Posts

Showing posts from November, 2022

ప్రమాదం జరిగింది ఎస్ఐ వల్లనే..?

Image
- యువతి మృతి కేసులో సంచలన విషయాలు సింగరాయకొండ, త్రిశూల్ న్యూస్ : ఏపీలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పలుకూరు దగ్గర ఈనెల 27న రోడ్డు ప్రమాదం జరిగింది. అందరూ అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్‌ అనుకున్నారు. కానీ గంటలు గడిచేకొద్ది నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలే ప్రధాన రహదారి.. అన్ని వాహనాలు రయ్ రయ్‌ మంటూ దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో AP 39 KK 444 నంబర్‌ ఉన్న కారు మాత్రం ఓ చెట్టును బలంగా ఢీకొట్టింది, స్పీడ్‌ ధాటికి ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారే ఈ రేంజ్‌లో డ్యామేజ్‌ అయిందంటే.. లోపల ఉన్న వాళ్ల సంగతేంటి? అనుకున్నారంతా.. కానీ కారులో ఉన్నది ఇద్దరే ఇద్దరు. వారిలో ఒకరు తీవ్రగాయాలతో చనిపోయారు.. మరొకరు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ప్రమాదం నార్మల్‌గా జరిగిందా? ఇంకేదైనా కోణం ఉందా? అని ఆరా తీయగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏపీలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పలుకూరు దగ్గర ఈనెల 27న రోడ్డు ప్రమాదం జరిగింది. అందరూ అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్‌ అనుకున్నారు. కానీ గంటలు గడిచేకొద్ది నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రిలో చికిత్స ప

కబడ్డీ ఆడుతూ కింద పడ్డ మంత్రి రోజా..!

Image
నగరి, త్రిశూల్ న్యూస్ : చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో జగనన్న క్రీడా సంబరాలను మంత్రి రోజా సోమవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి పలు క్రీడలను ఆడారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ ఆడి విద్యార్థులను మంత్రి రోజా ప్రోత్సహించారు. ఈ పోటీలలో కుప్పం, పలమనేరు, పుంగనూరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. అయితే కబడ్డీ ఆడుతూ ఆమె కిందపడిపోవడంతో ఒక్కసారిగా అధికారులు, అక్కడున్న వాళ్లంతా ఉలిక్కి పడ్డారు. కూతకు వెళ్లిన మంత్రి రోజాను అమ్మాయిల జట్టు టాకిల్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె వెళ్లకిలా కిందపడిపోయారు. ఆమెపై విద్యార్థులు పడిపోయారు. దీంతో అందరూ కంగారుపడ్డారు. అయితే తనకు ఏమీ కాలేదని, కంగారుపడాల్సిన అవసరం లేదని రోజా వారికి సర్దిచెప్పారు. కాగా డిసెంబర్ 21న సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా పలు పోటీలను నిర్వహిస్తున్నామని.. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మట్టిలో మాణిక్యాలు వెలికి తీసేందుకు ఇది గొప్ప అవకాశమని మంత్రి రోజా అభిప్రాయపడ్డారు. యువతకు చదువుతో పాటుగా క్రీడలు కూడా అవసరమన్నారు. క్రీడాకారులు గ్రామ సచివాల

నా పాదయాత్ర అడ్డుకునేందుకు కెసిఆర్ కుట్ర - షర్మిల

Image
వరంగల్, త్రిశూల్ న్యూస్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తన పాదయాత్రను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించి, తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారన్నారు. తాను బసచేసే బస్సుకు నిప్పు పెట్టారని, వాహనాలు ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆపబోమని షర్మిల స్పష్టం చేశారు. కాగా షర్మిల చేస్తున్న పాదయాత్రలో పోలీసులు భారీగా మోహరించారు. ఆమెను ఏక్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. షర్మిల పాదయాత్రలో ముగ్గురు ఏసీపీలు, ఆరుగురు సీఐలు, పది మంది ఎస్ఐలు, 120 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. నిన్న (ఆదివారం) నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో నర్సంపేటలో ఉద్రిక్తత నెలకొంది.

రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా - సుప్రీం

Image
న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఆ తీర్పులో మరికొన్ని అంశాలు జోడించాలని వాటికి కూడా న్యాయం చేయాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్‌ కె.ఎం జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి. నాగరత్నలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. తొలుత వాదనలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదిపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. రాష్ట్ర ప్రభుత్వం ముందు పలు ప్రశ్నలు ఉంచగా.. అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ''పార్లమెంట్‌ చేసిన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్చగలదా? అలాంటి పరిస్థితి ఉందా? రాష్ట్ర విభజన చట్టంలో 'ఒక రాజధాని' అని మాత్రమే ఉంది. కానీ, పలు భాష్యాలు తీసుకోవాలని ఎక్కడా రాసి లేదు కదా? పార్లమెంట్‌లో చేసిన చట్టాన్ని సవరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సూచనల ప్రకారం తీసుకున్న రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా? అమరావతిలో రూ.వేల కోట్ల పెట

మహిళలు బట్టలు లేకున్నా బాగుంటారు - బాబా రాందేవ్

Image
ముంబై, త్రిశూల్ న్యూస్ : యోగా గురు బాబా రాందేవ్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి నాలుక కరుచుకున్నారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారడంతో క్షమాపణ చెప్పారు. మహారాష్ట్రలోని థానేలో ఏర్పాటు చేసిన యోగా క్యాంప్‌లో ఆదివారం నాడు మాట్లాడిన బాబా రాందేవ్ మహిళల వస్త్రధారణపై సరదా వ్యాఖ్యలు చేయాలని భావించి అనుచిత వ్యాఖ్యలు చేసి అభాసుపాలయ్యారు. మహిళలు చీరలో, సల్వార్ సూట్స్‌లో చూడ చక్కగా ఉంటారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్లో వివాదం ఏం లేనప్పటికీ ఆపై చేసిన వ్యాఖ్య పెను దుమారం రేపింది. మహిళలు ఏం ధరించకపోయినా కూడా బాగుంటారని బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. నెటిజన్లు కూడా రాందేవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహారాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ కాపీని మహారాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్ రూపాలి చకంకర్ ట్వీట్ చేశారు. బాబా రాందేవ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, ఆయన చేసిన దిగజారుడు వ్యాఖ్యలపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆమె ట్వీట్ చేశారు. రాందేవ్ వ్యాఖ్యలను ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ కూడా ఖండించారు. మహారా

శ్రీ‌వారి ఆల‌యం నుండి శ్రీ పద్మావతి అమ్మవారికి సారె..!

Image
తిరుమల, త్రిశూల్ న్యూస్ :  తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె స‌మ‌ర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు. ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుండి పరిమళాన్ని (నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంలో ఊరేగింపు చేప‌ట్టారు. అనంత‌రం శ్రీవారి వక్ష:స్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వ‌హించారు. ఆ త‌రువాత ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణంతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది. ఈ సారెను గజాలపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ్లారు. అక్క‌డినుండి కోమ‌ల‌మ్మ స‌త్రం, శ్రీ కోదండరామాలయం, శ్రీ గో

పూలే దంపతులకు నివాళులు అర్పించిన కమిషనర్ హరిత..!

Image
నెల్లూరు, త్రిశూల్ న్యూస్ : ప్రముఖ సంఘ సంస్కర్తలైన మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని పూలే దంపతుల విగ్రహాలకు నగర పాలక సంస్థ కమిషనర్ హరిత సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దేశంలోని నిమ్న వర్గాల ప్రజలకు అందరితో సమాన హక్కులు కల్పించేందుకు పూలే దంపతులు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. మహిళల విద్యకోసం వారు అమలుచేసిన విధానాలతో సమాజంలో చైతన్యం పెరిగిందని కమిషనర్ వెల్లడించారు. ప్రతీ ఏటా పూలే దంపతుల సంఘ సేవలను గుర్తుచేసుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అని వివరించారు. 

వాణిజ్య ప్రకటనలపై పన్నుల వసూళ్లు పెంచండి - కమిషనర్ హరిత

Image
నెల్లూరు, త్రిశూల్ న్యూస్ : నగర వ్యాప్తంగా ఉన్న ప్రకటన హోర్డింగ్స్ లపై ప్రత్యేక దృష్టి సారించి యాడ్ ఏజెన్సీల నుంచి నిర్దేశించిన పన్నులను వసూలు చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ హరిత టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన స్పందన వేదికలో కమిషనర్ పాల్గొని ముందుగా డయల్ యువర్ కమిషనర్ ద్వారా 17 ఫిర్యాదులను అందుకున్నారు. అనంతరం ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకు సంబంధిత విభాగాలకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని ప్రాంతాల్లో వాణిజ్య ప్రకటనలను గుర్తించి రెవెన్యూ వసూళ్లను పెంచాలని సూచించారు. ప్రతి ఒక్క నోడల్ అధికారీ సంబంధిత సచివాలయాలను సందర్శించి పనితీరును పరిశీలించాలని కమిషనర్ ఆదేశించారు. సచివాలయ కార్యదర్శుల విధి నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు తీరును నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు. నిర్దేశించిన గడువు దాటినప్పటికీ నగర పాలక సంస్థలోని కొన్ని విభాగాల్లో స్పందన ఫిర్యాదులు ఇంకా పెండింగులో ఉన్నాయని, సూచించిన గడువులోపు పరిష్కరించాలని కమిషనర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. స్పంద

ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా పిటి. ఉష..!

Image
- పరుగుల రాణి పీటీ ఉషకు అరుదైన గౌరవం.. న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ : కేరళలో బలం పెంచుకోవడంపై ఫోకస్ పెట్టిన బీజేపీ.. ఆ రాష్ట్రానికి చెందిన పీటీ ఉషను 2022 జులై ఆరంభంలో రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్ చేసింది. తాజాగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అంతేకాదు ఆమె ఏకగ్రీవంగా ఆ పదవికి ఎన్నిక కాబోతున్నారు. 95 ఏళ్ల ఐఓఏ చరిత్రలో ఓ మహిళ ఈ బాధ్యతలను చేపట్టబోతుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పరుగుల రాణి పీటీ ఉషకు అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. 95 ఏళ్ల ఐఓఏ చరిత్రలో ఓ మహిళ అధ్యక్ష పదవిని చేపట్టనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. జాతీయ ఒలింపిక్ సంఘం హెడ్‌గా వ్యవహరించనున్న తొలి ఒలింపియన్‌, అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారిణిగానూ ఉష రికార్డ్ క్రియేట్ చేయనున్నారు. ఐఓఏ అధ్యక్ష పదవికి డిసెంబర్ 10 ఎన్నికలు జరగనుండగా.. 58 ఏళ్ల ఉష మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. శుక్ర, శనివారాల్లో అధ్యక్ష పదవి కోసం ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదని రిట్నరింగ్ ఆఫీసర్ ఉమేశ్ సిన్హా తెలిపారు. ఆఫీస్ బేరర్ల పోస్టు

మహిళల్లో విద్యా చైతన్యం తెచ్చింది మహాత్మ జ్యోతిరావు పూలే - ఎన్ఇపి

Image
- న్యూ ఇండియా పార్టీ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి రామగుండం, త్రిశూల్ న్యూస్ : మహాత్మ జ్యోతిరావు పూలే మహిళ లో విద్యా చైతన్యం తెచ్చిన వారి సామాజిక దృక్పథం చాలా గొప్పది అని న్యూ ఇండియా పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి అన్నారు . మహాత్మ జ్యోతిరావు పూలే 133వ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం ఎన్ టిపిసి అన్నపూర్ణ కాలనీలో జరిగిన పూలే వర్ధంతి సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి మాట్లాడారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే 11 ఏప్రిల్ 1827 జన్మించి 28 నవంబర్ 1890 న తుది శ్వాస విడిచారు అని అన్నారు. ఒక గొప్ప భారతీయ సామాజిక కార్యకర్త, ఆలోచనాపరుడు, కుల వ్యతిరేక సంఘ సంస్కర్త మరియు మహారాష్ట్రకు చెందిన రచయిత అని అంటరానితనం మరియు కుల వ్యవస్థ నిర్మూలన కోసం పని చేశారు అని మరియు మహిళలు అణగారిన ప్రజలను విద్యావంతులను చేయడంలో అతని ప్రయత్నo మన్నతమైనది అని కొనియాడారు. మరియు వారి భార్య అయిన సావిత్రీబాయి ఫూలే భారతదేశంలో స్త్రీల విద్యకు మార్గదర్శకులు అని గుర్తు చేశారు.వారు అనుచరులతో కలిసి సత్యశోధక్ సమాజ్ ను స్థాపించి అట్టడుగు కులాల ప్రజలకు సమాన హక్కు

వైకాపా రాజకీయ పార్టీనా? ఉగ్రవాద సంస్థా - పవన్ కళ్యాణ్

Image
- వైకాపాను దెబ్బ కొట్టాలంటే ప్రధానికి చెప్పను..నేనే చేస్తా - పవన్ మంగళగిరి, త్రిశూల్ న్యూస్ : ''వైకాపా రాజకీయ పార్టీనా? ఉగ్రవాద సంస్థా? మా వాళ్లను బెదిరిస్తారా? మాకు ఎవరూ అండగా ఉండకూడదా? రాజకీయం మీరే చేయాలా?మేం చేయలేమా? చేసి చూపిస్తాం.. ఫ్యూడలిస్టిక్‌ కోటలు బద్దలు కొట్టి తీరుతాం'' అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తామని.. మాకు ఓట్లు వేసినా, వేయకపోయినా అండగా ఉంటానని చెప్పారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇప్పటం ఇళ్ల కూల్చివేత బాధితులతో ఆయన సమావేశమయ్యారు. బాధితులకు రూ.లక్ష చొప్పున పవన్‌ ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాది రౌడీసేన కాదు.. విప్లవసేన..! యువత కోసం ఆలోచించే నేతలు పాలకులుగా రావాలని పవన్‌కల్యాణ్‌ ఆకాంక్షించారు. తమది రౌడీ సేన కాదని.. విప్లవసేన అని వ్యాఖ్యానించారు. ఇంతగా అభిమాన బలం ఉన్న నన్నే ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇప్పటంలో గ్రామస్థుల గడపలు కూల్చడాన్ని తాను మర్చిపోనన్నారు. అక్కడ కూల్చిన ప్రతిదీ తన గుండెపై

చత్తీస్‎గఢ్‎లో భారీ ఎన్‎కౌంటర్.. ఆరుగురు నక్సల్స్ మృతి..!

Image
చత్తీస్‎గఢ్‎, త్రిశూల్ న్యూస్ : చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు నక్సల్స్ మరణించారు. బస్తర్ ప్రాంతంలోని పోమ్రా-హల్లూరు అడవిలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. బస్తర్ ప్రాంతంలోని పోమ్రా-హల్లూరు అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ బీజాపూర్ డివిజనల్ కమిటీ సభ్యులు మోహన్ కడ్తి, సుమిత్రతో పాటు సుమారు 40 మంది మావోలు సమావేశమైనట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సెంట్రల్ రిజర్వు ఫోర్స్, జిల్లా రిజర్వు బలగాలు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా కూంబింగ్ ప్రారంభించాయి. మావోలు ఉన్న ప్రాంతం సమీపానికి వెళ్లిన పోలీసులపై మావోలు కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. దాదాపు గంటకు పైగా ఎదురుకాల్పులు కొనసాగాయి. ఆ తరువాత ఆ ప్రాంతంలో నాలుగు మృతదేహాలు కనిపించాయని పోలీసులు వివరించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని, ఆ నలుగురు మావోలు మృతిచెందారు. మరో ముగ్గురు మావోయిస్టులు గాయపడినట్లు తెలిపారు. మావోల సమాచారం రాగానే, టీమ్ లుగా ఏర్పడి, తెల్లవారు జాము నుంచే గాలింపు చేపట్టామని, అనంతరం ఉదయం 7.30గంటల ప్రాంతంలో ఎన్ కౌంటర్ ప్రారంభమైందని పోలీసులు

మహాభారతాన్ని తలపించేదే పల్నాటి యుద్ధం..!

Image
- దాయాదుల పోరుతో గురజాల, మాచర్ల రాజ్యాలు - పౌరుషనికి ప్రతీక పల్నాటి కార్యమపూడి ఉత్సవాలు - రాచగావుతో ప్రారంభం కానున్న పల్నాటి వీరారాధన ఉత్సవాలు పల్నాడు, త్రిశూల్ న్యూస్ : పౌరుషాల పురిటిగడ్డ పలనాటి సీమ నాటి రణ క్షేత్రమే ఒకప్పటి కార్యమపూడి నేటి కారంపూడి యుద్ధంలో అసురుబాసిన వీరులను స్మరించుకుంటూ జరిపే ఉత్సవాలే పల్నాటి వీరాచారా ఉత్సవాలు. ఇలాంటి ఉత్సవాలు ప్రపంచంలో రోమ్ దేశంలో జరపగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా కారంపూడిలో ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయి. కార్తీకపౌర్ణమి నాడు పోతురాజుకు పడిగాం కట్టి ఉత్సవాలకు అంకురార్పణ ప్రారంభం అవుతుంది. ఆ తరువాత కార్తీక అమావాస్య రోజున ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. రచగావు, రాయబారం, మందపోరు, కోడిపోరు, కల్లిపాడు అనే నామాలతో ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి.11వ శతాబ్దంలో కారంపూడి నాగులేరు వడ్డునే గల రణభూమిలో యుద్ధం జరిగినట్లు చరిత్ర చెపుతుంది. కార్తీక అమావాస్య రోజునే పల్నాటి ఉత్సవాలు ఎందుకు ప్రారంభం అవుతాయి అంటే పల్నాటి యుద్ధ సమయంలో కార్తీక అమావాస్య నుండి ఐదు రోజుల పాటు యుద్ధం జరిగింది. అందువలనే పల్నాటి వీరారాధన ఉత్సవాలు ఐదు రోజులు జరు

భూముల రీ సర్వేపై విమర్శలేంటి..ఈ సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారు..?

Image
అమరావతి, త్రిశూల్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ రికార్డుల విషయంలో సమూల మార్పునకు శ్రీకారం చుట్టింది. భూముల రీ సర్వే, రికార్డుల సమగ్ర ప్రక్షాళన చేస్తామని సర్కారు అంటోంది. 'వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం' పేరుతో ఈ కార్యక్రమం జరుగుతోంది. తొలివిడత 2వేల గ్రామాలలో ఈ ప్రక్రియ పూర్తయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆయా గ్రామాల్లో భూ యజమానులకు హక్కు పత్రాల పంపిణీ కూడా ప్రారంభించారు. మరో ఐదు విడతల్లో వచ్చే ఏడాది డిసెంబర్ ఆఖరికి అన్ని గ్రామాల్లోనూ ఈ రీ సర్వే పూర్తవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రయత్నం వల్ల జరిగే మార్పులేంటి, సర్వే నిర్వహించిన చోట ఏం జరుగుతోంది, కొత్త విధానం ద్వారా కలిగే ప్రయోజాలేమిటనేది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఏం చెబుతోంది... దేశంలో భూమి రికార్డులను వందేళ్ల క్రితం ఆధునికీకరించారు. 1923-24 సంవత్సరాల్లో భూములను కొలిచి ఫీల్డ్ మెజర్ మెంట్ బుక్ (ఎఫ్ఎంబి) పేరుతో నమోదు చేశారు. దేశ వ్యాప్తంగా నేటికీ దాని ఆధారంగానే సర్వే నెంబర్లున్నాయి. బ్రిటిష్ హయంలో పాతిన సర్వే రాళ్ల కేంద్రంగానే నేటికీ భూములను కొలుస్తుంటారు. ఈ

టీఆర్‌ఎస్‌ పార్టీలో సర్వే గుబులు..!

Image
- కష్టపడితే గెలిచేవి మరో ఐదుస్థానాలు - ఆరు స్థానాల్లో ఎదురుగాలి కరీంనగర్‌, త్రిశూల్ న్యూస్ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై చర్చ జోరుగా సాగుతోంది. ఇంత కాలం రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు పోతారంటూ ప్రచారం జరుగగా, తాజాగా ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయో రావో కానీ అన్ని పార్టీల్లో అప్పుడే గుబులు మొదలైంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ దానిని నిలబెట్టు కోవడానికి పకడ్బందీ ప్రణాళికను రూపొందించుకుంటున్నది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియోజకవర్గాల్లో పలు దఫాలుగా రాష్ట్ర పోలీస్‌శాఖలోని పలు విభాగాల ద్వారా అలాగే ప్రైవేట్‌ సర్వే సంస్థలతో పార్టీ పరిస్థితి, ప్రస్తుత ఎమ్మెల్యే పరిస్థితి, పార్టీకి ప్రజల్లో వస్తున్న సానుకూలత, పథకాలపై ప్రజా అభిప్రాయం ఎలా ఉందో అనే అంశాలతో సర్వే చేయిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు ఈ సర్వేలు నిర్వహించి చివరగా ఇటీవల జరిగిన సర్వేతో ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. తాజా సర్వే నివేదికల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ స్థా

జగనన్న కాలనీ నిర్మాణ పనులు వేగవంతం చేయండి - కమిషనర్ హరిత

Image
నెల్లూరు, త్రిశూల్ న్యూస్ : నవరత్నాలు పధకంలో భాగంగా పేదలందరికీ శాశ్వత గృహ వసతి కల్పించే దిశగా రూపొందిస్తున్న జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ హరిత ఆదేశించారు. స్థానిక 53 వ డివిజన్ వెంకటేశ్వరపురంలోని జగనన్న కాలనీ లే అవుట్లను అధికారులతో కలిసి కమిషనర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లబ్ధిదారుల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న గృహాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. సచివాలయ అమెనిటీస్ కార్యదర్శులు లే అవుట్ల నిర్మాణ పనుల్లో పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తూ, అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యుత్తు, వీధి దీపాలు, మంచినీరు, డ్రైన్లు, రోడ్డు మార్గాలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించి లబ్ధిదారులకు గృహాలను కేటాయించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ విభాగం డి.ఈ, ఏ.ఈ, సచివాలయం కార్యదర్శులు, నగర పాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

వ్యర్ధాల రీసైక్లింగ్ ద్వారా సంపద సృష్టి - కమిషనర్ అనుపమ

Image
తిరుపతి, త్రిశూల్ న్యూస్ : సమాజంలో పనికిరాని వ్యర్థాల ద్వారా సంపద సృష్టించడం జరుగుతున్నదని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. స్కాచ్ అవార్డుల కేటగిరికి సంబందించి శుక్రవారం దేశంలోని ఎంపిక కాబడిన ప్రధాన నగరాల నుండి వర్చువల్ విధానంలో స్కాచ్ అవార్డుల సెలక్షన్ కమిటితో జరిగిన సమావేశంలో అనుపమ అంజలి తన ప్రజెంటేషన్ గురించి వివరిస్తూ ఇంటిగ్రేటెడ్ సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పెసిలిటి కేటగిరిలో తమ తిరుపతి కార్పొరేషన్ నామినేషన్ వేయడాన్ని వివరిస్తూ తడి, పొడి వ్యర్థాల ప్రాససింగ్ చేయడం ద్వారా వస్తున్న ప్రయోజనాలను వివరించారు. ఇండ్ల వద్ద నుండే తడి పొడి చెత్తను విడదీసి సేకరించి ప్లాంట్ కు తరలిస్తున్నామని, అక్కడ తడి చెత్తను ఎరువులుగా మార్చి వ్యవసాయదారులకు తక్కువ ధరతో అందించడం జరుగుతున్నదని, పొడి చెత్తలోని ప్లాస్టిక్ ను సిమెంట్ ప్యాక్టరీలకు అమ్ముతున్నట్లు, భవన వ్యర్ధాలను రోడ్ సైడ్ వేసే టైల్స్, రోడ్ల నిర్మాణాలకు, గుంతలు పూడ్చేందుకు ఉపయోగిస్తున్నట్లు, అదేవిధంగా మురికినీటి అనేక దశల్లో శుద్ది చేసి ప్యాక్టరీలకు ఆ నీటిని అమ్మడం జరుగుతున్నదన్నారు. బయో గ్యాస్ ను కూడా ఉత్పత్తి చేయ

సారె ఊరేగింపు మార్గంలో ఏర్పాట్లు చేయండి - కమిషనర్ అనుపమ

Image
తిరుపతి, త్రిశూల్ న్యూస్ : శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల నుండి తీసుకువచ్చే సారె ఊరేగింపు మార్గంలో పారిశుద్ధ్యం, తదితర ఏర్పాట్లు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి ఇంజినీరింగ్, పారిశుద్ధ్య అధికారులను ఆదేశించారు. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పంచమీ తీర్థం రోజున తిరుమల శ్రీవారి నుండి అమ్మవారికి సారె తీసుకురానున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో సారె ఊరేగింపు జరగనున్న మార్గంలోని అలిపిరి, వివేకానంద కూడలి, కోమలమ్మ సత్రం, చిన్నబజారు వీధి, పూలవీధి, ఉత్తర మాడావీధి, బండ్లవీధి, ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, సుబ్బలక్ష్మి కూడలి, రామానుజ కూడలి, లక్ష్మీపురం కూడలి తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య, రోడ్డు పనులను అధికారులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పంచమీతీర్థం రోజున సారె ఊరేగింపు జరిగే మార్గాల్లో రోడ్డు లో ఎటువంటి గుంతలు లేకుండా పూడ్చి తారు రోడ్డు వేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే ఎక్కడా చెత్త చెదారం లేకుండా తగుచర్యలు తీసుకోవాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. సారెతో పాటు వచ్చే భక్తులకు, అధికారులకు, సిబ్బందికి ఎవ్వ

ఓటరు నమోదుపై అవగాహన పెంచండి - కమిషనర్ హరిత

Image
నెల్లూరు, త్రిశూల్ న్యూస్ : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాల మేరకు స్పెషల్ సమ్మరీ రివిజన్ ఆఫ్ ఎలెక్టోరల్ రోల్స్ 2023 లో భాగంగా ఏర్పాటు చేసిన కాంపెయిన్ ల ద్వారా అర్హులైన వారిని నూతన ఓటర్లుగా నమోదు చేయించాలని కమిషనర్ హరిత ఆదేశించారు. నగర పాలక సంస్థ ఎన్నికల విభాగం, తహశీల్దార్ లతో సమీక్షా సమావేశాన్ని కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర జనాభాతో పోల్చితే ప్రస్తుతం ఉన్న ఓటర్ల సంఖ్య తక్కువగా ఉందని తెలిపారు. అర్హులైన ఓటర్ల సంఖ్యను పెంచేందుకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి తిరిగి నూతన ఓటర్ల నుంచి ఫారం 6,7,8 క్లెయిమ్ లను సేకరిస్తారని తెలిపారు. 09-11-22న ప్రచురించిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టును బూత్ లెవెల్ అధికారుల వద్ద అందుబాటులో ఉంచామని, ఓటర్లు పరిశీలించుకుని ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కమిషనర్ సూచించారు. నూతన ఓటరు నమోదు, ఓటరు వివరాల మార్పు చేర్పులకై అవసరమైన అన్ని ఫారములు అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయని, ఓటర్లంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో అర్బన్ తహశీల్దార్, ల్యాండ్ అక్విజేషన్

టిడ్కో గృహాలకు రుణాలు మంజూరు చేయించండి - కమిషనర్ హరిత

Image
నెల్లూరు, త్రిశూల్ న్యూస్ : నవరత్నాలు పధకంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ గృహాలు అందించే కార్యక్రమంలో భాగంగా నిర్మించిన టిడ్కో గృహాలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి, లబ్ధిదారులకు త్వరితగతిన కేటాయించాలని అధికారులను కమిషనర్ హరిత ఆదేశించారు. టిడ్కో గృహాల కేటాయింపు ప్రగతిపై మెప్మా, హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులతో బ్యాంకు ఖాతాలు తెరిపించి, గృహ రుణాలను వేగవంతంగా మంజూరు చేయించాలని ఆదేశించారు. బ్యాంకులలో రుణాలు రిజెక్ట్ అయిన వారి వివరాలు సేకరించి తిరిగి రుణాలు మంజూరు చేసేందుకు కృషి చేయాలని కమిషనర్ సూచించారు. టిడ్కో గృహాలు మంజూరైనప్పటికీ స్వీకరించేందుకు ఆసక్తి చూపని లబ్ధిదారులతో ప్రత్యేకంగా మాట్లాడి గృహాలు కేటాయించేలా చూడాలని కమిషనర్ ఆదేశించారు. ఇతర ప్రాంతాల్లో తాత్కాలికంగా స్థిరపడిన గృహాల లబ్ధిదారులకు సమాచారం అందించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. టిడ్కో గృహ సముదాయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి త్వరితగతిన లబ్ధిదారులకు అందుబాటులోకి తేవాలని

ప్లాస్టిక్ కవర్ల నిషేధం కఠినంగా అమలు చేయాలి - కమిషనర్ హరిత

Image
- పందుల నిర్మూలనకై ప్రత్యేక డ్రైవ్ నెల్లూరు, త్రిశూల్ న్యూస్ : నగరంలో సమస్యాత్మకంగా మారిన పందుల బెడదను నివారించడానికి ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించాలని, జనావాసాల మధ్య వాటి సంచారాన్ని పూర్తిగా అరికట్టాలని నగర పాలక సంస్థ కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు. కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన స్పందన వేదికలో కమిషనర్ పాల్గొని ముందుగా డయల్ యువర్ కమిషనర్ ద్వారా 12 ఫిర్యాదులను అందుకున్నారు. అనంతరం ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకు సంబంధిత విభాగాలకు బదిలీ చేశారు. డస్ట్ బిన్ ల నిర్మూలనతో అన్ని డివిజనుల్లో పశువులు, కుక్కలు, పందులకు ఆవాసం ఏర్పడకుండా జాగ్రత్తలు వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందికరంగా మారిన పశువులు, పందుల ఏరివేతను స్పెషల్ డ్రైవ్ ల ద్వారా ప్రణాళికాబద్ధంగా చేపట్టి, పారిశుద్ధ్య నిర్వహణను పటిష్టంగా నిర్వహిస్తామని కమిషనర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ కవర్ల ఉత్పత్తి, అమ్మకం, వాడకం తదితర అంశాలపై దృష్టి సారించి, నిబంధనలను కఠినంగా అమలుచేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. నిషేధిత ప్లాస్టిక్ ఉత్పాదక సంబంధిత వాణి

ఇండోనేషియాలో భారీ భూకంపం..20మంది మృతి..!

Image
ఇండోనేషియా, త్రిశూల్ న్యూస్ : భారీ భూకంపం ఇండోనేసియాను కుదిపేసింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సుమారు 300 మందికి గాయాలయ్యాయి. వందల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయి. పశ్చిమ జావా ప్రావిన్స్‌లోని సియాంజూర్ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. ఇస్లామిక్‌ బోర్డింగ్‌ స్కూల్‌, ఆస్పత్రి సహా అనేక భవనాలు దెబ్బతిన్నాయి. గ్రేటర్‌ జకార్తా ప్రాంతంలో భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఎత్తైన భవనాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. పెద్ద పెద్ద అపార్టుమెంట్లలో ఉన్న ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.

బారతీయ నారీ శక్తికి నిలువెత్తు రూపం ఝాన్సి లక్ష్మీ బాయి - ఎన్ పి ఐ

Image
- గోదావరిఖనిలో ఘనంగా ఝాన్సి లక్ష్మీ బాయి 195వ జయంతి వేడుకలు గోదావరిఖని, త్రిశూల్ న్యూస్ : బారతీయ నారీ శక్తికి నిలువెత్తు రూపం ఝాన్సి లక్ష్మీ బాయి అని న్యూ ఇండియా పార్టీ అధ్యక్షులు డా.జె వి రాజు,  ఉపాధ్యక్షలు మాదరబోయిన నర్సయ్య, వేముల అశోక్, గంట బబిత సోని, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి అన్నారు. శనివారం గోదావరిఖనిలోని న్యూ ఇండియా పార్టీ కార్యాలయంలో ఝాన్సి లక్ష్మీ బాయి 195వ జయంతి వేడుకలు న్యూ ఇండియా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు గంట బబిత సోని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. ఒక పక్క ధీరత్వం మరో పక్క మాతృత్వం రెండు కలబోసిన ఉత్తేజం ఆమెది అని కొనియాడారు. అస్తిత్వం కొరకు చివరి రక్తం బొట్టు వరకు పోరాడి వీర మరణం పొందిన వనిత లక్ష్మీ భాయి అని అన్నారు. ఆమె 1828వ సంవత్సరం నవంబర్ నెల 19న మహారాష్ట్రలోని సతార అనే ప్రాంతంలో జన్మించారు అని ఆమె అసలు పేరు మనికర్ణిక అని తెలిపారు. ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తన వీర పరాక్రమంతో బ్రిటీష్ వారిని గడ గడ లాడించి దేశ వాసులలో స్వాతంత్ర్య కాంక్ష రగిలించి భరతమాత దాస్య శ్రుంకలాలను విముక్తి చేసే ధ్యేయంతో తన ప

పుట్టినరోజు వేడుకలో విషాదం.. 21మంది సజీవదహనం..!

Image
పాలస్తినా, త్రిశూల్ న్యూస్ :  పాలస్తీనా గాజా నగరంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో శరణార్థుల శిబిరంలో పెను విషాదం నెలకొంది. గాజా స్ట్రిప్ లోని ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 21మంది సజీవ దహనమయ్యారు. ఆ ఇంట్లో అప్పటి వరకు ఆనందంగా జరుగుతున్న ఓ పుట్టిన రోజు వేడుక కాస్త చివరికి విషాదంగా ముగిసింది. ఈ ప్రమాదంలో ఓ కుటుంబమే తుడిచిపెట్టుకు పోయింది. ఈ ప్రమాదంలో 21 మంది చనిపోగా వారిలో 17మంది ఒకే కుటుంబీకులు కావడం హృదయాలను పిండేస్తోంది. సజీవ దహనం అయిన వారిలో 7గురు చిన్నారులు ఉన్నారు. గాజాలోని అత్యధిక జనసాంద్రత ఉండే జబాలియా శరణార్థుల క్యాంపు ప్రాంతంలోని నాలుగంతస్తుల ఇంట్లో మంటలు చెలరేగాయని అధికారులు చెప్పారు. జబాలియా శరణార్థుల శిబిరంలో తొలుత మొదటి అంతస్తులో ప్రమాదం అంటుకుంది. అనంతరం మూడు అంతస్తులకు వ్యాప్తి చెందాయని అధికారులు చెబుతున్నారు. ఇంట్లో నిల్వచేసిన పెట్రోలుకు మంటలు అంటుకోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని చెబుతున్నా.. దానికి మంటలు ఎలా అంటుకున్నాయన్న దానిపై స్పష్టత లేదు. ఆ ఇంట్లో ఓ చిన్నారి పుట్టిన రోజు వేడుకతోపాటు, ఈజిప్టు నుంచి ఓ వ్యక్తి రావడంతో ఆనందంతో అందరూ కలిసి వ

నేడు వీరనారి ఝాన్సి లక్ష్మీ బాయి జయంతి సందర్బంగా ప్రత్యేక కథనం..!

Image
త్రిశూల్ న్యూస్ డెస్క్ : ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక.  ఆమె సరిగ్గా ఇదే రోజు అనగా 1828వ సంవత్సరము నవంబరు నెల19న మహారాష్ట్రకు చెందిన సతారలో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ పంచమీ నాడు జన్మించింది. డీ.బీ పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణీ నవంబర్ 19, 1835 వసంవత్సరంలో జన్మించినట్లు ఆమె జీవిత చరిత్రలో పేర్కొన్నాడు. కానీ దీనికి వేరే చారిత్రక ఆధారాలు లేకపోవడం వలన 1828 అన్ని చోట్లా ఆమోదింపబడుతున్నది. దీనికి ఆధారం 1854లో జాన్ లాంగ్ అనే ఆంగ్లేయుడు రాణిని కలవడానికి వెళ్ళినపుడు ఆమె తరుపు గుమస్తా ఆయనకు రాణీ 26 ఏళ్ళ స్త్రీ అని చెప్పడం జరిగింది. ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే, భాగీరథీబాయిలు. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనది, ఆధ్యాత్మిక దోరణి మెండుగా కలది. పేరు మణికర్ణిక కాగా ఆమెను ముద్దుగా మను అని పిలుచుకునేవారు. ఆమె తల్లి రాణి నాలుగేళ్ళ ప్రాయంలో ఉండగానే కన్ను మూసింది. దాంతో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది. పంత్ ను బిఠూర్ కు పిలిపించి ఆశ్రయమిచ్చి ఆదుకున్నాడు. బాజీరావుకు సంతానం లేకపోవడంతో నానా సాహెబ్ అనే బాలుని ద

ప్రకృతి వ్యవసాయంను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టండి - జడ్పీ చైర్మన్

Image
- విత్తనాలు ఎరువులు ఆర్ బికేలలో అందుబాటులో ఉంచండి - జిల్లా కలెక్టర్   చిత్తూరు, త్రిశూల్ న్యూస్ : జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సాగును మరింత ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టాలని జెడ్పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన జెడ్పి చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సాగును ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వేరుశనగ, చిరుధాన్యాల విత్తనాలను ప్రతి ఆర్బికేలలో అందుబాటులో ఉంచేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో నీరు పుష్కలంగా ఉందని, హార్టికల్చర్ పంటలు బాగా పండించడం జరుగుతోందని, దీనితో పాటు కాయగూరలు పండించడం మరియు చిరుధాన్యాల పంట సాగును ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేందుకు రైతులకు మరింత అవగాహన పెంచాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రైతులకు అండగా నిలిచేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతున్నదని, లాభసాటి వ్యవసాయం చేసేందుకు అవసరమైన సలహాలు సూచనలను అందించేందుకు రైతు భరోసా కేంద్రాలను

రాహుల్‌ గాంధీని చంపుతామంటూ బెదిరింపు లేఖ..?

Image
- యాత్రలో చేరిన మహాత్మా గాంధీ ముని మనవడు మహారాష్ట్ర, త్రిశూల్ న్యూస్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆయనను చంపుతామంటూ బెదిరింపు లేఖ ప్రత్యక్షమైంది. మహారాష్ట్రలో పర్యటన ముగించుకుబోతున్న రాహుల్ మధ్య ప్రదేశ్ చేరుకోనున్నారు. రాహుల్ అక్కడికి అడుగుపెట్టక ముందే ఆయనకు ఒక బెదిరింపు లేఖ ప్రత్యక్షమైంది. మధ్య ప్రదేశ్ రాజధాని ఇండోర్‌, జుని పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఒక స్వీట్ షాపు వద్ద ఈ లేఖ కనిపించింది. ఈ లేఖలో రాహుల్ ఇండోర్ వచ్చిన వెంటనే వీలైనంత త్వరగా ఆయనను చంపుతామని పేర్కొన్నారు. దీంతో ఈ అంశంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. లేఖ ఎవరు అక్కడికి చేర్చారు అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ యాత్రలో శుక్రవారం ఉదయం మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ రాహుల్ గాంధీని కలిశారు. బుల్దానా జిల్లాలోని షెగావ్ ప్రాంతంలో యాత్ర సాగుతుండగా, తుషార్ గాంధీ రాహుల్‌ను కలిశారు. ఆయనతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ అంశంపై తుషార్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నేను

మహిళలపై దాడులను.. హత్యలను అరికట్టండి - ఎన్ఐపి

Image
- న్యూ ఇండియా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు గంట బబిత సోని పిలుపు హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ : మహిళలపై దాడులు, హత్యలు హత్యాచారాలు రాష్ట్రంలో దేశంలో అధికంగా జరుగుతున్నాయి అని న్యూ ఇండియా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు గంట బబిత సోని మండి పడ్డారు. ఇటీవలనే దేశరాజధానిలో ఆఫ్టాబ్ శ్రద్ద అనే యువతిని ఆమె ప్రియుడు అమీన్ పూనావాలా అనె మనిషి రూపంలో ఉన్న క్రూర మృగం అతి కిరాతకంగా హత్య చేసి చంపడాన్ని గంట బబిత సోని తీవ్రంగా ఖండించారు. శ్రద్దాను హత్య చేసి మృతదేహాన్ని 35 ముక్కలు చేసిన అమీన్ పూనావాలాకు ఉరిశిక్ష వేయాలని న్యూ ఇండియా పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. సహజీవనంలో ఉంటున్న శ్రద్ధ పెళ్లిపై ఒత్తిడి తెచ్చినందుకే కోపంతో అఫ్తాబ్ శ్రద్ధను గొంతుకోసి చంపినట్లు తెలిపారు. ప్రస్తుత సమాజంలో మహిళలకు రక్షణ కరువైంది అని అన్నారు. మహిళలు బయట ఇంట్లో నమ్మిన మనుషుల దగ్గర కూడా అభద్రతా భావంతో ఉండవలసి రావడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలి అని కోరారు. మహిళా లోకం దైర్యంగా ఉండాలి అని ఇలాంటి చర్యలు ఎదురైనప్పుడు ప్రతిగంటించాలి అని న్యూ ఇండియా పార్టీ జాతీ

నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ - ఎస్..!

Image
శ్రీహరికోట, త్రిశూల్ న్యూస్ : దేశంలోనే తొలి ప్రైవేట్‌ రాకెట్‌ విక్రమ్‌ -ఎస్‌ నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం రాకెట్‌ ప్రయోగం జరిగింది. దేశీయంగా ప్రైవేట్‌ రంగంలో రూపొందిన మొదటి రాకెట్‌ విక్రమ్‌ -ఎస్‌ హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరో స్పేస్‌ సంస్థ ఈ ప్రైవేట్‌రాకెట్‌ను రూపొందించింది. ‘మిషన్‌ ప్రారంభ్‌’ విజయవంతమైందని ప్రకటించారు సైంటిస్టులు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్‌ రంగానికి నాంది పలుకుతూ ప్రైవేట్‌రంగంలో రూపొందిన తొలి రాకెట్‌ విక్రమ్‌ –ఎస్‌ రాకెట్‌కు అంతరిక్ష ప్రయోగాలకు ఆధ్యులైన డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌ పేరిట విక్రమ్‌ –ఎస్‌ అని నామకరణం చేశారు. స్కైరూట్‌ ఏరోస్పేస్‌ రూపొందించిన విక్రమ్‌ –ఎస్‌ రాకెట్‌ మొత్తం బరువు 545 కేజీలు. ఎత్తు ఆరు మీటర్లు. మిషన్‌ ప్రారంభ్‌ విజయోత్సాహంతో.. ఇది కొత్త ప్రారంభం అని ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌ ప్రకటించారు. మన అంతరిక్ష ప్రయోగాల్లో ఇదో కొత్త అధ్యాయమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు.