వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్
- పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఏడాదిన్నరగా జీతాలు కూడా చెల్లించలేదా? - ఒక్కో విభాగం లెక్కలు చూస్తుంటే వైసీపీ పాలకుల ఆర్థిక అరాచకం ఆందోళన కలిగిస్తోంది - బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్లకు పనులు ఎలా అప్పగించారు? - అలాంటి కాంట్రాక్టర్లకు బిల్లులు ఏ మేరకు చెల్లించారో నివేదిక ఇవ్వండి - గ్రామాలవారీగా చేపట్టిన పనుల వివరాలు స్థానిక ప్రజలకు తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయాలి - పి.ఆర్. అండ్ ఆర్డీ, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఇంజినీరింగ్ విభాగాల సమీక్షలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ అమరావతి, త్రిశూల్ న్యూస్ : డేటా ఎంట్రీ ఆపరేటర్లు లాంటి చిరుద్యోగులకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం మూలంగా ఆ చిన్నపాటి ఉద్యోగుల కుటుంబాలు వేదనతో ఉన్నాయి.. ఒక్కో విభాగం లెక్కలు చూస్తుంటే వైసీపీ పాలకుల ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పి.ఆర్. అండ్ ఆర్డీ, ఆర్.డబ్ల్యూ.ఎస్., పర్యావరణ, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కచ్చితంగా ప్రతి శాఖలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపుపై సమగ