నేడు తెలుగుభాషా దినోత్సవం సందర్బంగా ప్రత్యేక వ్యాసం - రచయిత వడ్డేపల్లి మల్లేశం
త్రిశూల్ న్యూస్ డెస్క్ : దాదాపుగా 2700 సంవత్సరాలుగా తెలుగు భాష తన సొంత వైవిధ్యాన్ని చాటుకుంటూ అనేక చారిత్రక విషయాలను తనలో ఇముడ్చుకొని విరాజిల్లినప్పటికీ మారుతున్న కాలక్రమంలో పరభాషా మోజులో క్రమంగా మరుగున పడుతుందేమో అనే ఆందోళన మనందరినీ కలచివేస్తున్న ప్రస్తుత సమస్య. ఈ సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని 2000 సంవత్సరం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ తెలుగు వాళ్ళు ఉన్న ఛోటా ప్రపంచస్థాయిలో ను నిర్వహించడం జరుగుతున్నది. ఒక భాషకు దినోత్సవాన్ని సంతరించుకోవడానికి ప్రధానమైన కారణం ఆ భాషను సజీవంగా ఉంచి భావితరాలకు అందించాలనే తపన. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట గ్రామంలో 1863 ఆగస్టు 29వ తేదీన జన్మించిన తెలుగు వెంకట రామమూర్తి పంతులు చేసిన కృషి అనిర్వచనీయమైనది. సంస్కృత భాష ముసుగులో ఉండి సామాన్య ప్రజలకు తెలుగుభాష అందుబాటులో లేని కాలంలో తెలుగును వ్యావహారిక భాషలోకి మార్చి సామాన్య ,పామరులకు కూడా చదువుకునే పరిస్థితి కల్పించిన రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా...