సీపీకి ఉన్న 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం డబ్బులు ఇస్తుందని చెప్పారు. పోలవరం పూర్తి చేయడానికి ఒక వ్యూహంగానీ, ముందు చూపు గానీ లేదని, డబ్బులు ఖర్చు పెట్టడం లేదని అలాంటి ధగాకోరు ప్రభుత్వానికి మేం ఏం చేయలేమని పార్లమెంటులో సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. చేతకాకపోతే ముఖ్యమంత్రితో సహా అందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత తనపైనే వేసుకుంటానని అన్నారు. అల్లూరి జిల్లా ముఖ్య కేంద్రం ఇక్కడి నుంచి 400 కిలో మీటర్లు ఉంద

రామయ్య సన్నిధిలో చంద్రబాబు..!

Image
- 19 ఏళ్ల తరువాత స్వామిని దర్శనం చేసుకున్న బాబు  భద్రాద్రి కొత్తగూడెం: తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. పర్యటన లో భాగంగా భద్రాద్రి శ్రీ సీతారాముల స్వామి వారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆలయ అర్చకులు, ఆలయ ఈఓ శివాజీ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దాదాపు 19 సంవత్సరాల తర్వాత టీడీపీ అధినేత ఈరోజు భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయంలోని శ్రీలక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండతులతో చంద్రబాబు వేదాశీర్వచనం పొందారు. అనంతరం స్వామివారి జ్ఞాపిక, స్వామి వారి లడ్డు ప్రసాదాలను చంద్రబాబుకు ఆలయ ఈఓ అందజేశారు. భద్రాద్రి సీతారామయ్య దర్శనం అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భద్రాచలం కరకట్టను పరిశీలించారు. చంద్రబాబు మాట్లాడుతూ... 20ఏళ్ల క్రితం కట్టిన కరకట్టను ప్రజలు ఈనాటికీ గుర్తుపెట్టుకోవటం సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ హయాంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ సమస్యను స్వయంగా పరిశీలించానని చెప్పుకొచ్చారు. చేసిన అభివృద్ధి స