Posts

Showing posts from August, 2022

నేడు కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన..!

Image
అమరావతి, త్రిశూల్ న్యూస్ : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు కడప జిల్లాకు వెళ్ళానున్నారు.  జగన్ మోహన్ రెడ్డి పర్యటన వివరాలు.. ► మధ్యాహ్నం 2.00 గంటలకు ముఖ్యమంత్రి తన నివాసం నుంచి బయలుదేరి 2.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.   ► అక్కడి నుంచి విమానంలో 2.30 గంటలకు బయలుదేరి 3.20 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.   ► 3.30 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 3.50 గంటలకు వేముల మండలంలోని వేల్పుల గ్రామానికి చేరుకుంటారు.   ► అక్కడ 3.50 నుంచి 4.05 గంటల వరకు స్థానిక నాయకులతో మాట్లాడతారు. . ► 4.10 నుంచి 5.10 గంటల వరకు వేల్పులలోని సచివాలయ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. ► అనంతరం అక్కడి నుంచి 5.35 గంటలకు హెలికాఫ్టర్‌లో వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

పేదల అన్నా క్యాంటిన్ ను కూల్చివేయడం దుర్మార్గపు చర్య..!

Image
- కుటిల రాజకీయాలు ఎల్లవేళలా పనిచేయదు - పేదల కడుపు కొట్టి మీరు సాధించిదేమిటి? - కుప్పంలో టిడిపి నేతలు ఆందోళనలో ఇంచార్జి మునిరత్నం  కుప్పం, త్రిశూల్ న్యూస్ : పేదల ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత, స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గత 86 రోజులగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటిన్ పై వైసిపి నేతలు చేస్తున్న కవ్వింపు చర్యలు తగవని కుప్పం టిడిపి నియోజకవర్గం ఇంచార్జి పిఎస్. మునిరత్నం హితువు పలికారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టిడిపి ఏర్పాటు చేసిన తాత్కాలిక అన్నా క్యాంటిన్ టెంట్ ను కూల్చివేయడంపై టిడిపి శ్రేణులు బగ్గుమన్నారు. ఇందుకు నిరసనగా టిడిపి శ్రేణులు కుప్పం ఆర్టీసీ కూడలిలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ.. కుప్పంలో టీడీపీ నేతల పెట్టిన అన్నా క్యాంటీన్ తాత్కాలిక షెడ్డును వైసీపీ నేతలే ధ్వంసం చేశారని... పేదలకు అన్నం పెడితే తప్పా అని ప్రశ్నించారు. ఎంతో మంది వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే గ్రామీణలకు మధ్యాహ్నం భోజనం పెట్టడం కూడా తప్పుగా భావించే వైసిపి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయాని హెచ్చరించారు.  మంగళవారం కుప్పంలోన...

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్..!

Image
విజయవాడ, త్రిశూల్ న్యూస్ : వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేసారు. తమ ప్రయత్నాలలో అడ్డంకులు తొలిగి, చేపట్టిన పనులు విజయవంతం కావాలని భక్తులు విఘ్నేశ్వరునికి ప్రార్థిస్తారన్నారు. ఈ ముఖ్యమైన హిందూ పండుగను కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంతో భక్తి, సంతోషంతో జరుపుకుంటారన్నారు. ఈ శుభదినాన ప్రజలు తమ వ్యాపారాలు విజయవంతం కావడానికి గణేశుడికి ప్రత్యేకంగా ప్రార్థనలు చేయడం ఆచారంగా ఉందని గవర్నర్ ప్రస్తుతించారు. రాష్ట్ర ప్రజలు అందరికీ శాంతి, సామరస్యాలతో కూడిన జీవితాన్ని గడపడానికి విఘ్నేశ్వరుడు దీవెనలు ప్రసాదించాలని తాను ప్రార్థిస్తున్నానని ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.

రాబోయేది టిడిపి ప్రభుత్వమే.. పోలీసులను వదిలిపెట్టేదిలే - నారా లోకేష్

Image
- చిత్తూరు సబ్ జైలులో ఉన్న టిడిపి నేతలు, కార్యకర్తల పరామర్శ చిత్తూరు, త్రిశూల్ న్యూస్ : ఏపీలో రాబోయేది తెదేపా ప్రభుత్వమేనని.. చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పోలీసులను వదిలిపెట్టేది లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హెచ్చరించారు. ఇటీవల కుప్పంలో వైకాపా నేతలు పెట్టిన కేసులతో అరెస్టయి చిత్తూరు సబ్‌ జైలులో ఉన్న తెదేపా నేతలను ములాఖత్‌ ద్వారా పరామర్శించారు. మంగళవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న లోకేష్ కు టిడిపి నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా చిత్తూరుకు చేరుకొని ఇటీవల కుప్పంలో వైకాపా నేతలు పెట్టిన కేసులతో అరెస్టయి చిత్తూరు సబ్‌ జైలులో ఉన్న తెదేపా నేతలను పరామర్శించి అధైర్య పడొద్దని దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. పోలీసులు వైకాపాకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక అన్నా క్యాంటీన్లు మూసేశారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 2010 అన్నా క్యాంటీన్లు మూసివేశారని.. తల్లి, సోదరికి ముద్ద పెట్టని వ్యక్తి ప్రజలకు ఏవిధంగా పెడతారని ప్రశ్నించారు. పేదలకు భోజనం లేకుండా చేసిన వ్యక్తి జ...

కుప్పంలో మరో సారి అన్నా క్యాంటిన్ ధ్వంసం..!

Image
- వైసిపి నేతల పనేనంటూ టిడిపి ఆరోపణ కుప్పం, త్రిశూల్ న్యూస్ : కుప్పంలో అర్ధరాత్రి అన్న క్యాంటీన్​ను కూల్చివేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా 86 రోజులుగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ను నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కూల్చివేసిన ఘటన కలకలం రేపింది. ఇటీవల కుప్పం పట్టణంలోని పాత పంచాయతీ బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఎదుట... మూడు నెలలుగా అన్న క్యాంటీన్​ను నిర్వహిస్తున్నారు. ఈనెల 25న తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన సందర్బంగా వైకాపా శ్రేణులు నిరసన చేపట్టి... అన్న క్యాంటీన్ పందిరి, తెదేపా బ్యానర్లు ధ్వంసం చేశారు. తాజాగా మరోసారి సోమవారం అర్ధరాత్రి అన్న క్యాంటీన్ పందిరి, తెదేపా ఫ్లెక్సీలు పట్టణంలో పలు చోట్ల బ్యానర్లు ధ్వంసం చేశారు. అన్న క్యాంటీన్ వద్ద ధ్వంసం చేసిన సామగ్రిని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అధికార పార్టీ శ్రేణులే ఈ చర్యకు పాల్పడి ఉంటారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా వైకాపా-తెదేపా వర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. వైకాపా శ్రేణులు పట్టణంలో ర్యాలీ నిర్వహించిన సందర్భంలో అన్న క్యాంటీన్‌ను ధ్వ...

వామ్మో పులి.. భయం గుపింట్లో కుప్పం ప్రజలు..!

Image
- పట్టణంలోని సోమేశ్వర స్వామి ఆలయం వద్దె పులి  కుప్పం, త్రిశూల్ న్యూస్ : కికారణ్యంలో ఉండాల్సిన మృగాలు జన సంచారంలోకి వచ్చి హల్ చేస్తున్న ఘటనలు ఈ ఎక్కడో ఓ చోట వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కుప్పం పట్టణంలోని సోమేశ్వర ఆలయ వద్ద ఓ పులి హల్ చేసింది. సుమారు రాత్రి 12గంటల సమయంలో ఆలయ పూజారి నిద్రకు ఉపక్రమించే క్రమంలో ఆలయ ప్రహరీ గోడ వద్ద ఉన్న పులిని చూసి పూజారి కేకలు వేశారు. కేకలకు బయపడిన పులి అక్కడి నుంచి పరారయ్యింది.  అయితే ఆలయ ప్రహరీ గోడను పులి పంజాతో గోకిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించడంతో మంగళవారం ఉదయం అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఆలయం వద్దకు చేరుకున్న అధికారులు పులి జాడ కోసం అన్వేషస్తున్నారు. పులి సంచారం విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు భయందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా పులి జాడను కనిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

బాలయ్యకు షాక్.. నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు..!

Image
హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ : సినీ నటుడు.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తాజాగా నోటీసులు జారీ చేసింది. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు సంబంధించి ఈ నోటీసులు జారీ అయ్యాయి. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు సంబంధించి ఈ నోటీసులు జారీ అయ్యాయి. సినిమా రిలీజ్ సమయంలో పన్ను రాయితీ తీసుకుని.. టికెట్ రేట్లు ఎందుకు తగ్గించలేదని.. అలాగే పన్ను రాయితీ ప్రయోజనాలను సినీ ప్రేక్షకులకు బదలాయించలేదని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను స్వీకరించిన సుప్రీం కోర్టు.. బాలకృష్ణతో సహా అప్పటి తెలంగాణ, ఏపీ ప్రభుత్వం సహా ప్రతివాదులకు నోటిసులు పంపించింది. ఏపీ విషయానికి వస్తే.. చంద్రబాబు హయాంలో ఇలా సినిమాలకి పన్ను రాయితీలు ఇచ్చారని.. కానీ వారు మాత్రం ఆ రాయితీలను జనాలకి బదలాయించకుండా వాళ్ళ దగ్గర దోచుకున్నారని.. అందుకే సినీ ఇండస్ట్రీ బాబుకి వత్తాసు పలుకుతోందన్నది పిటిషనర్ ఆరోపణ.. ఇటీవలే అఖండతో భారీ బ్లాక్ బస్టర్ ను తన ఖతాలో వేసుకున్న బాలయ్యకు.. అంతకుముందు సరైన హిట్ ఏదైనా ఉంది అంటే అది గౌతమీపుత్ర శాతకర్ణి సినిమానే.. ఆయన కెరీర్ లో ఉన్న బ్లాక్ బస్టర్ హిట్స్ లో గౌతమీ పుత్ర శాతకర్ణ...

తెలుగును కాపాడుకునేందుకు పెద్ద ఉద్యమం చేయాలి - చంద్రబాబు

Image
అమరావతి, త్రిశూల్ న్యూస్ : గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న మనం... ఇప్పుడు తెలుగును కాపాడుకునేందుకు ఇంకా పెద్ద ఉద్యమం చేయాలని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ స్కూళ్లలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి తెలుగు మీడియం మాయమవుతుందని వింటుంటే బాధగా ఉందన్నారు. ఒక రాష్ట్రం నుంచి ఇలా పూర్తిగా మాతృభాష బోధనా భాషగా మాయం కావడమనేది దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. దేశంలో భాషా ప్రాతిపదికగా ఏర్పడిన తొలి రాష్ట్రంలో ఇలా జరగడం ఇంకా దురదృష్టకరమన్నారు. తెలుగు అకాడమీని తెలుగు, సంస్కృత అకాడమీగా పేరు మార్చాక రూ.63 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయన్న వార్త తప్ప... ఆ సంస్థ తెలుగు భాష కోసం ఏం చేస్తుందనేది ఎవరికీ తెలియదని చంద్రబాబు అన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తూ... తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని కాపాడుకునేందుకు మనందరం పునరంకితమవుదామని పిలుపుపిచ్చారు. ఒక జాతి పురోగమన మార్గాన్ని ముందుండి నడిపించేది తల్లి భాషని అన్నారు. తెలుగును వాడుకభాషగా సామాన్యులకు చేరువ చేసేందుకు ఆనాడు గిడుగు రా...

చిత్తూరు ఉమ్మడి జిల్లాకు రానున్న నారా లోకేష్..!

Image
- పార్టీ నేతలను, కార్యకర్తలను పరామర్శించునున్న లోకేష్ తిరుపతి, త్రిశూల్ న్యూస్ : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు ఒక్క రోజు పర్యటన నిమిత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు రానున్నారు. ఇటీవల వైసిపి అక్రమంగా పెట్టిన కేసుల్లో రిమాండులో ఉన్న టిడిపి నాయకులను, కార్యకర్తలను పరామర్శించునున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2.00 గంటకు రేణిగుంట విమానాశ్రయమునకు చేరుకొంటారు. అక్కడనుండి రోడ్డు మార్గంలో తిరుపతి - చంద్రగిరి బైపాస్ , నేండ్రగుంట , పూతలపట్టు మీదుగా చిత్తూరు జిల్లా కేంద్రంలోని గిరింపేట నందు గల జిల్లా కారాగారం (సబ్ జైలు)వద్దకు చేరుకుంటారు. అక్కడ మొన్న చంద్రబాబు పర్యటనలో చోటు చేసుకున్న ఘటనలో రిమాండులో ఉన్న మాజీ జిల్లా ఎమ్మెల్సి గౌనివారి శ్రీనివాసులను, కుప్పం నాయకులును మరియు పూతలలపట్టు నియోజకవర్గ కార్యకర్తలను కలిసి పరామర్శించి వారితో మాట్లాడుతారు. అనంతరం అక్కడనుండి బయలుదేరి చంద్రగిరి మండలం చేరుకొని ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన చంద్రగిరి మండల తెలుగు యువత అధ్యక్షులు భాను ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులను మరియు చిత్తూరు పార్లమెంట్ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి గంగనపల్లి...

ఏపీ, తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు..!

Image
అమరావతి, హైదరాబాద్ త్రి శూల్ న్యూస్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కర్ణాటక నుంచి కొమోరిస్ ప్రాంతం వరకు, దక్షిణ కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా ఉన్న సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. వీటి ఫలితంగా ఏపీ, తెలంగాణ, యానాంలో ఆగస్టు 31 వరకు వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ కేంద్రం. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు.. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ ప్రాంతాల్లో నేటి నుంచి మరో మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షం పడుతుంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా.. దక్షిణ కోస్తాంధ్ర, రాయల...

అమ్మా.. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా..!

Image
- ప్రజలతో మమేకమవుతూ సంక్షేమ పథకాలపై ఆరా  - సమస్యల పరిష్కారంపై సత్వర చర్యలకు ఆదేశం - గడపగడపకు మన ప్రభుత్వం చేపట్టిన ఎమ్మెల్యే చెవిరెడ్డి చంద్రగిరి, త్రిశూల్ న్యూస్ : "అమ్మా.. ప్రభుత్వ పథకాలు అన్నీ బాగూన్నాయా.. ? అన్నీ మీకు అందుతున్నాయా.. ? ఎక్కడైనా లోటు పాట్లు ఉంటే నా దృష్టికి తీసుకుని రండి.. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో రాజకీయ పార్టీలు కుల, మత, వర్గాలకు అతీతంగా అందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నా." అంటూ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. ఆదివారం పాకాల మండలం బందార్లపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు మహిళలు హారతులు పట్టి గ్రామంలోకి స్వాగతించారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి లబ్ది దారులు పొందిన సంక్షేమ పథకాల వివరాలను  తెలియపరుస్తూ ప్రత్యేకంగా ముద్రించిన బుక్ లెట్ ను అందించారు.  అభివృద్ధి పనులకు రూ.52 లక్షలు మంజూరు..! గ్రామంలో అంతర్గతంగా సిమెంట్ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణంకు సుమారు రూ...

రాబోయే ఎన్నికల్లో బిజెపితో తెలుగుదేశం దోస్తీ..?

Image
- మూడేళ్ళ తరువాత మోడితో బాబు బంధం - జూ. ఎన్టీఆర్ అమిత్ షా కలవడంతో వేడెక్కిన రాజకీయం హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ : ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలపై పూర్తి ఫోకస్ చేస్తోంది భారతీయ జనతా పార్టీ.. పార్టీ పెద్దలు పదే పదే తెలంగాణకు వస్తున్నారు.. ప్రముఖులను కలుస్తున్నారు. మొన్న అమిత్ షా వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ను కలిస్తే.. ఇప్పుడు నితిన్ వంతు వచ్చింది. ఆయన నడ్డాతో సమావేశం అవ్వడం చూస్తుంటే.. తెలంగాణలో గెలుపు కోసం బీజేపీ ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తోందని చెప్పొచ్చు. మరోవైపు వరుస పరిణామాలు చూస్తుంటే.. త్వరలోనే కీలక అడుగులు పడితాయనే సంకేతాలు అందుతున్నాయి. ఈ ప్రభావం ఏపీ రాజకీయాలపైనా పడుతుందని ప్రచారం ఉంది. ప్రస్తుతం మునుగోడు ఎన్నికలను.. తెలంగాణలో వచ్చే ఎన్నికలకు సెమీ ఫైనల్ గా బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి నుంచి కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్, రామోజీరావుతో జరిపిన భేటీలు నిదర్శనం. ఈ ఇద్దరితో మర్యాదపూర్వక భేటీ అని బీజేపీ నేతలు చెబుతున్నా.. రాజకీయ ప్రాధాన్యం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో తాజాగా చంద్రబాబుకు ఎన్...

కుప్పం చంద్రబాబు గడ్డ కాదు వైసిపి అడ్డా - మంత్రి జోగి రమేష్

Image
- చంద్రబాబు రాష్ట్రంలో తిరగడానికి వీళ్లేదు! - కేఏ పాల్ , పవన్ కు తేడాలేదు - విలేకరుల సమావేశంలో గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ విజయవాడ, త్రిశూల్ న్యూస్ : టీడీపీ మీద ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అనడానికి కుప్పం సంఘటనలే నిదర్శనమని ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ జెండాను, పార్టీని కూకటి వేళ్లతో పెకిలించడానికి ప్రజలు సిద్ధమయ్యారన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసినా చంద్రబాబు ఒక వర్గానికి అయినా మేలు చేశారా? అని ప్రశ్నించారు. 33 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఏంచేశారని అని కుప్పం ప్రజలు తిరుగుబాటు చేశారన్నారు. ఆ తిరుగుబాటు కుప్పంలో బీసీల నుంచే ప్రారంభం అయిందని మంత్రి తెలిపారు. చంద్రబాబు వాడుకుని వదిలేశారని బీసీలు, మైనారిటీ, ఎస్సీ ఎస్టీలు, మహిళలు అందరూ తిరుగుబాటు చేశారన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో తిరగడానికి వీళ్లేదు! మూడేళ్లలో సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ప్రజలే చెప్తున్నారని మంత్రి జోగి అన్నారు. కుప...

ఏపీ పోలీసుకు గుబులు పుట్టిస్తోన్న సెప్టెంబర్ ఒకటో తేది..!

Image
- ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాలు  - ఇప్పటికే పలువురి ఉద్యోగులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు విజయవాడ, త్రిశూల్ న్యూస్ : సాధారణంగా ఒకటో తేదీ అంటే వేతనాలు, జీతాల కోసం ఉద్యోగులు వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. కానీ విజయవాడ పోలీసులకు మాత్రం సెప్టెంబరు 1వ తేదీ అంటే టెన్షన్‌ మొదలైంది. సీపీఎస్‌ రద్దు కోసం ఉద్యోగ సంఘాలు 1న తాడేపల్లిలోని సీఎం ఇంటి ముట్టడి, విజయవాడలో ప్రదర్శన, సభ నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. దీంతో వారిని కట్టడి చేసే యత్నాల్లో పోలీసులు తలమునకలై ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 3న విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు ‘చలో విజయవాడ’ నిర్వహించారు. పోలీసులు అనుమతి నిరాకరించినా, ఎన్ని ఆంక్షలున్నా వివిధ జిల్లాల నుంచి విజయవాడకు ఉద్యోగులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ముందుగానే వచ్చి నగరంలో బంధువులు, స్నేహితుల ఇళ్లలో దిగారు. పోలీసులు బస్సులు, రైళ్లు, హోటళ్లనే తనిఖీ చేశారు. వారు ఊహించని రీతిలో బీఆర్టీఎస్‌ రోడ్డులోకి వేలసంఖ్యలో చేరారు. పోలీసులు నియంత్రించలేని పరిస్థితి ఎదురైంది. ఈసారి మాత్రం విజయవాడ నగరం మొత్తాన్ని పోలీసులు జల్ల...

ఉద్యోగుల చలో విజయవాడకు అనుమతి లేదు - సీపీ

Image
విజయవాడ, త్రిశూల్ న్యూస్ : విజయవాడలో సెప్టెంబర్ ఒకటవ తేదీన ఉద్యోగులు సీపీఎస్ రద్దుకై ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని ప్రకటించారు నగర పోలీస్ కమిషనర్. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. నగరంలో శాంతి భధ్రతలకు విఘాతం కలుగుతుందని.. కొంతమంది అసాంఘిక శక్తులు విజయవాడ పరిసర ప్రాంతాలలో రెక్కి నిర్వహించి శాంతి భధ్రతలకు విఘాతం కల్గించే విధంగా ప్రయత్నిస్తున్నారని అప్రమత్తమైంది పోలీస్ యంత్రాంగం. ప్రభుత్వ ,రైల్వే ఆస్తులపై చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం వుందంటున్నారు పోలీసులు. నగరంలో సెక్షన్ 144 సిఆర్.పి.సి. మరియు పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో వుంటాయన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే పిడి యాక్ట్ లు పెడతాం అని హెచ్చరించారు పోలీస్ కమిషనర్. మరోవైపు మంత్రి బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. మిలియన్ మార్చ్ సంగతి నాకు తెలియదు…ఉద్యోగ సంఘాలు వారి సమస్యల పై పోరాటం చేసే హక్కు వారికుందన్నారు. గత ఉద్యమాల్లో అరెస్ట్ అయ్యి ఉంటే అలాంటి ఉద్యోగులకు నోటీ...

బంగ్లా సరిహద్దులో మహిళపై బీఎస్ఎఫ్ సిబ్బంది హత్యాచారం..!

Image
- సిబ్బందిని అరెస్టు చేసిన పారామిలటరీ ఆర్గనైజేషన్ కోల్‌కతా, త్రిశూల్ న్యూస్ : బంగ్లాదేశ్ సరిహద్దుల సమీపంలో ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు సరిహద్దు భద్రతా దళ సిబ్బందిని అరెస్టు చేసినట్టు పారామిలటరీ ఆర్గనైజేషన్ సీనియర్ అధికారి ఒకరు శనివారంనాడు తెలిపారు. అరెస్టు అయిన వారిలో బీఎస్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరుగగా, నిందితులిద్దరినీ తదుపరి చట్టపరమైన చర్యల కోసం పశ్చిమబెంగాల్ పోలీసులకు అప్పగించారు. నిందితులను సస్పెండ్ చేసి, కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీకి ఆదేశించినట్టు బీఎస్ఎఫ్ సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ అధికారి ఒకరు తెలిపారు. పశ్చిమబెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలోని బగ్డా బోర్డర్ ఔట్ పోస్ట్ వచ్చిన ఈనెల 26న ఈ ఘటన జరిగినట్టు చెప్పారు. ''ఇండియా నుంచి బంగ్లాదేశ్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఒక మహిళను బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. ఆ వెంటనే సమీపంలోని పొలాల వైపు లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఇందుకు ఏఎస్ఐ సహకరించాడు'' అని ఆ అధికారి వివరించారు. సదరు మహిళ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ట...

వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం..!

Image
- అలిపిరి పాదాలమండపం వద్ద ఘనంగా మెట్లపూజ తిరుపతి, త్రిశూల్ న్యూస్ : టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శ‌నివారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు ముందుగా మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా పి.ఆర్‌. ఆనంద‌తీర్థాచార్యులు మాట్లాడుతూ బ్ర‌హ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. పూర్వం శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తి ప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.

కుప్పంలో తెదేపా నేతలు అరెస్ట్.. 14 రోజులు రిమాండ్..!

Image
కుప్పం, త్రిశూల్ న్యూస్ : మూడురోజులుగా కుప్పం రాజకీయాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. చంద్రబాబుని అడ్డుకోవడంతో మెుదలై, తెదేపా నాయకులపై దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అన్నా క్యాంటీన్ ధ్వంసం అనంతరం చంద్రబాబు పాదయాత్ర, తర్వాతి పరిణామాలు అన్ని తెదేపా కార్యకర్తలు, నాయకులపై పోలీసు కేసులు ప్రారంభమయ్యాయి. కుప్పంలో మళ్ళీ ప్రాంతంలో ఘర్షణలు చలరేగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో అన్నా క్యాంటీన్ ధ్వంసం సంఘటనకు సంబంధించి తెదేపా అధినేత చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు. ఆ సందర్బంగా జరిగిన లాఠీచార్జీ తదితర సంఘటనల్లో మరో మూడు కేసులు నమోదయ్యాయి. కుప్పం నియోజకవర్గంలో తెదేపా నేతల అరెస్టుల పర్వం మెుదలైంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటనలో చోటు చేసుకున్న ఘటనలపై పోలీసులు పలు కేసులు నమోదుచేసి అరెస్ట్​లు చేసి కోర్టులో హాజరు పరిచారు. రామకుప్పం మండలం కల్లుపల్లిలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య జరిగిన రాళ్ల దాడి ఘటనలో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి మాజీ శాసనమండలి సభ్యుడు గౌనిగాని శ్రీనివాసులతో పాటు పలువురు మాజీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్య...

కుప్పంలో చంద్రబాబు చేసిన అభివృద్థి శూన్యం - మంత్రి పెద్దిరెడ్డి

Image
- వైసీపీ కార్యకర్తలపై దాడి టీడీపీ నేతల పనే - కుప్పంలో 7వేల ఇళ్లను నిర్మించి ఇచ్చాం - చిత్తూరులో అన్ని స్థానాలు గెలుస్తాం - విలేకరుల సమావేశంలో మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి  తిరుపతి, త్రిశూల్ న్యూస్ : చంద్రబాబు ఎమ్మెల్యేగా కుప్పం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం చంద్రబాబుకు తెలియదా అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. మూడేళ్ళలో కుప్పంకు కేవలం 6 సార్లు మాత్రమే చంద్రబాబు వచ్చారని పేర్కొన్న పెద్దిరెడ్డి.. 30 సంవత్సరాల్లో కుప్పంలో చంద్రబాబు చేసిన అభివృద్థిని శూన్యం అన్నారు. కుప్పంలో పెండింగ్ లో ఉన్న తాగు - సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. కుప్పంలో చంద్రబాబు పేదల కోసం కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేదని విమర్శించారు. చంద్రబాబు కుప్పం పర్యటనపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ కార్యకర్తలపై దాడి టీడీపీ నేతల పనే.. ! టీడీపీ అధినేత సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలు చంద్రబాబును నమ్మడం లేదన్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో వైసీపీ...

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నేడు లలిత్ ప్రమాణ స్వీకారం..!

Image
న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ పదవీ విరమణ చేశారు. ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా లలిత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జస్టిస్ యు. యు. లలిత్ 1957 నవంబరు 9న జన్మించారు. 1983 జూన్ లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. మూడు తరాలుగా యు. యు. లలిత్ కుటుంబం న్యాయవాద వృత్తిలో ఉంది. గతంలో పలు కీలక కేసుల్లో జస్టిస్ లలిత్ భాగస్వామిగా ఉన్నారు. భారత్ కొత్త ప్రధాన న్యాయమూర్తిగా యు.యు. లలిత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రముఖమైన కేసులు ఆయన ముందుకు రానున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు, రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చే రహస్య ఎన్నికల బాండ్లు, మతం ప్రాతిపదికన పౌరసత్వం వంటి ప్రముఖమైన కేసులు యు.యు. లలిత్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.

పిల్లలు చదువుతో పాటు క్రీడలు పట్ల ఆసక్తి పెంచుకోవాలి - మంత్రి ఆర్.కె.రోజా

Image
-  మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులకు శంఖుస్థాపన రాజమండ్రి, త్రిశూల్ న్యూస్ : పిల్లలు చదువుతో పాటు క్రీడలు పట్ల ఆసక్తి పెంచుకోవాలని రాష్ట్ర టూరిజం మరియు స్పోర్ట్స్ శాఖ మంత్రి ఆర్.కె.రోజా అన్నారు. శుక్రవారం ఉదయం రాజమండ్రి, వి.యల్.పురంలో రూ.23 కోట్లతో చేపట్టనున్న మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం, నాగుల చెరువు మార్కెట్ వద్ద రూ.6 కోట్ల నిధులతో క్రికెట్ గ్రౌండ్ నిర్మాణం పనుల శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్, జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రూడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిళ రెడ్డి , మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ ,పెద్ద ఎత్తున విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్ కె రోజా మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడి, రాజమహేంద్రవరం అభివృద్ధి కోసం రూ.125 కోట్లు గ్రాంటు మంజూరు చేయించుకోవడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఈరోజు మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసి...

వైకాపా తుమ్మితే ఊడే ముక్కు.. ఎవరూ భయపడొద్దు - చంద్రబాబు

Image
- నేను కుప్పం రాకూడదనే వైకాపా ప్రయత్నాలు - యానాదిపల్లె రచ్చ బండ కార్యక్రమంలో చంద్రబాబు కుప్పం, త్రిశూల్ న్యూస్ : తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన కుప్పం నియోజకవర్గంలో మూడోరోజు కొనసాగుతోంది. కుప్పం మండలం యానాదిపల్లిలో రచ్చబండ వద్ద చంద్రబాబుకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు గ్రామస్థులనుద్దేశించి ప్రసంగించారు. ఒకప్పుడు కుప్పంలో కనీస సౌకర్యాలు ఉండేవి కావు. తెదేపా పాలనలో అభివృద్ధి పనులు చేస్తూ వచ్చాం. విద్య, మౌలిక సదుపాయాలు కల్పించాం. మారుమూల గ్రామాల పిల్లలు సైతం ఉన్నత ఉద్యోగాలలో ఉండటం సంతోషం కలిగిస్తోంది. నార్త్‌ కొరియాలో కిమ్‌ ఉన్నట్టు మనకు ఇక్కడ జగన్‌ ఉన్నారు. మనపై దాడి చేసి మనపైనే కేసులు పెడుతున్నారు. నేను కుప్పం రాకూడదనే వైకాపా ప్రయత్నాలు. అందుకే మన క్యాడర్‌పై అక్రమ కేసులు పెడుతున్నారు. అన్నం పెడుతుంటే కూడా దాడులు చెయ్యడం ఏంటి? పోలీసులు నిన్న కుప్పంలో రౌడీల్లా వ్యవహరించారు. 22ఏళ్ల తెదేపా హయాంలో ఇలా చేసి ఉంటే ఏం చేసేవాళ్లు? వచ్చే ఎన్నికల్లో మళ్లీ తెదేపా వస్తుంది.. అందులో అనుమానమే లేదు. పోలీసులు గుర్తు పెట్టుకోవాలి. ఉన్మాది చెప్పాడని పోలీసులు పనిచెయ్యకూడద...

పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ..!

Image
-  పారిశుధ్య పనులను పరిశీలించిన నెల్లూరు కమిషనర్ హరిత నెల్లూరు, త్రిశూల్ న్యూస్ : నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, వర్షాకాలానికి తగిన విధమైన ప్రణాళికలతో సంసిద్ధంగా ఉండాలని కమిషనర్ శ్రీమతి హరిత అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 18 వ డివిజను అరవింద్ నగర్, 42 వ డివిజను కోటమిట్ట ప్రాంతాల్లోని పారిశుధ్య విభాగ కార్యాలయాలను అధికారులతో కలిసి కమిషనర్ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయాల్లోని అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తడి, పొడి చెత్తలను విడివిడిగా సేకరించినపుడే రీసైక్లింగ్ పద్ధతి ద్వారా సేంద్రీయ ఎరువులను తయారు చేయగలమని, నగర పాలక సంస్థ చెత్త సేకరణ వాహనాలకు నగర పౌరులంతా విడివిడిగా చెత్తను అందించి సహకరించాలని కోరారు. నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో పారిశుద్ధ్య పనులను క్రమంతప్పకుండా నిర్వహించేలా ప్రజలు కూడా స్వచ్ఛందంగా పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్యానికి హానికరమైన దోమల సంతాన ఉత్పత...

కుప్పంపై కక్ష కట్టి దౌర్జన్యాలు చేస్తున్నారు - చంద్రబాబు

Image
- హారుతులతో స్వాగతం పలికిన మహిళలు కుప్పం, త్రిశూల్ న్యూస్ : కుప్పం నియోజకవర్గంపై వైకాపా నేతలు కక్ష కట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పోలీసులను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మూడో రోజు పర్యటనలో భాగంగా కుప్పంలోని మోడల్‌ కాలనీలో ఆయన పర్యటించి మాట్లాడారు. 650 గృహాలతో మోడల్‌ కాలనీ నిర్మాణం ప్రారంభించామని.. 1+3 విధానంలో 3వేల మందికి విస్తరించాలని ప్రణాళిక రూపొందించి అనుమతులు ఇచ్చామన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇళ్ల నిర్మాణం ఆపేశారన్నారు. కుప్పంపై సీఎంకు అభిమానం ఉంటే తాను 3వేల ఇళ్లు కట్టిస్తే ఆయన 10వేల ఇళ్లు కట్టించాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి ఆపేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌, వైకాపా నేతలపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. అమ్మ క్యాంటీన్‌ను స్టాలిన్‌ కొనసాగిస్తున్నారు.. ''నేరస్థుల పాలన ఎలా ఉంటుందో నిన్న చూశాం. కుప్పం చరిత్రలో అది చీకటి రోజు. ఈ నియోజకవర్గంపై మీకెందుకంత కోపం? పేదవాడి పొట్టనింపే అన్న క్యాంటీన్‌ను ధ్వ...

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భద్రత పెంపు..!

Image
- ఎన్ఎస్ జీ డిఐజి సమర్ దీప్ సింగ్ ఉత్తర్వులు  న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనల్లో ఇటీవల వైసిపి నాయకులు తరచూ గొడవలు సృష్టించి ఉండడం. కొన్నినెలల క్రితం టీడీపీ కార్యాలయంపై వైసీపీ నాయకుల ప్రోత్సాహంతో అల్లరిమూకల దాడి.. తాజాగా కుప్పంలో చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి.. వంటి పరిణామాల నేపథ్యంలో ఆయన భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబుకు 6+6 కమాండోల భద్రత ఉంది. ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు తక్షణం 12+12 భధ్రత పెంచుతూ ఎన్ఎస్ జి  ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని, ఉండవల్లిలోని పార్టీ అధినేత చంద్రబాబు నివాసాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఎస్ జీ డిఐజి సమర్ దీప్ సింగ్ నేతృత్వంలోని బృందం గురువారం తనిఖీ చేసిన విషయం తెలిసిందే. సాయంత్రం నాలుగు గంటల తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చిన సమర్ దీప్ సింగ్ బృందం ప్రతి అంతస్తుకి, ప్రతి గదికీ వెళ్లి నిశితంగా పరిశీలించింది. చంద్రబాబు చాంబార్ ఎక్కడ? ఆయన సందర్శకుల్ని ఎక్కడ కలుస్తారు? ఆయనను కలిసేందుకు వచ్చేవారిని ఎలా తని...

నేడు కుప్పంలో మూడో రోజు పర్యటించునున్న చంద్రబాబు..!

Image
కుప్పం, త్రిశూల్ న్యూస్ : తెలుగుదేశం పార్టీ అధినేత, కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు నేడు కుప్పంలో పర్యటించునున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం కుప్పంకు వచ్చిన చంద్రబాబు శుక్రవారం కుప్పం, గుడుపల్లె మండలాల్లో పర్యటన చేయునున్నారు. కుప్పం ఆర్ అండ్ బి అతిధి గృహంలో బస చేస్తున్న చంద్రబాబు ఉదయం 10.30 గంటలకు నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించునున్నారు. 11.30 గంటలకు కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని మోడల్ కాలనీలోని ప్రజలతో మాట్లాడుతారు. మధ్యాహ్నం 12.30కు కుప్పం మండలం కృష్ణధాసనపల్లె, 3.00 గంటలకు జరుగు, 3.30కు గుడ్లనాయనపల్లె గ్రామాల్లో పర్యటన సాగుతుంది. సాయంత్రం 4.30కు గుడుపల్లె మండలం ఓఎన్. గ్రామంలో పర్యటన చేసి అనంతరం తమిళనాడు రాష్ట్రం మీదుగా బెంగళూరు విమానాశ్రయం చేరుకుంటారు. చంద్రబాబు పర్యటనలో భాగంగా గ్రామీణ ప్రజలతో మమేకం కానున్నారు. ఇందుకోసం టిడిపి నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. 

గ్రాఫ్లింగ్ పోటీలలో కడపల్లె విద్యార్థుల ప్రతిభ..!

Image
కుప్పం, త్రిశూల్ న్యూస్ : జాతీయ స్థాయిలో జరిగిన గ్రాఫ్లింగ్ రెస్లింగ్ పోటీలలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. గ్రాఫ్లింగ్ రెస్లింగ్ పోటీలలో 32కేజీల విభాగంలో తొమ్మిదివ తరగతి విద్యార్థిని కె.రక్షిత సిల్వర్ పతకం సాధించింది. అలాగే జె. కుమారి 47 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఉత్తరకాండ్ లోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం నందు నిర్వహించిన జాతీయ జూనియర్ గ్రాఫ్లింగ్ ఛాంపియన్ పోటీలలో ఈ ఘనత సంధించారు. ఈ సందర్బంగా విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

అన్న క్యాంటిన్ ను ద్వంసం చేయడం దుర్మార్గపు చర్య..!

Image
- గిద్దలూరు టీడీపీ శ్రేణులు కొవ్వొత్తులతో నిరసన  గిద్దలూరు, త్రిశూల్ న్యూస్ : కుప్పం నియోజకవర్గం పర్యటనలో బాగంగా రెండో రోజు మాజీ సీఎం చంద్రబాబుపై స్థానిక వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడుతూ వారి పర్యటనకు అడుగడుగునా ఆటంకం కల్గిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నా కూడా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం శోచనీయం అని గిద్దలూరు టిడిపి శ్రేణులు పేర్కొన్నారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ను చంద్రబాబు ప్రారంభించాల్సి ఉండగా దానిని వైసీపీ శ్రేణులు పూర్తిగా ద్వంసం చేయడం చూస్తుంటే పేదల నోటి కాడి అన్నం తీయటం ఈ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్యలా అనిపిస్తుందన్నారు. గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్  ముత్తుముల అశోక్ రెడ్డి  ఆదేశానుసారం గిద్దలూరు టీడీపీ శ్రేణులు నిరసన తెలియచేశారు. గిద్దలూరు - రాచర్ల రోడ్డుపై బైటాయించి నల్ల బ్యాడ్జిలు ధరించి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన దొషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిన్నటి రోజు కుప్పం పర్యటనలో టీడీపీ ఫ్లెక్సీలను జెండాలను చించి చెల్లా చెదురుగా పడవేసి వైసీసీ పార్టీ ఫ్లెక్సీలు జెండాలను ఏర్పాటు చేయడం రాజ్యాంగ...