Posts

Showing posts from January, 2023

బాధితునికి నిత్యావసర సరుకులు అందజేత..!

Image
- నిత్యావసర సరుకులు అందజేసిన రాజంపేట జనసేన నాయకులు  సిద్ధవటం, త్రిశూల్ న్యూస్ :  రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై మంచం పట్టిన బాధితుడు శ్రీరామదాసు బాలయానాది అనే బాధితుడికి రాజంపేట జనసేన పార్టి అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ సహకారంతో రాజంపేట జనసేన నాయకులు ఆదివారం నిత్యావసర సరుకులు అందజేశారు. ఈమేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సిద్ధవటం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన బాలయానాది తన కుమారుడుతో కలసి ద్విచక్ర వాహనంలో మాధవరం వెళుతుండగా అదుపుతప్పి ద్విచక్ర వాహనం బోల్తా పడడంతో బాలయ్య నాదికి కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. ఈయన చేనేత కార్మికుడు కావడంతో పనులు చేయలేక మంచానికే పరిమితమయ్యారన్నారు. సమాచారం తెలుసుకున్న రాజంపేట జనసేన నాయకులు బాలయానాదిని పరామర్శించి అతని కుటుంబానికి బియ్యము నిత్యావసర సరుకులు అంద జేశారు. ఈకార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, భాస్కర్ పంతులు, వెంకటయ్య, తాళ్లపాక శంకరయ్య, వీరాచారి, జనసేన యవనాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు పాల్గొన్నారు.

యువగళం పాదయాత్రలో విషాదం.. హీరో తారకరత్నకు తీవ్ర అస్వస్థత..!

Image
కుప్పం, త్రిశూల్ న్యూస్ : కుప్పంలో నారా లోకేష్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకత్న తీవ్ర అస్వస్థతకు గురై సృహతప్పి వాహనం పైనుంచి పడిపోయారు. దీంతో వెంటనే ఆయన్ను కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించారు. కుప్పం సమీపాన ఉన్న లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం లోకేష్ పాదయాత్ర మొదలైంది. అనంతరం కొద్దిదూరం నడిచిన తర్వాత మసీదులో లోకేశ్‌ ప్రార్థనలు చేశారు. మసీదు నుంచి బయటకు వచ్చే సమయంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానుల పెద్ద ఎత్తున రావడంతో ఆ తాకిడికి తారకరత్న సృహతప్పి పడిపోయారు. కుప్పంలోని కెసి ఆసుపత్రికి తారకత్నను తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. నందమూరి బాలకృష్ణ ఆసుపత్రికి చేరుకొని తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిలకడగా తారకరత్న ఆరోగ్యం..! తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆయనకు ప్రథమ చికిత్స అందించిన కేసీ ఆస్పత్రి వైద్యులు స్పందించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేరికి ఆయన స్పృహలో లేరని..పల్స్ రే

నారా లోకేష్ "యువగళం" మొదలు..!

Image
- కుప్పంలో కదంతొక్కుతున్న తెలుగు తమ్ముళ్ళు కుప్పం, త్రిశూల్ న్యూస్ : తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో కుప్పం పట్టణం సందడిగా మారింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గం నుంచి 'యువగళం' పేరిట నారా లోకేశ్‌ 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.కాగా తాజాగా శుక్రవారం ఉదయం సరిగ్గా 11.03 గంటలకు కుప్పం వరదరాజస్వామి ఆలయం వద్ద నుంచి తొలి అడుగువేశారు. పాదయాత్ర సందర్భంగా తొలి రోజు జరిగే పూజా కార్యక్రమం, బహిరంగ సభకు బాలకృష్ణతో పాటు పలువురు కుటుంబ సభ్యులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు మహిళలు తిలకం దిద్ది, అభినందనలు తెలియజేశారు. యాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆకాంక్షించారు. స్థానిక వరదరాజుల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం తన పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. తొలి రోజున ఆయన పాదయాత్ర 8.5 కిలో మీటర్ల మేర కొనసాగనుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కుప్పం కమతమూరు రోడ్డులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని తెదేపా నాయకులు, కార్యకర్తలు వేల

టిడిపికి యువగళం పాదయాత్ర జీవన్మరణం..!

Image
- యువగళంతో చాలా నోళ్లు మూయించాలి కుప్పం, త్రిశూల్ న్యూస్ : తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికలు జీవన్మరణ సమస్య. ఆ పార్టీ భవిష్యత్తుకు క్రియాశీలకం. అధికారం రాకపోతే మనుగడే ప్రశ్నార్థకం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకోవాలి. ఏమాత్రం ఏమరపాటు ప్రదర్శించినా భవిష్యత్ అగమ్యగోచరం. ఇలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ పాదయాత్రను చేపట్టారు. పార్టీ బాధ్యతను భుజానికెత్తుకున్నారు. నారా లోకేష్ పాదయాత్ర నేడు కుప్పంలో ప్రారంభమవుతుంది. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుంది. ఒక్కో నియోజకవర్గంలో మూడు రోజుల పాదయాత్ర ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. నియోజకవర్గానికి ఓ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. 125 నియోజకవర్గాలకు పైగా పాదయాత్ర సాగుతుంది. ఇప్పటికే శ్రీవారి దర్శనాన్ని పూర్తీ చేసుకుని నారాలోకేష్ కుప్పం చేరుకున్నారు. ఉదయం 11 గంటల 3 నిమిషాలకు కుప్పం వరదరాజస్వామి ఆలయం నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం తొలి అడుగు పడనుంది. సాయంత్రం కుప్పంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుం

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం.. 20 దుకాణాలు దగ్ధం..!

Image
విజయవాడ, త్రిశూల్ న్యూస్ : ఎన్టీఆర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో ఈ ప్రమాదం సంభవించింది. తిరుపతమ్మ ఆలయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. దాదాపు 50 లక్షల రూపాయల మేరకు ఆస్తి నష్టం సంభవించినట్లు భావిస్తున్నారు. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చునని అధికార వర్గాలు అంటున్నాయి. అర్థరాత్రి జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదంలో 20 దుకాణాలు దగ్ధమయ్యాయి. వచ్చేనెల 5వ తేదీ నుంచి తిరుపతమ్మ పెద్ద తిరునాళ్లు జరగనున్నాయి. ఈ నేపత్యంలో వ్యాపారులు తమ దుకాణాల్లో పెద్ద ఎత్తున వస్తువులను కొని పెట్టారని సమాచారం. 20 దుకాణాల్లోని ఒక్కో దుకాణంలో రూ.2నుంచి రూ.3 లక్షల విలువైన వస్తువులు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సామాగ్రి అంతా అగ్నికి ఆహుతయ్యింది. ఇవన్నీ పూర్తిగా కాలిబూడిదయ్యాయి. మొత్తంగా ఈ అగ్నిప్రమాదంలో రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఘటనా స్థలిని ఆలయ ఈవో, చైర్మన్, తహసీల్దార్ పరిశీలించినట్టు సమాచారం. తిరుపతమ్మ ఆలయం ఆవరణలోని బొమ్మల దుకాణంలో మంటలు అంటుకున్నాయి. వచ్చే నెల 5వ తేద

మన జాతీయ జెండా..!

Image
                       రచన :-                  డా. గొడబ మాలతి                  తెలుగు లెక్చరర్         డా. లంకపల్లి బుల్లయ్య కళాశాల                     విశాఖపట్నం                   9490824860           🙏 మన జాతీయ జెండా 🙏 ప్రపంచ కీర్తి శిఖరాన త్రివర్ణ పతాకంగా రెప రెప ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర జెండా మా ఐక్య జెండా..! ఏళ్ళు నిండినా వయస్సు ముదిరినా  నిను పెంచి నిను మోసి నీ కీర్తి నిలిపిన జాతి నాయకులు కు జేజేలు కొడుతూ...! త్రివర్ణ పతాకంగా మన దేశ ఎర్ర కోటపై ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా మూడు రంగుల జెండా ముచ్చటైనా జెండా..! మూడు లోకాలలో మురిసి వెలిసే జెండా మా ఐక్య జెండా ఈ మూడు రంగుల జెండా ముందు తరాలకు ముచ్చటైనాజెండా..!భావితరాలకు బానిస సంకెళ్లు చేధించే ఈ జాతీయ జెండా నేటి బాలల స్వేచ్చా ఊపిరులు ఊదుతూ రేపటి పౌరులుగా పరుగులు తీస్తూ ప్రజా పాలనే స్వరాజ్యం అంటూ..! త్రివర్ణ పతాకం గా ఎర్ర కోట పై రెప రెప ఎగరాలి ఎగరాలి మన జాతీయ జెండా ఈ మూడు రంగుల జెండా..! భరత మాత పురిటి నొప్పులే ఆర్త నాదాలే సత్యా గ్రహాలుగా నిరాహార దీక్షలే జాతీయోద్యమ పిలుపు రాగాలుగా జాతి పిత అడుగులే మనకు స్వేచ్చా బిడ్డగా మౌంట్ బాటన్

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం..!

Image
తిరుపతి, త్రిశూల్ న్యూస్ : తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్ ను ఢీ కొనడంతో ఘటనా స్ధలంలోనే నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం తిరుపతి - బెంగుళూరు జాతీయ రహదారిలోని కోనంగివారిపల్లె వద్ద తిరుపతి నుండి కాణిపాకంకు వెళ్తుండగా బుధవారం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఐదు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వాహనదారుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని పరిశీలించారు చంద్రగిరి పోలీసులు. క్షతగాత్రులను 108 సహాయంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు చంద్రగిరి పోలీసులు.  అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరు మహారాష్ట్ర చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చిన మహారాష్ట్ర భక్తులు స్వామి వారి దర్శనంతరం కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారి దర్శనార్ధం తిరుపతి నుంచి కాణిపాకం క్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని రుయా ఆసుపత్రి వైద్యులను ఆదేశ

యువగళం పాదయాత్రకు విస్తృత ఏర్పాట్లు.. రాష్ట్రవ్యాప్తంగా శ్రేణుల పూజలు..!

Image
అమరావతి, త్రిశూల్ న్యూస్ : నారా లోకేష్ చేపట్టేబోయే యువగళం పాదయాత్ర ప్రారంభ సభకు టీడీపీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు.. పాదయాత్ర ఎలాంటి అవాంతరాలూ లేకుండా విజయవంతంగా సాగిపోవాలని కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా పూజలు మొదలుపెట్టారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27న చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవానికి పార్టీ శ్రేణులు చకచకా ఏర్పాట్లు చేపడుతున్నాయి. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపడుతున్నారు. కుప్పం పట్టణ పరిధి బైపాస్ రహదారి సమీపంలో కమతమూరు రోడ్డు పక్కన పది ఎకరాల స్థలంలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. దాదాపు రెండు వందల మందికి పైగా టీడీపీ ముఖ్య నేతలు ఆసీనులయ్యే విధంగా వేదికను నిర్మిస్తున్నారు. బహిరంగ సభా స్థలికి సమీపంలోని వాహనాల పార్కింగ్ స్థలాన్ని సిద్ధం చేశారు. లోకేష్ రాకను పురస్కరించుకొని కుప్పం పట్టణంలో పెద్ద ఎత్తున కటౌట్లు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర జిల్లా స్థానిక నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 26న తిరుమలలో దైవ దర్శనం ముగించుకొని లోకేష్ కుప్పం

యువతకు భవితనవుతా.. అభివృద్ధికి వారధిగా నిలుస్తా - నారా లోకేశ్

Image
- యువగళం పాదయాత్రపై ప్రజలకు నారా లోకేష్ లేఖ హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ : యువగళం పేరిట 400 రోజుల సుధీర్ఘ పాదయాత్రకు బయలుదేరిన నారా లోకేశ్‌కు కుటుంబసభ్యులు ఆశీర్వచనం అందించి పంపారు. లోకేశ్‌ బయలుదేరే సమయంలో చంద్రబాబు, భువనేశ్వరి సహా కుటుంబసభ్యులు ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులు అర్పించిన అనంతరం లోకేశ్​ కడప బయలుదేరి వెళ్లారు. పాదయాత్రను విజయవంతం చేయాలని ప్రజలకు లోకేశ్​ బహిరంగ లేఖ రాశారు. యువతకు భవితనవుతా, అభివృద్ధికి వారధిగా నిలుస్తానన్న లోకేశ్.. రైతన్నను రాజుగా చూసే వరకూ విశ్రమించబోనని స్పష్టం చేశారు. 27వ తేదీన కుప్పం నుంచి నారా లోకేష్ ప్రారంభిచనున్న యువగళం పాదయాత్రకు తల్లిదండ్రుల వద్ద నుంచి ఆశీస్సుకు తీుకుని బయలుదేరారు. కుటుంబసభ్యులు, బంధువులు అభినందనలు తెలిపారు. మామ బాలకృష్ణ దగ్గరుండి కారు ఎక్కించారు. పాదయాత్రకు బయలుదేరుతున్న సందర్భంగా ప్రజలకు లోకేష్ బహిరంగలేఖ రాశారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాక్షస పాలన ! విభజన అనంతరం లోటు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాన్ని ఐదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం గాడిలో పెట్టి, నవ్యాంధ్ర నిర్మాణానికి చేసిన కృషి

నారా లోకేష్ పాదయాత్రకు మైలేజ్ ఇచ్చే పనిలో జగన్ సర్కార్..!

Image
అమరావతి, త్రిశూల్ న్యూస్ : వైస్సార్ కాంగ్రెస్ పార్టీ `వై నాట్ 175` అంటోంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ప్రతిపక్షాలంటే హడలిపోతోంది. అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. భయం లేకుంటే అడ్డుకోవడమెందుకు ? బ్రిటీషు కాలం నాటి జీవోలెందుకు ? ప్రజల పై నమ్మకం లేదా ? లేదా తమ పాలనపైనే నమ్మకం లేదా ? ఏపీలోని అధికార పార్టీ తీరుపై సర్వత్రా వ్యక్తమవుతున్న ప్రశ్నలివి. ఏపీలో నారా లోకేష్ పాదయాత్ర జనవరి 27 నుంచి కుప్పంలో ప్రారంభమవుతోంది. 4000 వేల కిలోమీటర్లు.. 400 రోజులు లోకేష్ పాదయాత్ర సాగుతుంది. లోకేష్ పాదయాత్రపై ఏపీ ప్రభుత్వం తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. పాదయాత్ర గురించి ఏపీ పోలీసులు అడిగిన ప్రశ్నలు విడ్డూరంగా ఉన్నాయి. నారా లోకేష్ పాదయాత్రలో ఎవరెవరు పాల్గొంటారు ? ఏ ఊర్లో ఎవరిని కలవబోతున్నారు ? ఎన్ని వాహనాలు వెంట వెళ్తాయి ? వాటి నెంబర్లు ఏంటి ? ఇవీ పోలీసులు అడిగిన ప్రశ్నలు. ఇలాంటి ప్రశ్నలు ఇంకెన్నో. ఏ ఊర్లో లోకేష్ ఎవరిని కలుస్తారో ఇప్పుడే ఎలా చెప్పగలరు. ప్రతి ఊర్లో వందలాది మంది పాదయాత్రకు వస్తారు. వారి సమస్యలు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇదంతా అప్పటికప్పుడు జరుగుతుంది. ముందస్తు ప్

కాళ్లు లేవు.. ఓ అమ్మ అండతో గిన్నిస్‌ రికార్డు బద్ధలు కొట్టిన ఛాంపియన్‌..!

Image
ఒహియో, త్రిశూల్ న్యూస్ : వైకల్యం అనేది మనసుకే కానీ, శరీరానికి కాదని నిరూపిస్తున్నవాళ్లు ఎందరో. కొందరి సంకల్పానికి ఏకంగా ప్రపంచ రికార్డులే బద్ధలు అవుతున్నాయి. ఆ జాబితాకు చెందిన వ్యక్తే జియాన్‌ క్లార్క్‌. కాళ్లు లేకుండా పుట్టాడని తల్లిదండ్రులు నడిరోడ్డు పాలు జేస్తే.. అనాథశ్రమంలో పెరిగి, ఆపై ఓ అమ్మ అండతో ఛాంపియన్‌గా ఎదిగిన పాతికేళ్ల వ్యక్తి కథ ఇది. జియాన్‌కు కాళ్లు లేవు. అందుకే చేతులనే కాళ్లుగా మార్చేసుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా చేతులతో పరిగెత్తిన వ్యక్తిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 20 మీటర్ల దూరాన్ని.. కేవలం 4.78 సెకండ్లలో అదీ చేతులతో పరిగెత్తి చూపించాడు అతను. విశేషం ఏంటంటే.. 2021లోనే అతను ఆ ఘనత సాధించాడట. ఈ విషయాన్ని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు వాళ్లు ట్విటర్‌ ద్వారా వీడియో రూపంలో తెలియజేశారు. క్లార్క్‌ స్వస్థలం ఒహియో స్టేట్‌లోని కొలంబస్‌ ప్రాంతం . వైకల్యంతోనే పుట్టాడతను. దానివల్ల నడుము కింది భాగం ఉండదు. కయుడాల్ రిగ్రెసివ్ సిండ్రోమ్ అనే పరిస్థితి అందుకు కారణం. పుట్టిన వెంటనే అతన్ని తల్లిదండ్రులు వదిలేశారు. దీంతో.. ఒహియోలోనే ఓ ఆశ్రమంలో పెరిగాడు. ఆపై ప

జియాగూడ హత్య కేసు చేధించిన పోలీసులు.. చంపింది స్నేహితులే..!

Image
హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ : నగరంలోని పురానాపూల్ సమీపంలో బైపాస్ రోడ్డుపై ఆదివారం అందరూ చూస్తుండగానే వ్యక్తిని హత్య చేసిన ఘటనలో పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఆకాశ్, టిల్లు, సోనులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నిందితులు ముగ్గురు కలిసి జియాగూడ రోడ్డుపై సాయినాథ్(32) అనే వ్యక్తిని దారుణంగా కత్తులు, ఇనుపరాడ్లతో దాడి చేసి చంపారు. పాత కక్షలే హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణే హత్యకు దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆదివారం సాయంత్రం అంతా చూస్తుండగానే హైదరాబాద్‌లో పూరానాఫూల్ సమీపంలో జియాగూడ బైపాస్ రోడ్డుపై సాయినాథ్ అనే వ్యక్తిని ఆకాశ్, టిల్లు, సోనులు కలిసి దారుణంగా కత్తులతో పొడిచి, ఇనుప రాడ్లతో కొట్టి చంపారు. జియాగూడ బైపాస్ రోడ్డుపై ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అతడ్ని మరో ముగ్గురు తరుముకుంటూ వెళ్లారు. ఒక్కసారిగా చుట్టుముట్టి కత్తులు, వేట కొడవళ్లతో కిరాతంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న కు

నారా లోకేష్ 'యువగళం' పాదయాత్రకు లైన్ క్లియర్..!

Image
అమరావతి, త్రిశూల్ న్యూస్ : టిడీపీ యువ నాయకుడు నారా లోకేష్ చేపట్టబోయే పాదయాత్రకు లైన్ క్లియర్ అయింది. చాలా రోజుల నుండి ఈ పాదయాత్రపై సస్పెన్స్ నెలకొనగా తాజాగా ప్రభుత్వం పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. నిబంధనలకు లోబడే పాదయాత్ర జరగాలని నారా లోకేష్, టీడీపీ క్యాడర్ కు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ సూచించారు. పాదయాత్రలో ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదన్నారు. కాగా ఈనెల 27 నుంచి 'యువగళం' పేరుతో నారా లోకేష్ ఈ పాదయాత్ర చేపట్టనున్నారు.  లోకేష్ పాదయాత్రను ఆపాలనే ఉద్దేశ్యం మాకు లేదు. చట్టం ప్రకారం అందరికీ ఎలా పర్మిషన్ ఇస్తామో లోకేష్ పాదయాత్రకు అలాగే ఇచ్చాం. నిబంధనలకు లోబడే పాదయాత్ర జరపాలని ఎస్పీ సూచించారు. కాగా నారా లోకేష్ పాదయాత్రకు అనుమతి కావాలని ఇప్పటికే టీడీపీ డీజీపీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే గత కొన్నిరోజులుగా పాదయాత్ర పర్మిషన్ పై సస్పెన్స్ నెలకొనగా తాజాగా సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ పాదయాత్ర 400 రోజుల పాటు 4000 వేల కిలోమీటర్ల వరకు.. అంటే కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు నారా లోకేష్ పాదయాత్ర సాగనుంది. ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండేలా లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్ సి

జీవో నెంబర్ 1 పై వెకేషన్ బెంచ్ విచారణ.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!

Image
అమరావతి, త్రిశూల్ న్యూస్ : జీవో నెంబర్ 1పై వెకేషన్ బెంచ్ విచారణ చేయడంపై ఏపీ హైకోర్టు సీజే ధర్మాసనం సోమవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. వెకేషన్ బెంచ్ ముందు ఈ పిటిషన్ ను విచారించడంపై హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు రిజిస్ట్రీ తమకు అన్ని విషయాలను నివేదించినట్టుగా హైకోర్టు వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం. జీవో నెంబర్ 1పై ఏపీ హైకోర్టులో సోమవారం నాడు విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు సీజే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జీవో నెంబర్ 1పై అత్యవసంర లేకపోతే వెకేషన్ బెంచ్ ముందుకు ఎందుకు వచ్చారని హైకోర్టు సీజే ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పిటిషన్ వెకేషన్ బెంచ్ విచారణ చేయడంపై సీజే ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. వెకేషన్ బెంచ్ పరిధి దాటి వ్యవహరించిందని హైకోర్టు అభిప్రాయపడింది. వెకేషన్ బెంచ్ సీజే బుదులుగా పనిచేస్తుందన్న హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. లంచ్ మోషన్ మూవ్ చేయాల్సిన తొందర ఏముందని కూడా ప్రశ్నించింది. ఈ విషయమై ఏం జరుగుతుందో తమకు అంతా తెలుసునని కూడా ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ కు బెనిఫిట్ చేయడానికి కాకపోతే తొందర ఏమొచ్చిందని కూడా వ్యాఖ్యానించ

సత్యవేడులో రెచ్చిపోతున్న "లెడ్" మాఫియా అక్రమార్కులు..!

Image
- గ్రామశివార్లలో అక్రమకార్యకలాపాలు - పల్లెలపై కాలుష్య నీలినీడలు.. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం - మాముళ్ళ మత్తులో అక్రమార్కులకు కొమ్ము కాస్తున్న యంత్రాంగం  సత్యవేడు, త్రిశూల్ న్యూస్ (బి.వెంకటేష్): గ్రామీణ ప్రాంతాల శివార్లను స్థావరాలుగా మలుచుకుని లెడ్ మాఫియా అక్రమార్కులు రెచ్చిపోతున్న ఘటనలు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో నెలకొని ఉన్నాయి. ఇటీవల వరదయ్యపాళెం మండలంలోని చెంచురాజుల కండ్రిగలో ఈ లెడ్ మాఫియా ఆగడాల ఉదంతం బయటపడగా.. అదే తరహాలో సత్యవేడు మండలంలోని చెన్నేరి గ్రామంలో వెలుగుచూడగా, మరింకెక్కడెక్కడ ఇలాంటి కార్యకలాపాలు సాగుతున్నాయో తెలియాల్సి ఉంది. తమిళనాడులోని పరిశ్రమల నుంచి వ్యర్థాలను సేకరించి వాటిని వివిధ పద్ధతుల్లో జింక్, లెడ్ ముడిసరుకుగా తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో విడుదలవుతున్న విషవాయువులు, రసాయన జలాలను విచ్చల విడిగా వదిలేయడంతో పల్లెలపై కాలుష్య నీలి నీడలు అలుముకుంటున్నాయి. ఈ పరిస్థితుల ఇలానే కొనసాగితే ప్రజల ఆరోగ్యం పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ తరయారవుతున్న జింక్, లెడ్ ముడిసరుకును గృహోపకరణాల తయారీలో విరివిగా వాడుతుండ

ఓటుకు రూ.6 వేలు ఇస్తాను.. పబ్లిక్‭గా ప్రకటించిన బీజేపీ ఎమ్మెల్యే..!

Image
సులేబావి, త్రిశూల్ న్యూస్ : రాజకీయాల్లో డబ్బులు, బహుమతులు పంచడం లాంటివి అత్యంత సాధారణ విషయం. అన్నీ కళ్ల ముందే ఉన్నప్పటికీ ఈ విషయం గురించి ఏ రాజకీయ పార్టీ బయటికి మాట్లాడదు. మహా అయితే ఇతర పార్టీల మీద ఇలాంటి విమర్శలు చేస్తారేమో కానీ, తాము పంచినట్లు బయటికి చెప్పరు. ఎప్పుడో ఏదో సందర్భంలో ఈ విషయమై కొందరు నేతలు నోరు జారుతుంటారు. కానీ వెంటనే తమ మాటల్ని ఎవరో వక్రీకరించారంటూ నాలిక కరుచుకుంటారు. అచ్చం ఇలాంటి వ్యాఖ్యలే కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రమేష్ జర్కిహోళి చేశారు. కానీ మిగతా వారిలాగ నోరు జారి వ్యాఖ్యానించారని చెప్పలేం. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు ఆయన నిండు బహిరంగ సభలో చేశారు. పైగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి 3 వేల రూపాయలు బహుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలను ప్రస్తావిస్తూ తాను డబుల్ ఇస్తానని రమేశ్ వాగ్దానం చేయడం గమనార్హం. రాష్ట్రంలోని సులేభావి ప్రాంతంలో బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న నగేశ్ మన్నోల్కర్ అనే వ్యక్తి ఏర్పాటు చేసిన సమావేశంలో రమేష్ జర్కిహోలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''మా ప్రత్యర్థి అభ్యర్థి 70 రూపాయల విలువైన డబ్బా, 700 రూపాయల ప్రెషర్ కుక్కర

తొమ్మిదో తరగతి విద్యార్థినికి కడుపునొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రసవం..!

Image
వాల్మీకిపురం, త్రిశూల్ న్యూస్ : అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో తొమ్మిదివ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ప్రసవించింది. హాస్పిటల్‌లో మగ బిడ్డకు జన్మనిచ్చింది. పాఠశాలలో చదువుతున్న 14 ఏళ్ల అమ్మాయి ప్రసవించడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అధికారుల పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యం బాలికలో మార్పులు ఎందుకు గుర్తించలేకపోయిందన్న అంశంపై వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఆ అమ్మాయి గర్భవతి అవ్వడానికి కారణం ఎవరో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం చెందిన బాలిక వాల్మీకిపురం జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో ఆరో తరగతిలో చేరింది. ప్రస్తుతం విద్యార్థిని తొమ్మిదో తరగతి చదువుతోంది. శనివారం మధ్యాహ్నం తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో.. వెంటనే హాస్టల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. విద్యార్థినిని వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్లు స్కాన్ చేసి ప్రెగ్నెంట్ అని నిర్ధారించగా.. గంటల వ్యవధిలోనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఎమ్మార్వో, ఎస్సై హాస్పిటల్‌కి చేరుకుని బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు

హైదరాబాద్‌లో దారుణం.. నడిరోడ్డుపై వెంటాడి, వేటాడి నరికేశారు..!

Image
హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ : జియాగూడలో ముగ్గురు వ్యక్తులు కత్తులు, వేట కొడవళ్లతో స్వైరవిహారం చేశారు. ఓ వ్యక్తిని నడిరోడ్డుపై వెంటాడి, వేటాడి మరీ నరికి చంపారు. ఆదివారం సాయంత్రం అందరూ చూస్తుండగానే హైదరాబాద్‌లోని పురానాపూల్‌ సమీపంలో జియాగూడ బైపాస్‌ రోడ్డుపై ఈ దారుణ ఘటన జరిగింది. జియాగూడ బైపాస్‌ రోడ్డుపై ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్తున్నాడు.. అతన్ని మరో ముగ్గురు తరుముకుంటూ వచ్చారు. ఒక్కసారిగా చుట్టుముట్టి కత్తులు, వేట కొడవళ్లతో అత్యంత కిరాతకంగా హత్య చేశారు.సమాచారం తెలుసుకున్న కుల్సుంపుర పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతుడి ఆధార్‌ కార్డు వివరాల ప్రకారం.. కోఠి ఇస్తామియా బజార్‌కు చెందిన జంగం సాయినాథ్‌(32)గా పోలీసులు గుర్తించారు. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిందితులు ఎవరు? ఎందుకు అతన్ని హత్య చేశారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు హత్య చేసి పక్కనే ఉన్న మూసీ నదిలో దూకి పారిపోయినట్లు స్థానికులు చెప్పారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు కుల్సుంపుర సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు. హత్య జరిగిన సమయంలో

సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి..!

Image
బళ్లారి, త్రిశూల్ న్యూస్ : టాలీవుడ్ ఫేమస్ సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగింది. కర్ణాటకలోని బళ్లారిలో ఈ ఘటన జరిగింది. బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో జరిగిన బళ్లారి ఫెస్టివ్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా.. ఆమె కారుపై కొందరు వ్యక్తులు రాళ్లదాడి చేశారు. ఈ వేడుకకు సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొదటి రోజు వేడుకల్లో భాగంగా.. సింగర్ మంగ్లీ, కొంతమంది గాయకులు పాల్గొన్నారు. ప్రొగ్రామ్ ముగించుకుని వస్తున్న గాయని మంగ్లీ కారుపై కొంతమంది రాళ్ల దాడి చేయడం కలకలం రేపింది. బళ్లారి ఉత్సవ కార్యక్రమంలో సింగర్ మంగ్లీ స్టేజ్ పై పాటలు పాడింది. తిరిగి వెళ్లేటప్పుడు ఆమెను చూసేందుకు స్థానిక యువకులు ముందుకొచ్చారు. వేదిక వెనక ఉన్న మేకప్ టెంట్ లోపలికి ప్రవేశించారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యి వారిని అడ్డుకన్నారు.

నెల్లూరులో విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు మృతి..!

Image
నెల్లూరు, త్రిశూల్ న్యూస్ : రైలు ఢీకొని ముగ్గురు దుర్మరణం చెందారు. నెల్లూరు జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద నున్న రైల్వే బ్రిడ్జిపై ఇద్దరు పురుషులు, ఒక మహిళ వస్తుండగా- గూడూరు వైపు నుంచి విజయవాడ వెళుతున్న నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో ఇద్దరు పురుషులు రైలు పట్టాలపైనే మృతి చెందగా.. మహిళ పట్టాల పై నుంచి కిందపడి చనిపోయారు. ముగ్గురూ 45- 50 ఏళ్లలోపు వారే. వారి చేతుల్లో సంచులు ఉన్నాయి. కొందరు ప్రత్యక్ష సాక్షులు మాత్రం పురుషులు రైలు పట్టాల పక్కన ఉండగా.. మహిళ పట్టాలపై ఉన్నారని.. ఆమెను తప్పించబోయి.. వారు కూడా మృత్యువాత పడ్డారని చెబుతున్నారు. సమాచారం అందుకున్న రైల్వే, సంతపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు. లభ్యమైన సంచులను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారా? బంధువులానేది తెలియాల్సి ఉంది. సంచుల్లో తితిదే లాకర్‌ అలాట్‌మెంట్‌ టిక్కెట్టు ఉన్నట్లు గుర్తించారు. దాంతో పాటు ఒక ఫోన్‌ నంబరు కూడా ఉందని తెలిసింది. ఫ

గుడుపల్లెలో 6వాలంటీర్ పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం..!

Image
గుడుపల్లె, త్రిశూల్ న్యూస్ : గుడుపల్లె మండలంలో వివిధ గ్రామ పంచాయితీలలో ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ జయశంకర్ ఓ ప్రకటనలో కోరారు. శెట్టిపల్లె 01, కంచిబందార్లపల్లి 02, యమగానిపల్లె 01, కొడతనపల్లె 01, సోడిగానిపల్లె 01 గ్రామపంచాయతీలలో వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 25 తేదీ లోపు అర్హత కలిగిన అభ్యర్థులు ప్రభుత్వ వెబ్ సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 30,31న మౌఖిక పరీక్ష నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ ఓ ప్రకటనలో తెలిపారు.

శ్రీవారి ఆలయంపై ఎగురుతున్న డ్రోన్లు.. ఇదిగో సాక్ష్యం అంటున్న స్థానికులు..!

Image
తిరుమల, త్రిశూల్ న్యూస్ : కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగిరినట్లు ఆధారాలు లభించాయి. ఆస్థాన మండపం నుంచి డ్రోన్లు ఎగురవేసినట్లు గుర్తించిన స్థానికులు దాన్ని వీడియో తీశారు. ఏకంగా శ్రీవారి ఆలయాన్నే డ్రోన్‌ ఆపరేటర్‌ వీడియో తీసినట్లు గుర్తించారు. పవిత్ర శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగురవేసిన సంఘటన కలకలం రేపుతోంది. డ్రోన్‌ ఎందుకు ఎగురవేశారు..? ఇందులో ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో ఎంక్వైరీ ప్రారంభించింది టీటీడీ. నో ఫ్లయింగ్ జోన్‌లోకి డ్రోన్స్‌ ఎలా వచ్చాయంటూ ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే సెక్యూరిటీ వైఫల్యంపై ఫోకస్ పెచ్చింది. డ్రోన్‌ కెమెరా దృశ్యాలపై భిన్న కోణాల్లో టీటీడీ విచారిస్తోంది. గతేడాది నవంబర్‌లో డ్రోన్ కెమెరాతో కాకులకోన సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ చిత్రీకరించారు. ఆ సమయంలో ఆనంద నిలయం ఏరియల్ వ్యూ తీసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లోనే డ్రోన్ విజువల్స్ తీయించినట్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమశాస్త్రం నిబంధనల ప్రకారం ఆనంద నిలయ గోపురంపై విమానాలు, డ్రోన్లు తిరగడం నిషేధం. ఈ క్రమంలో సోషియల్ మీడ

పుంగనూరు రామచంద్రయాదవ్‌కు వై+ కేటగిరి భద్రత..!

Image
పుంగనూరు, త్రిశూల్ న్యూస్ : పుంగనూరు పారిశ్రామిక వేత్త రామచంద్రయాదవ్‌కు వై+ కేటగిరి భద్రత కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ఢిల్లీ నుంచి రేపు పుంగనూరుకు చేరుకోనున్నారు భద్రతా సిబ్బంది. ఆంధ్రప్రదేశ్‌లోని పుంగనూరు నియోజకవర్గంలో వివిధ రంగాల రైతులకు జరుగుతున్న అన్యాయాలు, దోపిడీలు, సమస్యలపై సదుంలో రామచంద్రయాదవ్ ఏర్పాటు చేసిన రైతు భేరి బహిరంగసభను అనుమతి లేకపోవడంతో అడ్డుకున్నారు పోలీసులు. అదే రోజు రాత్రి తన ఇంటిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు 300 మంది దాడికి పాల్పడి.. తన కుటుంబంపై హత్యాయత్నానికి పాల్పడ్డారని.. ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు రామచంద్ర యాదవ్. ఆ సమయంలో కేంద్ర బలగాలతో రామచంద్రయాదవ్‌కు రక్షణ కల్పిస్తానని భరోసా ఇచ్చిన అమిత్‌షా.. 10 రోజుల్లోనే హోంశాఖ ద్వారా వై+ కేటగిరి భద్రత మంజూరు చేశారు. తనకు వై+ కేటగిరి భద్రత కేటాయించినందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు రామచంద్ర యాదవ్. అయితే రామచంద్రయాదవ్‌ 2019లో జనసేన పార్టీ అభ్యర్థిగా పుంగనూరులో పోటీ చేసి ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్న

శ్రీవారి ఆలయం వీడియోను ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు - టిటిడి

Image
తిరుమల, త్రిశూల్ న్యూస్ : శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి రాబోవు రెండు, మూడు రోజులలోపు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం బయట టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంపైన ఎలాంటి విమానాలు, డ్రోన్లు తిరిగేందుకు అవకాశం లేదని, ఆగమ శాస్త్రాల ప్రకారం నిషేధించబడిందని తెలిపారు. ఇంతకుముందు కానీ, ఇటీవల కాలంలో కానీ ఇలాంటి సంఘటనలు జరగలేదన్నారు. తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య వున్న శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం సాధ్యం కాదన్నారు. హైదరాబాద్ కు చెందిన ఒక సంస్థ సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రసారం చేస్తోందని టిటిడి విజిలెన్స్ మరియు భద్రతాధికారులు గుర్తించినట్లు చెప్పారు. ఇప్పటికే ఆ సంస్థకు చెందిన వ్యక్తులను పోలీసులు కస్టడీలోనికి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో డ్రోన్ ద్వారా చిత్రించారా లేక పాత ఫోటోలను మార్ఫింగ్ చేసి 3డి విధానంలోకి మార్చారా అనేది ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా తెలుస్తుందన్నారు.

జగనన్న కాలనీ పనులు వేగవంతం చేయండి - నెల్లూరు కమిషనర్ హరిత

Image
నెల్లూరు, త్రిశూల్ న్యూస్ : నవరత్నాలు పధకంలో భాగంగా పేదలందరికీ శాశ్వత గృహ వసతి కల్పించే దిశగా రూపొందిస్తున్న జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ హరిత ఆదేశించారు. శనివారం హౌసింగ్ డే సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక వెంకటేశ్వరపురంలోని జగనన్న కాలనీ లే అవుట్ ను కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లబ్ధిదారుల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న గృహాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. సచివాలయ అమెనిటీస్ కార్యదర్శులు లే అవుట్ల నిర్మాణ పనుల్లో లక్ష్యాలను నిర్దేశించి అభివృద్ధి పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యుత్తు, వీధి దీపాలు, మంచినీరు, డ్రైన్లు, రోడ్డు మార్గాలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించి లబ్ధిదారులకు గృహాలను కేటాయించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ డి.ఈ దయాకర్, ఏ.ఈ లు పాల్గొన్నారు. అనంతరం స్థానిక 54వ డివిజన్ 54/4 భగత్ సింగ్ కాలనీ వార్డు సచివాలయాన్ని కమిషనర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ సంక్షేమ పథకాల రికార్డులను పరిశీలించారు. ఆస్థి పన్ను, యూజర్ చార్జీల వసూళ్ళను స