Posts

Showing posts from May, 2022

మా జెండా అజెండా ప్రజా సంక్షేమమే..!

Image
- సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడు, త్రిశూల్ న్యూస్ :  రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం బుధవారం ఉత్సాహంగా కొనసాగింది, గ్రామ గ్రామానా ప్రజలు ఎదురేగి తమ నాయకులకు స్వాగతం పలికారు. అధికారులు, నాయకులు తమ ఇంటికి వచ్చి సమస్యల గురించి అడుగుతుంటే ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా నాగలపురం మండలంలోని సురుటుపల్లి, కారణి గ్రామాలలో స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో గడప గడపకు వెళ్లి ఎమ్మెల్యే సమస్యలను అడిగి తెలుసుకుని సాధ్యాసాధ్యాలును బట్టి తక్షణం పరిష్కరించారు. మరికొన్ని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతాన్ని మూడేళ్లలోనే సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేశారన్నారు, కరోనా ప్రతికూల పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి రూ.1.41 లక్షల కోట్లు జమచేసి వారికి బాసటగా నిలవడాన్ని గుర్తుచేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వల

సర్కారు రుణ మాఫీ చేస్తలేదు.. బ్యాంకులు రుణాలు ఇస్తలేదు..?

Image
- ఆర్బీఐ ఆదేశాలు బేఖాతరు..? త్రిశూల్ న్యూస్ డెస్క్, హైదరాబాద్ : మరో వారం పది రోజుల్లో వానాకాలం సీజన్​మొదలవనుంది.అయినా ఇంతవరకు 'రుణ ప్రణాళిక' రూపొందించలేదు. ఏటా ఆగస్టులో రుణ ప్రణాళిక ప్రకటిస్తున్నా అమలుపై కూడా స్పష్టమైన సమీక్ష జరగడం లేదు. 2022 జనవరి 27న రాష్ట్ర వ్యవసాయ శాఖ ముసాయిదా రుణ ప్రణాళిక ప్రకటిస్తూ 2022--23 సంవత్సరానికి రూ. 67,863 కోట్ల రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. 2021-22 సంవత్సరంలో పంటల రుణ ప్రణాళిక రూ.59,440 కోట్లగాను, దీర్ఘకాలిక రుణాల కింద రూ. 12,081 కోట్లుగా ప్రకటించింది. కానీ వాస్తవంగా రూ. 53,221 కోట్ల మేర పంట రుణాలు, రూ. 12,061 కోట్లు దీర్ఘకాలిక రుణాలే ఇచ్చారు.'బుక్ అడ్జస్ట్​మెంట్ చేయడం' ద్వారా మాత్రమే పంట రుణాలు ఇచ్చినట్లు ప్రకటించారు. - రుణ   మాఫీ ఇంకెన్నడు...? రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది రైతులుండగా అందులో 50 లక్షల మంది రైతులకే అకౌంట్లు ఉన్నట్లు బ్యాంకులు ప్రకటిస్తున్నాయి. ప్రతి బ్రాంచ్ సంవత్సరానికి 100 మంది కొత్త రైతులకు రుణాలు ఇవ్వాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. రాష్ట్రంలో 5,762 బ్యాంకు బ్రాంచీలున్నాయి. ఇందులో

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వార్ వన్ సైడే..!

Image
- ఇంతటి ప్రజా వ్యతిరేక పాలన చూడలేదన్న చంద్రబాబు  త్రిశూల్ న్యూస్ డెస్క్ : మహానాడు సక్సెస్ తో జోష్ మీదున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరింత దూకుడు పెంచారు. పార్టీ నేతలంతా జనంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల టూర్లు, పార్టీ కమిటీల నియామకం వంటి అంశాలపై పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అసమర్థ, అధ్వాన్న పాలనతో వైసిపి పని అయిపోయిందని చంద్రబాబు అన్నారు. ప్రజలు పాలనపై తీవ్ర అసంతృప్తితో, ఆవేదనతో ఉన్నారని.. ఇంతటి ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వార్ వన్ సైడే ఉంటుందని తేల్చిచెప్పారు చంద్రబాబు. మహానాడు సక్సెస్ కావడానికి గల కారణాలను పార్టీ నేతలకు వివరించారు చంద్రబాబు .మూడేళ్ల జగన్ నియంత పాలనతో కార్యకర్తల్లో కసి ఉందని.. అది మహానాడులో స్పష్టంగా కనిపించిందని చెప్పారు. వాహనాలు దొరక్కుండా ఇబ్బందులు పెట్టినా వందల కిలోమీటర్ల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి సభను జయప్రదం చేశారని అన్నారు. సొంతగా ఆటోలు, ట్రాక్టర్లు, లారీల్లో

బాలికపై గ్రామ వాలంటీర్ 3 నెలలుగా అత్యాచారం

Image
- పోలీసులను ఆశ్రయించిన బాలిక తల్లిదండ్రులు - నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు బాపట్ల, త్రిశూల్ న్యూస్ :  బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో ఓ బాలికపై (15) గ్రామ వాలంటీర్‌ మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం వేరే గ్రామంలో ఉంటున్నారు. అమ్మమ్మతో కలిసి బాలిక గ్రామంలో ఉంటోంది. వాలంటీర్‌గా పని చేస్తున్న వివాహితుడైన రావిపాటి కోటయ్య బాలికను బెదిరించి గత మూడు నెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని బాధిత బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

జగన్ దావోస్ పర్యటనలో సాధించిందేమిటి..?

Image
- దావోస్ పర్యాటకు 4కోట్లు ఖర్చు..? త్రిశూల్ న్యూస్ డెస్క్ : రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్, కుటుంబంతో సహా ప్రత్యేక విమానంలో లండన్‌ మీదుగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వెళ్లారు.మరి అక్కడికి వెళ్లి ఆయన సాధించిందేమిటి? ఇది, ప్రజలు వేస్తున్న ప్రశ్న. రాష్ట్రంలోనే అందుబాటులో ఉండే కంపెనీల ప్రతినిధులను దావోస్‌లో కలుసుకుని ఒప్పందం చేసుకోవడం విచిత్రంగా ఉంది. ఇండియాలో ఉండే అదే అరబిందో, అదే అదానీ, అదే గ్రీన్‌కోతో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకునేందుకు. దాదాపు రూ. 4 కోట్ల వరకు ఖర్చు పెట్టి దావోస్ వరకు వెళ్లడం అవసరమా? కుదిరిన ఒప్పందాలు కూడా గ్రీన్‌ ఎనర్జీ రంగంలోనే. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈ గ్రీన్ కో సంస్థ కర్నూలు జిల్లాలో భారీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టు నొకదాన్ని చేపట్టింది. కానీ జగన్‌ ప్రతిపక్షంలో ఉండగా సౌర, పవన విద్యుత్తు ఒప్పందాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు చెయ్యడంతో ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపొయ్యాయి. అధికారంలోకి వచ్చిన మూడేళ్ళకు ఇప్పుడు జగన్‌ అక్కడికి వెళ్లి పంప్డ్‌ హౌస్‌ కాంక్రీట్‌ పనులు ప్రారంభించారు. ఇప్పుడు దావోస్‌లో అదే సంస్థతో వేల కోట్ల రూపాయల పెట్టుబడితో

ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ గా తిరుపతి

Image
- డిజైన్లు విడుదల చేసిన రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తిరుపతి, త్రిశూల్ న్యూస్:  తిరుపతి రైల్వేస్టేషన్‌కు త్వరలో మహర్దశ పట్టనుంది. కాంట్రాక్టులన్ని పూర్తి చేశామని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. ఈ సందర్బంగా ఆయన డిజైన్లు కూడా విడుదల చేశారు. దేశంలోనే ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్లుగా తొలిదశలో అభివృద్ధి చేస్తున్న 14 రైల్వే స్టేషన్లలో తిరుపతి ఒకటి. ఈ 14 రైల్వే స్టేషన్లను 5 వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ ఇక ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా రూపాంతరం చెందనుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశవ్యాప్తంగా భక్తులు అధికంగా రైల్వే ద్వారానే వస్తుంటారు. వేలాది భక్తులతో తిరుపతి రైల్వే స్టేషన్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు రావడంతో తిరుపతి రైల్వే స్టేషన్‌ను ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది.

ఏసీబీకి చిక్కిన విద్యుత్ అధికారులు..!

Image
హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ : విద్యుత్ మీటర్లు ఇవ్వడానికి లంచం అడిగిన ఏఈ, లైన్ ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కూకట్‌పల్లికి చెందిన భాస్కర్ అనే గుత్తేదారు 20 విద్యుత్ మీటర్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. సనత్ నగర్ విద్యుత్ శాఖలో ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న అవినాష్ రూ. 25 వేలు, లైన్ ఇన్‌స్పెక్టర్ కృపానంద్ రూ. 7,500 లంచం డిమాండ్ చేశారు. ఇందులో కొంత నగదును భాస్కర్ ఇప్పటికే ముట్టజెప్పారు. ఆ తర్వాత 5 మీటర్లు మంజూరు చేశారు. మిగతా డబ్బులిస్తేనే మరో 15 మీటర్లు మంజూరు చేస్తామని అధికారులు డిమాండ్ చేశారు. దీంతో భాస్కర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏఈ, లైన్ ఇన్‌స్పెక్టర్‌కు లంచం ఇస్తుండగా, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

చంద్రబాబుకు 2024 చివరి ఎన్నికలు..!

Image
- మంత్రి పెద్ద రెడ్డి రామచంద్రా రెడ్డి చిత్తూరు, త్రిశూల్ న్యూస్:  2024 లో జరిగే ఎన్నికలు చంద్రబాబు నాయుడుకు కడపటి ఎన్నికలు అవుతాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రం నిర్వహించిన ఆజాద్ కా అమృత్ మహోత్సవం కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహానాడు కార్యక్రమం తర్వాత టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తున్నదని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు పెద్దిరెడ్డి స్పందించారు. అనంతపురంలో నిర్వహించిన సామాజిక న్యాయ గర్జన సభకు టిడిపి మహానాడు సభ కన్నా మూడింతలుగా జనం తరలి వచ్చారని తెలిపారు. ఏ కార్యకర్త అయిన ఆయా పార్టీలకు పట్టుగొమ్మగా ఉండాల్సిందేనని తెలిపారు. కానీ గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 151 స్థానాల్లో గెలుపొందడం జరిగిందని, అంతకంటే 2024 జరిగే ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలుపొందడం ఖాయమని తెలిపారు. చంద్రబాబుకు 2024 ఎన్నికలే కడపటి ఎన్నికల అవుతాయని జోస్యం చెప్పారు అనంతరం ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ టిడిపి నిర్వహించిన మ

జూన్ 1 నుండి తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం - టిటిడి

Image
- దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు సహకరించాలని విజ్ఞప్తి తిరుమల, త్రిశూల్ న్యూస్ : తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా జూన్ 1వ తేదీ నుండి సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని టిటిడి నిర్ణయించింది. తిరుమల ఆస్థానమండపంలో మంగళవారం దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులతో టిటిడి అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టేట్ విభాగం ప్రత్యేకాధికారి మల్లికార్జున మాట్లాడుతూ ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని, అలిపిరి చెక్ పాయింట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని తెలిపారు. ప్లాస్టిక్ కవర్లలో వచ్చే ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. పంచలు, బొమ్మలు, ఇతర వస్తువులకు ప్లాస్టిక్ కవర్ల ప్యాకింగ్ లేకుండా బయోడిగ్రేడబుల్ కవర్లు గాని పేపర్ కవర్లు గాని ఉపయోగించాలన్నారు. ప్లాస్టిక్ షాంపూ పొట్లాలు కూడా విక్రయించరాదన్నారు. హోటళ్ల నిర్వాహకులు, మఠాల నిర్వాహకులు కూడా ప్లాస్టిక్ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. దుకాణాల వద్ద అధిక ధరలకు విక్రయించకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. టి

కాపురానికి వెళ్ళనన్న కూతురు - కొట్టి చంపిన తండ్రి

Image
- దాడిలో అడ్డు వచ్చిన భార్య మృతి  మహబూబ్‌నగర్‌, త్రిశూల్ న్యూస్ :  కాపురానికి వెళ్లనని చెప్పిన నవవధువును తండ్రి కొట్టి చంపాడు. కుమార్తెను కొడుతుండగా అడ్డుకునేందుకు వెళ్లిన భార్యను కూడా రోకలిబండతో కొట్టి చంపాడు. అనంతరం నిందితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా జైనల్లీపూర్‌ గ్రామానికి చెందిన కృష్ణయ్య, కలమ్మ భార్యాభర్తలు. ఈ దంపతుల కుమార్తె సరస్వతి (22)ని మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన యువకుడికి ఇచ్చి మే 8న వివాహం జరిపించారు. పెళ్లి జరిగిన 10 రోజుల తర్వాత నవవధువు ఇంటికొచ్చింది. ఆ తర్వాత అత్తారింటికి వెళ్లబోనని తల్లిదండ్రులకు చెప్పింది. కాపురానికి వెళ్లాల్సిందేనని కుమార్తెను తండ్రి కృష్ణయ్య మందలించాడు. కానీ, ఏం కష్టమొచ్చిందో ఏమో గానీ.. అత్తారింటికి వెళ్లేందుకు ఆ అమ్మాయి నిరాకరించింది. ఆమెకు తల్లి కూడా మద్దతుగా నిలిచింది. ఈ విషయంపై మంగళవారం ఉదయం ఆ కుటుంబంలో మరోసారి ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన కృష్ణయ్య.. కుమార్తె సరస

ఆటో బైక్ ఢీ - వ్యక్తికి తీవ్ర గాయాలు

Image
కర్నూలు, త్రిశూల్ న్యూస్ : నంద్యాల మూలమఠంకు చెందిన నరసింహులు 32 పని నిమిత్తం కొత్తపల్లె వైపు వెళ్లి తిరిగి AP 21 BL 9727 బైక్ పై తన ఇంటికి నంద్యాల మూలమఠంకు వస్తుండగా మూలమఠం సమీపంలో నంద్యాల నుండి వైపు నుండి బండి ఆత్మకూరు వైపు అతి వేగంగా వెళ్తున్న కడమ కాలువ కు చెందిన AP 21 TA 34 87 ఆటో డ్రైవర్ బైక్ పై వస్తున్న నర్సింహుల్ని ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు గాయపడినవారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నరసింహులు పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

టిడిపి మంచి పార్టీ - వల్లభనేని వంశీ

Image
త్రిశూల్ న్యూస్ డెస్క్ : వల్లభనేని వంశీ మనసు మార్చుకున్నారా? వైసీపీలో రాజకీయాలతో ఆయన యూ టర్న్ తీసుకున్నారా? ఇటీవల జరుగుతున్న పరిణామాలతో కలత చెంది తిరిగి సొంత గూటికి చేరాలనుకుంటున్నారా?ఇప్పుడిదే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు ఆజ్యం పోస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీ అంటూ ఆయన కీర్తించడం కొత్త సంకేతాలకు నిదర్శనమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతటితో ఆగకుండా తానెప్పుడు టీడీపీకి తిట్టలేదని కూడా గుర్తుచేయడం విశేషం. నిన్నటిదాకా టీడీపీపై దుమ్మెత్తిపోసిన వల్లభనేని వంశీ సడన్ గా ఇలా మాట్లాడుతున్నారేంటి ? అన్న చర్చ జరుగుతుంది. వైసీపీలో అంతర్గత పోరు నేపధ్యంలో వల్లభనేని వంశీకి పొమ్మనలేక పొగబెడుతున్నారా అన్న చర్చ కూడా జోరందుకుంటోంది. ఓ క్రికెట్ టోర్నీలో విజేతలకు బహుమతులు అందించిన తరువాత వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని నడిపిన తీరుపై మాత్రమే తాను విమర్శలు చేశానని, లోకేష్ చేతుల్లోకి వచ్చిన తర్వాత పార్టీ విధానాలు దెబ్బతిన్నాయని మాత్రమే తాను విమర్శలు చేశానని వల్లభనేని వంశీ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం

పోలీస్ స్టేషన్ ముందే రాళ్లతో దాడులు..!

Image
- చిత్తూరు జిల్లా గుడుపలల్లో ఉద్రిక్తత కుప్పం, త్రిశూల్ న్యూస్ : మద్యం మత్తులో నలుగురి వ్యక్తుల మధ్య మొదలైన గొడవ.. చివరికి రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఏకంగా పోలీస్‌ స్టేషన్‌ ఎదుటనే వందలాది మంది రోడ్డుపైకొచ్చి రాళ్లు రువ్వి కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గుడుపల్లె మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుడుపల్లె మండలంలోని చీకటిపల్లె, కోట చెంబగిరి గ్రామాలకు చెందిన నలుగురు వ్యక్తులు గురువారం ఏపీ సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం బిసానత్తం వద్ద మద్యం తాగారు. తిరుగు ప్రయాణంలో ఒంటిపల్లె వద్ద మద్యం మత్తులో వీరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించగా, రెండు గ్రామాల పెద్దలు శనివారం రాజీ కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో సోమవారం పోలీసుల ఎదుట సర్ది చెప్పేందుకు గ్రామస్తులు మరోసారి ప్రయత్నించారు. ఈ సమయంలో ఒక వర్గానికే న్యాయం చేస్తున్నారంటూ మరో వర్గ ప్రజలు రోడ్డును దిగ్బంధించి నిరసనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమం

అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి..?

Image
కుప్పం, త్రిశూల్ న్యూస్ : చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని దాసేగౌనూరు గ్రామంలోని బైరప్ప కొట్టలులో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మంగళవారం వెలుగు చూసింది. మృతుడు బంగారప్పగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కుప్పం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఏపిఆర్టీసీ బస్సుల్లోనూ డిజిటల్‌ చెల్లింపులు..!

Image
- పైలట్‌ ప్రాజెక్టు కింద విజయవాడ, గుంటూరు–2 డిపోల ఎంపిక విజయవాడ, త్రిశూల్ న్యూస్ :  ఏపీఎస్‌ఆర్టీసీ కొత్త పుంతలు తొక్కుతోంది. బస్సుల్లోనూ నగదు రహిత డిజిటల్‌ చెల్లింపులకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం డ్రైవర్లు, కండక్టర్ల వద్దనున్న టికెట్‌ ఇష్యూయింగ్‌ యంత్రాల(టిమ్స్‌) స్థానంలో ఈ–పోస్‌ యంత్రాలను అందుబాటులోకి తెస్తోంది. వీటితో ప్రయాణికులు నగదు చెల్లించనవసరం లేకుండా డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు, ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి వాటితో టికెట్లు పొందొచ్చు. ఫలితంగా బస్సుల్లో చిల్లర సమస్య ఉండదు. పైలట్‌ ప్రాజెక్టు కింద విజయవాడ, గుంటూరు–2 డిపోలను ఎంపిక చేశారు. ఈ డిపోల నుంచి తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి దూర ప్రాంత సర్వీసుల్లో ఈ–పోస్‌ మెషీన్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ రూట్లలో విధులు నిర్వర్తించే డ్రైవర్లు, కండక్టర్లకు ఈ–పోస్‌ యంత్రాల వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో డిపో నుంచి పది మంది చొప్పున డ్రైవర్లు, డ్రైవర్‌ కం కండక్టర్లు మూడు వారాలుగా ఈ శిక్షణ పొందుతున్నారు. వీరికి శిక్షణ పూర్తయ్యాక ఈ–పోస్‌ యంత్రాలు ప్రవేశపెడతారు. దశలవారీగా అన్ని

పద్మ కుటుంబానికి న్యాయం చేస్తాం..!

Image
- స్పందించిన మహిళా కమిషన్ మెంబర్ గజ్జల లక్ష్మి తిరుపతి, త్రిశూల్ న్యూస్ : పద్మ అదృశ్యం అయిన విషయం కొద్ది రోజుల క్రితం మహిళా కమిషన్ కి మెయిల్ ద్వారా తమ బంధువులు ఫిర్యాదు అందజేశారు. ఫిర్యాదును తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి రెఫర్ చేసి మహిళ ఆచూకీ కనుగొనాలి అని మహిళా కమిషన్ కోరింది. ఈరోజు వెంకటాపురం చెరువులో పద్మ మృతదేహం లభించింది. విషయం తెలిసిన వెంటనే మహిళా కమిషన్ సభ్యురాలు తీవ్ర ధిగ్బ్రాంతి వ్యకం చేశారు . ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో పద్మ తల్లిదండ్రులు ఉన్నారని తెలుసుకున్న మహిళా కమిషన్ మెంబర్ గజ్జల లక్ష్మి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పద్మ తల్లిదండ్రులను ఓదార్చారు వారికి ధైర్యం చెప్పారు. పద్మ హత్యకు ఎవరైతే పాల్పడ్డారో వారందరి మీద కఠిన చర్యలు తీసుకుంటామని పద్మ కుటుంబానికి న్యాయం చేస్తామని తెలిపారు. తిరుపతి ఎస్పి గారిని కలిసి పద్మ హత్యకు ఎవరైతే పాల్గొన్నారో వారికి కఠినంగా శిక్షించాలని కోరారు మహిళా కమిషన్ మృతురాలి కుటుంబానికి అండగా వుంటుందని తెలియజేశారు. పద్మని హత్య చేసిన భర్త వేణుగోపాల్ మరియు హత్యకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయించారు. మహిళా కమిషన్ మెంబర్ గజ్

భార్యను హత్య చేసిన సాఫ్ట్ వేర్

Image
- మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు తిరుపతి, త్రిశూల్ న్యూస్ : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన భర్త..కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న వేణుగోపాల్ కు, తిరుపతికి చెందిన పద్మతో 2019లో వివాహం జరిగింది.పెళ్ళైన నాటి నుంచే భార్యాభర్తల మధ్య తరచూ చిన్న చిన్న గొడవలు జరిగేవి. ఈక్రమంలో భర్త వేణుగోపాల్ తో పొసగక.. పుట్టింటికి వచ్చింది పద్మ. అనంతరం ఇరు కుటుంబాల పెద్దలు కల్పించుకుని సర్ది చెప్పడంతో..ఈ ఏడాది జనవరిలో భార్యను కాపురానికి తెచ్చుకున్నాడు వేణుగోపాల్. అయితే ఇకపై పుట్టింటి వారితో కనీసం ఫోన్ లో నైనా మాట్లాడకూడదంటూ షరతు పెట్టాడు. ఈక్రమంలో గత నాలుగు నెలలుగా పద్మ నుంచి ఒక్కసారి కూడా ఫోన్ రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు..పోలీసులను ఆశ్రయించారు.దీంతో వేణుగోపాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా..పద్మను తానే హత్య చేసి ఆపై సూట్ కేసులో పెట్టి చెరువులో పడేసినట్టు అంగీకరించాడు. ఈ హత్య ఘటనలో సోమవారం తిరుపతి పోలీసులు వేణుగోపాల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చే

ఆకస్మికంగా గ్రామ సచివాలయం తనిఖీ

Image
- సచివాలయానికి వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలి  - గ్రామ సచివాలయ సిబ్బందికి ఆదేశించిన జిల్లా కలెక్టర్ గిరీషా బి.కొత్తకోట, త్రిశూల్ న్యూస్   ప్రజల దగ్గరగా ఉంటూ మెరుగైన సేవలు అందించడంతో పాటు సచివాలయానికి వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ గ్రామ సచివాలయ ఉద్యోగులకు సూచించారు. సోమవారం బి.కొత్తకోట మండలం, గట్టు సచివాలయంను జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక, ప్రభుత్వ పథకాల పోస్టర్ లు తదితర వాటిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటివరకు సచివాలయానికి ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని గ్రామ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను ఇంటి వద్దనే అందించేందుకు సచివాలయ వ్యవస్థ అనేది చాలా కీలకమ

ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం కదా..!

Image
- అభివృద్ధి చేయలేదంటే ఎలా..? - మంత్రి ధర్మాన సంచలన వాఖ్యలు  అనంతపురం, త్రిశూల్ న్యూస్ : అనంతపురంలో ఏపీ రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వాఖ్యలు చేశారు. ప్రజల ఖాతాల్లో డబ్బులు వేసినా.. అన్ని అవసరాలూ తీర్చాలంటే ఎలా అని వ్యాఖ్యానించారు. మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ముగింపు సందర్భంగా అనంతపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు మాట్లాడారు. రాష్ట్రంలో బడుగు వర్గాల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్న మంత్రి.. అక్కడక్కడా కొన్ని పనులు జరగలేదని మాట్లాడవద్దని సూచించారు. అవసరాల కోసం బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తూ ఉంటే అన్ని అవసరాలు తీర్చడానికి మరికొంత సమయం పడుతుందని, తొందరేమీ లేదని అన్నారు. గతంలోనూ జగన్‌ లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజా ఉద్యమాలు వచ్చేవే కాదని వెల్లడించారు. మహానాడులో ఓ నాయకురాలు తొడకొట్టారని, జనాలు త్వరలోనే ఓటు ద్వారా చంద్రబాబుకు బుద్ధి చెబుతారని మహిళ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌ పేర్కొన్నారు. సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి తమిళనాడు, కర్ణాటక సరిహద్దులోని ప్రాంతాల ప్రజలు తమను ఆంధ్రప్రదేశ్‌లో కలపా

రైల్వే స్టేషన్లలో మహిళల భద్రతకు పటిష్ట చర్యలు

Image
- ఏపీ మహిళా కమిషన్ కు రైల్వే నివేదిక - వాసిరెడ్డి పద్మను కలిసిన దక్షిణ మధ్య రైల్వే డీఐజీ గుంటూరు, త్రిశూల్ న్యూస్ : రైల్వే స్టేషన్లు, పరిసర ప్రాంతాల్లో మహిళలు, బాలికల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టామని దక్షిణ మధ్య రైల్వే పోలీసు శాఖ రాష్ట్ర మహిళా కమిషన్ కు నివేదికలో స్పష్టం చేసింది. ఈమేరకు సోమవారం మహిళా కమిషన్ కార్యాలయానికి దక్షిణ మధ్య రైల్వే డీఐజీ రమేష్ చంద్ర, గుంటూరు రైల్వే డివిజన్ ఏడీఆర్ఎం ఆర్. శ్రీనివాసులు, డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ కె. హరప్రసాద్ విచ్చేసి కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను ఆమె ఛాంబర్ లో కలిశారు. ఇటీవల పల్నాడు, బాపట్ల జిల్లాల్లో గురజాల, రేపల్లె రైల్వేస్టేషన్ లలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనలపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించి మహిళా భద్రతపై రైల్వేపోలీసు శాఖకు నోటీసులు పంపింది. శాఖాపరమైన చర్యలను బాధ్యులు వ్యక్తిగతంగా హాజరై మహిళా కమిషన్ కు వివరించాలని నోటీసులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు రైల్వే పోలీసు ఉన్నతాధికారులు నివేదిక అందజేశారు. గురజాల రైల్వే హాల్, రేపల్లె ఘటనలపై వారు వివరణ ఇచ్చారు. రైల్వే స్టేషన

తొలిసారి ఆకాశ మార్గాన పోస్టల్ డెలివరీ..!

Image
- 49 కి.మీలకి 25 నిమిషాలు డెలివరీ సమయం  గుజరాత్, త్రిశూల్ న్యూస్ :  మొట్టమొదటిసారి పోస్టల్ డిపార్ట్‌మెంట్ కూడా డ్రోన్ సర్వీసులను ప్రారంబించింది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా.. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో డ్రోన్‌ను వాడుతూ తొలిసారి పార్శిల్‌ను డెలివరీ చేసింది. 25 నిమిషాల్లో 46 కి.మీల దూరంలో ఈ డ్రోన్ ప్రయాణించి.. పార్శిల్‌ను డెలివరీ చేసినట్టు పోస్టల్ డిపార్ట్‌మెంట్ అధికారులు వెల్లడించారు. కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం కింద పనిచేసే పోస్టల్ డిపార్ట్‌మెంట్ కచ్ జిల్లాలో భచౌ తాలూకా సమీపంలోని భుజ్ తాలూకాకు చెందిన హబే గ్రామం నుంచి ఈ డ్రోన్ ద్వారా పార్శిల్‌ను పంపారు. పత్రికా ప్రకటన కార్యాలయం(పీఐబీ) అహ్మదాబాద్ విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయం తెలిసింది. ఈ పైలట్ ప్రాజెక్టు విజయం కావడంతో.. భవిష్యత్‌లో డ్రోన్ల ద్వారా పోస్టల్ డెలివరీలను చేపట్టడం కుదురుతుందని పీఐబీ అహ్మదాబాద్ చెప్పింది. ఆధునిక సాంకేతికత పెరుగుతోన్న సమయంలో.. పైలట్ ప్రాజెక్టులో భాగంగా పోస్టల్ చరిత్రలోనే తొలిసారి డ్రోన్ సర్వీసుల సాయంతో కొరియర్‌ను డెలివరీ చేసినట్టు పీఐబీ తెలిపింది. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో డ్రోన్ టెక్నాలజీ సాయం

జాపాలి తీర్థం విశేషాలు

Image
తిరుపతి, త్రిశూల్ న్యూస్ : హనుమంతుడు పుట్టి పెరిగిన ప్రదేశం మన తిరుమల శేషాచల కొండలలో అంజనాద్రి పైన జాపాలీ తీర్థం. తిరుమల నుండి 12కి.మీ దూరంలో ఉంది. పాపనాశనం వెళుతూ ఉంటే దారి మధ్యలో ఉంటుంది. ప్రధాన ద్వారం నుండి దేవాలయంకు దాదాపు 1 నుండి 2 కి.మీ దూరం నడవవలిసి ఉంటుంది. మెట్లు కూడా ఉంటాయి. దారి మధ్యలో పెద్ద మనుషులుకు ఇబ్బంది అవుతుంది. మార్గ మధ్యలో పెద్ద పెద్ద వృక్షాలు, కొండలు దర్శనమిస్తాయి. ఆంజనేయ స్వామి వారి జన్మ స్థలం కూడా ఇదే అని ఈ మధ్యే టీటీడీ వారు కూడా స్పష్టం చేశారు. తప్పక చూడాల్సిన ప్రదేశం. ఎవరూ కూడా మిస్ అవకూడదు. ఒక అద్భుతమైన అనుభూతిగా మిగిలిపోతుంది. - జాపాలి ఆంజనేయస్వామి తిరుమలలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలలో జాపాలి తీర్థం ఒకటి. ఇక్కడ వెలసిన హనుమంతుడుకి చాలా పురాణ ప్రాముఖ్యత కల్గిన చరిత్ర ఉంది. ఈ ప్రదేశంలో ఎందరో మహాత్ములు, యోగులు, సాధువులు సిద్ధి పొంది తరించారు. దేవతలు నడయాడిన ప్రదేశం ఈ జాపాలి.  సాక్షాత్తు హనుమంతుడి కోసం తల్లి అంజనాదేవి తప్పస్సు చేసిన పవిత్ర ప్రదేశం. కేవలం దర్శనమాత్రముచే పంచమహా పాతకములు, భూత, ప్రేత, పిశాచాది బాధలు నుం

అమలాపురం ఘటనను ముక్తకంఠంతో ఖండించాలి - పవన్ కళ్యాణ్

Image
అమరావతి, త్రిశూల్ న్యూస్ : కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఆందోళనలతో అమలాపురంలో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ స్పందించారు. అమలాపురం ఘటనను ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. శాంతియుత పరిస్థితుల కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అంబేడ్కర్‌ పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమన్న పవన్‌..ఆ మహనీయుడి పేరును వివాదాల్లోకి తెచ్చినందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అమలాపురంలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పాలనా లోపాలను కప్పిపుచ్చుకోవడానికే సమస్యలు సృష్టిస్తున్నారని.. పాలకుల వైఫల్యాలను పార్టీలకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. ఉద్రిక్త పరిస్థితులకు కారణం ఎవరనేది రాష్ట్ర ప్రలజందరికీ తెలుసన్నారు. హోంమంత్రి చేసిన ప్రకటనలో జనసేన పేరు ప్రస్తావనను ఖండిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ లోపాలు, వైకాపా వైఫల్యాలను జనసేనపై రుద్దడం సరికాదన్నారు.

ఉప్పొంగిన ఉత్సాహం.. ఉరకలేసిన ఆనందం..!

Image
- రెండేళ్ల తరువాత పుర విధుల్లో అమ్మవారి విశ్వరూపం - అడుగడుగునా అమ్మవారికి జంతుబలులు కుప్పం, త్రిశూల్ న్యూస్ : చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో నెలకొని యుండు శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం అమ్మవారు శిరస్సు పట్టణ పురవిధుల్లో ఊరేగింది. పట్టణంలోని చెరువు కట్టపైకి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడి కోనేటి వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి కళ్ళకు కట్టిన తెరను తొలగించడంతో అమ్మవారి విశ్వరూప ప్రదర్శన ప్రారంభమైంది. అక్కడి నుండి పాటపేట, పైబాట, హెచ్ పి రోడ్డు, నేతాజీ రోడ్డు, కొత్తపేట వీధుల్లో ఊరేగింపు జరిగింది. కరోనా మహమ్మారి వల్ల రెండేళ్ల భక్తుల దర్శనానికి దూరమైన అమ్మవారు ఈ ఏట కరుణించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. మంగళ వాయిద్యాలు, డ్రమ్స్, పలక డ్యాన్స్, యువకుల ఉత్సాహం, యువతుల నృత్యాల మధ్య అమ్మ శిరస్సును ఊరేగింపు జరిగింది. అమ్మ వారి విశ్వరూపాన్ని చూడడానికి జిల్లా ప్రజలే కాక కర్ణాటక, తమిళనాడు నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు. అమ్మవారికి అడుగడుగునా గొర్రెలను, కోళ్లను, మేకలను భక్తులు బలి ఇచ్చారు. దింతో కుప్పం పట్టణ రోడ్లు అన్ని రక్త

మోగిన అనంత ఎన్నికల నగారా..!

Image
- ఈ నెల 31న టౌన్ బ్యాంక్ ఎన్నికలు - ప్రచారానికి సిద్ధమైన అభ్యర్థులు - సంఖ్య కేటాయింపులో కాస్త మార్పులు - మురళి ప్యానల్ గెలుపు లాంఛనమేనా..!   అనంతపురం, త్రిశూల్ న్యూస్ :  తరచూ వాయిదా పడుతున్న  అనంతపురం టౌన్ బ్యాంక్ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం ఎట్టికేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 31వ తేదీన ఓటింగ్ జరగనుంది. కచ్చితంగా ఎన్నికలు జరపాలని హైకోర్టు ఉత్తర్వులు ఉండడంతో  ఓటమి భయంతో ఎన్నికలు జరగకుండా కొందరు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.  ఎన్నికల నిర్వహణ ప్రారంభమైనందున వెంటనే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, కార్పొరేటర్ గా జిల్లా ప్రణాళిక కమిటీ సభ్యునిగా వివిధ హోదాల్లో పనిచేసిన జేఎల్ మురళి అన్ని వర్గాల మద్దతుతో అనంత టౌన్ బ్యాంక్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు. రాష్ట్ర విభజన తదనంతర పరిణామాలతో టిడిపిలో జేఎల్ మురళి చేరారు. గత టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన  జేఎల్ మురళి మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల గోదాలో దిగారు. రాయల్ యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా, కాపు యువత రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన జేఎల్ ముర

గురువు శవపేటిక మోసిన ఉత్తర కొరియా అధ్యక్షుడు

Image
సియోల్, త్రిశూల్ న్యూస్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్‌ ఉన్ గురువు కొరియన్‌ పీపుల్స్‌ ఆర్మీ మార్షల్‌ హ్యోన్‌ చొల్‌ హయే అనారోగ్య కారణాలతో మృతి చెందారు. దాంతో ఆయన అంత్యక్రియాల్లో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురువు శవపేటికను ఆయన మోశారు. అందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా విడుదలయ్యాయి. కిమ్ జాంగ్‌-2 మరణం అనంతరం కిమ్ జాంగ్ ఉన్‌ను అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడంలో కొరియన్‌ పీపుల్స్‌ ఆర్మీ మార్షల్‌ హ్యోన్‌ చొల్‌ హయే కీలక పాత్ర పోషించారు.

అట్టుడుకుతున్న అమలాపురం..!

Image
- జిల్లా ఎస్పీ వాహనంపై రాళ్లు దాడి - కోనసీమలో అదుపుతప్పిన ఆందోళన.. అమలాపురం, త్రిశూల్ న్యూస్ : కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ కోనసీమ ప్రజలు పోరు బాట పట్టారు. ఆందోళనలో భాగంగా మంగళవారం జిల్లా ఎస్పీ వాహనంపై  ఆందోళన కారులు రాళ్ల వర్షం కురిపించారు. ఆందోళనకారులను చెదరగోడుతున్న క్రమంలో అమలాపురం డిఎస్పీ మాధవ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కోనసీమ రణ క్షేత్రంగా మారింది. ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనంతటికీ కారణం జిల్లా పేరు మార్చడమే. అవును.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వం కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసింది. అంతా సవ్యంగా ఉన్న క్రమంలో.. కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేద్కర్ జిల్లాగా మారుస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇదే కోనసీమ వాసులకు ఆగ్రహం తెప్పించింది. కోనసీమనే ముద్దు.. మరే పేరు వద్దు అంటూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోనసీమ సాధన సమితి గళమెత్తింది. ఈ క్రమంలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. వందల సంఖ్యలో జనాలు

కుప్పంలో మొదలైన జాతర సందడి..!

Image
- అమ్మ వారి విశ్వరూపం చూడడానికి భారీగా తరలి వచ్చిన భక్తులు కుప్పం, త్రిశూల్ న్యూస్ : చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో నెలకొని యుండు శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం అమ్మ వారి విశరూప ప్రదర్శన మొదలైంది. ముందుగా అమ్మవారిని ఆలయం నుండి పట్టణంలోని చెరువు కట్టపైకి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడి కోనేటి వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి కళ్ళకు కట్టిన తెరను తొలగించడంతో అమ్మవారి విశ్వరూప ప్రదర్శన ప్రారంభమైంది. అమ్మవారి విశ్వరూపాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అమ్మవారికి పొట్టేళ్ళు, కోళ్లు, మేకలు బలి ఇచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు.

ఉచితాలు దండగయ్యా...!

Image
- కష్టం చేసుకునే వారికే డబ్బులు అందాలి - పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డికి మహిళలు మొర  నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :  నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి చేపట్టిన పవనన్న ప్రజాబాట ఎనిమిదో రోజున మైపాడు రోడ్డు ప్రాంతంలోని రామిరెడ్డి కట్టెల దొడ్డి రోడ్డు, పుట్ట సెంటర్లో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఈ ప్రాంతంలోని ప్రజలు ముఖ్యంగా మహిళలు తమ సమస్యలు, బాధలు చెప్పుకున్నారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం పథకాల పేరు చెప్పి ఉచితంగా డబ్బులు పంచుతోందని, దీని కారణంగా అనేకమంది సోమరిపోతులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో కష్టపడి పని చేసేవారు తగ్గిపోతున్నారని, ప్రొడక్టివిటీ దెబ్బతింటోందని కేతం రెడ్డి ద్రుష్టికి పలువురు మహిళలు తీసుకువచ్చారు. పథకాల పేరుతో డబ్బులు మంచిదేనని, కాకపోతే ఆ డబ్బులు సరైన లబ్ధిదారులకు చేరాలని, అలా కాకుండా వేలాది కోట్ల రూపాయలు పక్కదారి పడుతున్నాయని విమర్శించారు. ఉదాహరణకు టైలరింగ్ పేరుతో టైలర్లు కాని వారందరూ డబ్బులు పొందుతున్నారని, ఆ డబ్బులు వృ

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

Image
గుంటూరు, త్రిశూల్ న్యూస్ : గుంటూరు సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందింది. మంగళవారం ఉదయం గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని కేకేఆర్ ధియేటర్ సమీపంలో చిలకలూరిపేట వైపు నుంచి వస్తున్న కార్ టైర్ పంచర్ అవడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో కారు నుజ్జు నుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న యువతి మరణించింది. కారునడుపుతున్న వ్యక్తికిస్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.